Women’s T20 World Cup 2026 : ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫైట్.. మహిళల టీ20 వరల్డ్ కప్ కంప్లీట్ షెడ్యూల్ ఇదే
Women's T20 World Cup 2026 : లీగ్ దశలో భాగంగా అన్ని జట్లు తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో తలపడాల్సి ఉంటుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తమ అత్యంత బలమైన స్క్వాడ్స్‌ను అధికారికంగా ప్రకటించాయి. టోర్నీలో పాల్గొనే అన్ని జట్ల పూర్తి వివరాలు చూద్దాం.

Women’s T20 World Cup 2026 : ఇంగ్లాండ్ వేదికగా జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మెగా టోర్నమెంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ 12 జట్లు విశ్వవిజేతగా నిలిచేందుకు పోటీ పడుతున్నాయి. లీగ్ దశలో భాగంగా అన్ని జట్లు తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో తలపడాల్సి ఉంటుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తమ అత్యంత బలమైన స్క్వాడ్స్‌ను అధికారికంగా ప్రకటించాయి. టోర్నీలో పాల్గొనే అన్ని జట్ల పూర్తి వివరాలు చూద్దాం.
పటిష్టమైన బలగంతో బరిలోకి టీమిండియా
ఈసారి ఎలాగైనా ప్రపంచకప్ సాధించాలనే పట్టుదలతో ఉన్న భారత మహిళల జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన బాధ్యతలు చేపట్టనుంది. జట్టులో కీలక ఆటగాళ్లుగా షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యాస్తికా భాటియా, నందిని శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్ ఎంపికయ్యారు.
ఆస్ట్రేలియా
బలమైన ఆస్ట్రేలియా జట్టుకు సోఫీ మోలీనెక్స్ నాయకత్వం వహిస్తోంది. ఈ జట్టులో నికోలా కేరీ, యాష్లీ గార్డనర్, కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, గ్రేస్ హారిస్, అలనా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వోల్ మరియు జార్జియా వేర్హామ్ ఉన్నారు.
పాకిస్తాన్ జట్టు
ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుకు ఫాతిమా సనా కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. ఈ జట్టులో గుల్ ఫెరోజా, అయేషా జాఫర్, ఇరామ్ జావేద్, ఐమాన్ ఫాతిమా, అలియా రియాజ్, నటాలియా పర్వైజ్, సైరా జబీన్, మునీబా అలీ, తుబా హసన్, రామీన్ షమీమ్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, డయానా బేగ్, తస్మియా రుబాబ్ చోటు దక్కించుకున్నారు.
ఆతిథ్య ఇంగ్లాండ్ టీం
సొంత గడ్డపై ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టుకు నట్ సీవర్ బ్రంట్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఈ జట్టులో లారెన్ బెల్, అలిస్ కాప్సే, టిల్లీ కోర్టీన్-కోల్మన్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫిలర్, డాని గిబ్సన్, అమీ జోన్స్, ఫ్రెయా కెంప్, హీథర్ నైట్, లిన్సే స్మిత్, ఇస్సీ వాంగ్, డాని వ్యాట్-హాడ్జ్ ఉన్నారు.
సౌతాఫ్రికా టీం
అలాగే సౌతాఫ్రికా జట్టుకు లూయిస్ వోల్వార్ట్ సారథ్యం వహిస్తోంది. ప్రొటీస్ బలగంలో టాజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నేరీ డెర్క్సెన్, షబ్నిమ్ ఇస్మాయిల్, సినాలో జాఫ్తా, మరిజానే కాప్, అయాబొంగా ఖాకా, సునే లూస్, కరాబో మెసో, నాంకులులేకోలాంబా, కైలా రేనెకే, తుమీ శేఖుఖునే, క్లో టైరాన్, డేన్ వాన్ నీకెర్క్ ఉన్నారు.
న్యూజిలాండ్ జట్టు
న్యూజిలాండ్ మహిళల జట్టుకు అమేలియా కెర్ (మెలి కెర్) కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ జట్టులో సుజీ బేట్స్, సోఫీ డివైన్, ఫ్లోరా డెవాన్‌షైర్, ఇజ్జీ గేజ్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, బ్రీ ఇల్లింగ్, పాలీ ఇంగ్లిస్, జెస్ కెర్, రోజ్మేరీ మైర్, నెన్సీ పటేల్, జార్జియా ప్లిమ్మర్, ఇజ్జీ షార్ప్, లీ తహుహు ఉన్నారు.
శ్రీలంక టీం
ఆసియా కప్ ఛాంపియన్ శ్రీలంక జట్టుకు స్టార్ ప్లేయర్ చామరి ఆటపట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. లంక జట్టులో హసిని పెరీరా, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, ఇమేషా దులాని, నీలాక్షిక డి సిల్వా, కవీషా దిల్హారి, హన్సిమ కరుణారత్నే, కౌషిని నుత్యాంగన, సుగంధిక దాసనాయక, నిమాష మధుషాని, కావ్య కావింది, మల్కి మదార, మిథాలి అయోధ్య, చేతన విముక్తి ఉన్నారు.
వెస్టిండీస్ జట్టు
వెస్టిండీస్ జట్టుకు హేలీ మాథ్యూస్ సారథ్యం వహిస్తుండగా.. చినెల్ హెన్రీ, డియాండ్రా డాటిన్, స్టెఫానీ టేలర్, అఫీ ఫ్లెచర్, అలియా అల్లీన్, షెమైన్ కాంప్‌బెల్, అష్మిని మునిసార్, కరిష్మా రామ్హరక్, జాన్నిలియా గ్లాస్గో, జహజారా క్లాక్స్టన్, కియానా జోసెఫ్, జైదా జేమ్స్, మాండీ మంగ్రూ, షానిషా హెక్టర్ జట్టులో ఉన్నారు.
బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ టీమ్స్
బంగ్లాదేశ్ జట్టుకు నిగర్ సుల్తానా జోతీ కెప్టెన్‌గా, నహిదా అక్తర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు షార్మిన్ అక్తర్, శోభన మోస్తరీ, స్వర్ణ అక్తర్, రీతూ మోని, రాబేయ్ ఖాన్, ఫాహిమా ఖాతూన్, ఫరిహా ఇస్లాం, మరుఫా అక్తర్, సంజిదా అక్తర్, సుల్తానా ఖాతూన్, దిలారా అక్తర్, జువైరియా ఫెర్దౌస్, తాజ్ నెహార్ ఉన్నారు. ఐర్లాండ్ జట్టుకు గాబీ లూయిస్ నాయకత్వం వహిస్తుండగా అవా కానింగ్, క్రిస్టినా కౌల్టర్, అలనా డాల్జెల్, జార్జినా డెంప్సే, అమీ హంటర్, అర్లీన్ కెల్లీ, లూయిస్ లిటిల్, ఐమీ మాగైర్, లారా మెక్‌బ్రైడ్, కారా ముర్రే, లేహ్ పాల్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, రెబెక్కా స్టోకెల్, అలిస్ టెక్టర్ ఎంపికయ్యారు. స్కాట్లాండ్ జట్టుకు కాథరిన్ బ్రైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. నెదర్లాండ్స్ జట్టుకు బాబెట్ డి లీడే నాయకత్వం వహిస్తుండగా కారోలిన్ డి లాంజ్, ఫ్రెడరిక్ ఓవర్డిజ్క్, హన్నా లాంధీర్, హీథర్ సీగర్స్, ఐరిస్ జ్విల్లింగ్, స్టెర్రే కాలిస్ వంటి ఆటగాళ్లు తమ ప్రతిభను చాటడానికి సిద్ధంగా ఉన్నారు.
భారత జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్
ఈ టోర్నీలో భారత జట్టుకు సంబంధించిన మ్యాచ్‌ల విషయానికి వస్తే.. జూన్ 14న ప్రత్యర్థి పాకిస్తాన్‌తో టీమిండియా తన మొదటి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత జూన్ 17న నెదర్లాండ్స్‌తో, జూన్ 21న సౌతాఫ్రికాతో, జూన్ 25న బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. లీగ్ దశలో చివరిగా జూన్ 28న బలమైన ఆస్ట్రేలియా జట్టుతో భారత్ ఢీకొట్టనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లన్నీ భారత్‌కు అత్యంత కీలకం కానున్నాయి.
భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి?
భారతదేశంలోని క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌లను లైవ్‌లో వీక్షించడానికి ఐసీసీ అధికారిక బ్రాడ్కాస్ట్ భాగస్వాములతో ఒప్పందం కుదుర్చుకుంది. టీవీలో మ్యాచ్‌లను చూడాలనుకునే వారు స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్‌లో లైవ్‌ను ఆస్వాదించవచ్చు. ఇక మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లలో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా చూడాలనుకునే వారి కోసం జియోహాట్‌స్టార్ యాప్, వెబ్సైట్లో ఈ టోర్నీ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల కోసం స్కై స్పోర్ట్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, విల్లో టీవీ వంటి ప్లాట్‌ఫారమ్స్ అందుబాటులో ఉన్నాయి.
ప్రపంచకప్ మ్యాచ్‌లు జరిగే వేదికలు ఇవే
మహిళల టీ20 ప్రపంచకప్‌కు ఇంగ్లాండ్‌లోని మొత్తం ఏడు చారిత్రాత్మక మైదానాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. లీగ్ దశ, సూపర్ 8 మ్యాచ్‌లు మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, లీడ్స్‌లోని హెడింగ్లీ, సౌతాంప్టన్‌లోని హాంప్‌షైర్ బౌల్, బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికలుగా జరగనున్నాయి. ఇక టోర్నీలో అత్యంత కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లకు ద ఓవల్ మైదానం ఆతిథ్యం ఇస్తుండగా, ప్రతిష్టాత్మకమైన ఫైనల్ మ్యాచ్ లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
