KL Rahul : బ్యాట్‌కు బాల్ తగిలినా ‘నాకేం తెలియదు’ అన్నట్లు యాక్టింగ్.. రాహుల్ ప్రవర్తనపై నెటిజన్లు ఫైర్
KL Rahul : ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నాటౌట్ నిర్ణయం వివాదంగా మారింది. బ్యాట్‌కు బంతి తగిలినా క్రీజ్ వీడకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాహుల్ హాఫ్ సెంచరీతో పాటు 9,000 ఫస్ట్ క్లాస్ పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

KL Rahul : భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ మైదానంలో ఏకైక టెస్ట్ మ్యాచ్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, అందరూ ఊహించినట్లుగా భారత్‌కు ఆశించిన స్థాయిలో శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ కలిసి మొదటి వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పటికీ, క్రీజులో ఇద్దరూ పరుగుల కోసం చాలా ఇబ్బంది పడ్డారు. ఆఫ్ఘన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ భారత ఓపెనర్లను కట్టడి చేశారు. ఈ క్రమంలో ఈ జోడీని విడదీసేందుకు ఆఫ్ఘనిస్తాన్‌కు చాలా అవకాశాలు వచ్చాయి. మొదట గల్లీలో జైస్వాల్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను ఆఫ్ఘన్ ఫీల్డర్లు చేజార్చారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ చుట్టూ ఒక పెద్ద వివాదం రాజుకుంది.
వివాదానికి దారితీసిన కేఎల్ రాహుల్ నాటౌట్
మ్యాచ్‌లోని 11వ ఓవర్ మొదటి బంతి వద్ద ఈ డ్రామా చోటుచేసుకుంది. ఆఫ్ఘన్ బౌలర్ జియారర్ రెహ్మాన్ వేసిన గుడ్ లెంత్ డెలివరీని రాహుల్ కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. బౌలర్‌తో పాటు వికెట్ కీపర్, ఫీల్డర్లు గట్టిగా అంపైర్‌కు అప్పీల్ చేశారు. కానీ అంపైర్ ఏమాత్రం చలించలేదు. కీపర్ రెహ్మానుల్లా గుర్బాజ్ కూడా కెప్టెన్‌కు స్పష్టమైన సిగ్నల్ ఇవ్వలేకపోయాడు. దీనితో ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది DRS తీసుకోవాలా వద్దా అనే గందరగోళంలో పడిపోయాడు. బౌలర్, సెకండ్ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ గట్టిగా ఒత్తిడి చేసినప్పటికీ, కెప్టెన్ మాత్రం కీపర్ మాట విని రివ్యూ తీసుకోలేదు. కానీ ఆ తర్వాత టీవీ రీప్లేలో అల్ట్రా ఎడ్జ్ చూసినప్పుడు అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. బంతి బ్యాట్‌ను తాకుతూ వెళ్లినట్లు స్పష్టంగా పెద్ద స్పైక్ కనిపించింది.
క్రీడా స్ఫూర్తి లేదంటూ నెటిజన్ల తీవ్ర ఆగ్రహం
ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అయింది. అందులో బంతి బ్యాట్‌కు తగిలినప్పుడు.. అస్సలు ఎడ్జ్ కాలేదంటూ రాహుల్ అంపైర్‌కు సైగలు చేయడం కనిపించింది. రాహుల్ చేసిన ఈ పని వల్లనే ఆఫ్ఘనిస్తాన్ జట్టు కన్ఫ్యూజ్ అయి రివ్యూ తీసుకోలేదని స్పష్టమైంది. క్రికెట్ ప్రపంచంలో దీనిని జెంటిల్‌మన్ గేమ్‌గా భావిస్తారు కాబట్టి, బంతి బ్యాట్‌కు తగిలిందని తెలిసినప్పుడు రాహుల్ స్వయంగా క్రీజు వదిలి వెళ్లాల్సిందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అంపైర్‌ను, ప్రత్యర్థి జట్టును తప్పుదోవ పట్టించి రాహుల్ క్రీడా స్ఫూర్తిని మంటగలిపాడు అంటూ నెటిజన్లు ఎక్స్ వేదికగా అతనిపై తీవ్రంగా మండిపడుతున్నారు.
Kl Rahul today Hum Amar hain 😂 pic.twitter.com/ZZP583KW14
— Amit Dubey (@AmitHellboyz143) June 6, 2026
అవకాశాన్ని అందిపుచ్చుకుని హాఫ్ సెంచరీ
ఆఫ్ఘనిస్తాన్ చేసిన చిన్న తప్పు కేఎల్ రాహుల్‌కు పెద్ద లైఫ్ లైన్‌గా మారింది. దొరికిన అవకాశాన్ని రాహుల్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చాలా క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే రాహుల్ 7 ఫోర్ల సహాయంతో ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా రాహుల్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో 9,000 పరుగుల మైలురాయిని దాటి సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
KL RAHUL CHEATED
— Defenders of Delhi (@bhapahunter) June 6, 2026
ఐపీఎల్ ముగిసిన పది రోజులకే టెస్టుల్లో అదరహో
కేఎల్ రాహుల్ ఫార్మాట్ ఏదైనా సరే చాలా త్వరగా అడాప్ట్ అవుతాడని ఈ మ్యాచ్‌తో మరోసారి నిరూపితమైంది. కేవలం పది రోజుల క్రితం, అంటే మే 24న ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడుతూ రాహుల్ మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అంతటి వేగవంతమైన టీ20 ఫార్మాట్ ముగిసిన కొద్ది రోజులకే, ఏమాత్రం అసౌకర్యం లేకుండా రెడ్ బాల్ (టెస్ట్) క్రికెట్‌లో నిలకడగా రాణించడంపై క్రికెట్ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివాదం పక్కన పెడితే, రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ భారత్‌ను పటిష్ట స్థితికి చేర్చిందని చెప్పవచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
