AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎదుటివారి మైండ్‌ను రీడ్ చేయాలా..? జీవితాన్నే మార్చేసే సీక్రెట్ సైకాలజీ ట్రిక్స్ ఇవే..

ఇంటా, బయట మన మాటకు విలువ ఉండాలన్నా, అనుకున్న పనులు సులభంగా జరగాలన్నా కేవలం కష్టపడితేనే సరిపోదు.. మనుషుల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే నేర్పు కూడా ఉండాలి. చాలా సందర్భాల్లో ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎదుటివారి కోపాన్ని ఎలా తగ్గించాలో లేదా వారి నుంచి నిజాన్ని ఎలా రాబట్టాలో తెలియక తికమకపడుతుంటాం. అయితే కొన్ని రహస్య సైకాలజీ ట్రిక్స్ ఉపయోగిస్తే ఎలాంటి వ్యక్తినైనా క్షణాల్లో మనవైపు తిప్పుకోవచ్చని మీకు తెలుసా?

ఎదుటివారి మైండ్‌ను రీడ్ చేయాలా..? జీవితాన్నే మార్చేసే సీక్రెట్ సైకాలజీ ట్రిక్స్ ఇవే..
Psychology Hacks To Influence People
Krishna S
|

Updated on: Oct 12, 2026 | 8:49 PM

Share

సమాజంలో మన మాట చెల్లుబాటు కావాలన్నా, ఆఫీసుల్లో లేదా వ్యక్తిగత జీవితంలో ఇతరులతో సమర్థవంతంగా పనులు చేయించుకోవాలన్నా కేవలం కష్టపడితే సరిపోదు.. మనుషుల ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. మానవ మెదడు కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో ఎలా స్పందిస్తుందో తెలిపే సైకాలజీ సూత్రాలు తెలిస్తే చాలు.. ఎలాంటి వ్యక్తినైనా సులభంగా మన దారికి తెచ్చుకోవచ్చని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. రోజువారీ జీవితంలో ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇచ్చే 5 అధునాతన సైకాలజీ హ్యాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డోర్ ఇన్ ది ఫేస్ టెక్నిక్

ఎవరితోనైనా ఒక పనిని ఒప్పించాలనుకున్నప్పుడు, ముందుగా వారు కచ్చితంగా తిరస్కరిస్తారని తెలిసినా ఒక పెద్ద కోరికను కోరండి. వారు కుదరదు అని చెప్పిన వెంటనే.. సరే పోనీ, కనీసం ఈ చిన్న పనైనా చేయండి అని మీరు అసలు అనుకున్న పనిని అడగండి. ఎదుటి వ్యక్తికి మీ మొదటి ప్రతిపాదనను కాదన్నందుకు అంతర్గతంగా చిన్నపాటి అపరాధ భావం కలుగుతుంది. దాంతో రెండో చిన్న కోరికను వెంటనే అంగీకరించి ఆ గిల్ట్ నుంచి బయటపడటానికి దాదాపు 80 శాతం మంది అంగీకరిస్తారు.

పిగ్మాలియన్ ఎఫెక్ట్

ఇతరుల ప్రవర్తనను మార్చాలన్నా లేదా వారితో బాధ్యతాయుతంగా పని చేయించాలన్నా.. వారికి ముందుగానే ఒక గౌరవప్రదమైన గుర్తింపు ఇవ్వండి. ‘‘నాకు తెలుసు, నీలాంటి నిజాయితీపరుడు ఎప్పటికీ మాట తప్పడు’’ లేదా ‘‘టైమింగ్ పాటించే నువ్వు ఈ పనిని సమయానికి పూర్తి చేయగలవు’’ అని నమ్మకంగా చెప్పండి. ప్రజలు తమపై ఇతరులు ఉంచిన మంచి అభిప్రాయాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతో ఉపచేతనంగా ఆ అంచనాలకు తగ్గట్టే నడుచుకుంటారు.

బైస్టాండర్ ఎఫెక్ట్ బ్రేకర్

బహిరంగ ప్రదేశాల్లో లేదా ఏదైనా గుంపులో ఆపదలో ఉన్నప్పుడు ‘ఎవరైనా సాయం చేయండి అని సాధారణంగా అరిస్తే.. మరెవరో ఒకరు చూసుకుంటారు అని భావించి ఎవరూ ముందుకు రారు. దీన్నే బైస్టాండర్ ఎఫెక్ట్ అంటారు. ఇలాంటి సమయంలో గుంపులోని ఒక నిర్దిష్ట వ్యక్తిని సూచిస్తూ.. ‘‘సార్, ఆ బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి.. దయచేసి ఇటు రండి, నాకు సాయం కావాలి’’ అని నేరుగా పిలవండి. బాధ్యత మొత్తం ఆ ఒక్కరిపై పడటంతో వారు వెంటనే స్పందించి ముందుకు వస్తారు.

తప్పు సమాధానం టెక్నిక్

ఎవరి నుంచైనా దాగి ఉన్న అసలైన నిజాన్ని లేదా కీలక సమాచారాన్ని రాబట్టాలనుకుంటే నేరుగా ప్రశ్నలు అడగవద్దు. దానికి బదులుగా మీకు తప్పుగా తెలిసినట్లు ఒక సమాచారాన్ని చాలా నమ్మకంగా చెప్పండి. ఉదాహరణకు.. ‘‘ఆ ప్రాజెక్ట్ ఖర్చు కేవలం రూ.5 లక్షలే కదా?’’ అని అనండి. మనుషులకు సమాధానం చెప్పడం కంటే ఇతరులు చేసిన తప్పును సరిదిద్దడంలో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. దాంతో వెంటనే వారు ‘‘కాదు కాదు.. 5 కాదు, అసలు ఖర్చు 12 లక్షలు’’ అంటూ అసలు నిజాన్ని పూసగుచ్చినట్లు బయటపెడతారు.

కోపాన్ని కరిగించే పక్క సీటు ట్రిక్

ఆఫీస్ మీటింగ్‌లో లేదా ఇంట్లో ఎవరైనా మీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, మీపై విరుచుకుపడేందుకు చూస్తున్నారని తెలిస్తే.. వారికి ఎదురుగా కాకుండా సరిగ్గా వారి పక్క సీట్లోనే కూర్చోండి. శారీరకంగా పక్కపక్కనే కూర్చున్న వ్యక్తిపై నేరుగా అరవడానికి మానవ మనస్తత్వం తీవ్ర అసౌకర్యానికి గురవుతుంది. దాంతో వారి దూకుడు తగ్గి, మాట్లాడే తీరు వాటంతట అదే శాంతిస్తుంది.

Follow Us