ఐపీఎల్‌ కోసం ఆటతీరు మార్చుకోవద్దు-కోహ్లీ

విశాఖ: ప్రపంచకప్‌ ప్రణాళికల్లో ఉన్న ఆటగాళ్లు ఐపీఎల్‌లో చెడు అలవాట్లు చేసుకోవద్దని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ హెచ్చరించాడు. పనిభారాన్ని జాగ్రత్తగా సమీక్షించుకోవాలని సూచించాడు. మార్చి 23 నుంచి ఐపీఎల్‌ 12వ సీజన్‌ ఆరంభం కానుంది. లీగ్‌ ముగిసిన 12 రోజుల్లోనే ప్రపంచకప్‌ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో తన సహచరులు ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకోవాలని కోహ్లీ అన్నాడు. ‘ఆటగాళ్లు వన్డే తరహా ఆటశైలి, సాంకేతికత, ప్రాథమిక అంశాలకు దూరం కావొద్దు. ఐపీఎల్‌లో చేసుకొనే చెడు అలవాట్లు ఆటతీరు దెబ్బతీసే […]

ఐపీఎల్‌ కోసం ఆటతీరు మార్చుకోవద్దు-కోహ్లీ
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 06, 2019 | 7:58 PM

విశాఖ: ప్రపంచకప్‌ ప్రణాళికల్లో ఉన్న ఆటగాళ్లు ఐపీఎల్‌లో చెడు అలవాట్లు చేసుకోవద్దని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ హెచ్చరించాడు. పనిభారాన్ని జాగ్రత్తగా సమీక్షించుకోవాలని సూచించాడు. మార్చి 23 నుంచి ఐపీఎల్‌ 12వ సీజన్‌ ఆరంభం కానుంది. లీగ్‌ ముగిసిన 12 రోజుల్లోనే ప్రపంచకప్‌ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో తన సహచరులు ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకోవాలని కోహ్లీ అన్నాడు.

‘ఆటగాళ్లు వన్డే తరహా ఆటశైలి, సాంకేతికత, ప్రాథమిక అంశాలకు దూరం కావొద్దు. ఐపీఎల్‌లో చేసుకొనే చెడు అలవాట్లు ఆటతీరు దెబ్బతీసే అవకాశం ఉంది. సహచరులు తమ ఆటతీరుపై ఓ కన్నేసి ఉంచాలి. లీగ్‌ సమయంలో నెట్స్‌లోకి వెళ్లి అనవసర షాట్లు ప్రయత్నించి చెడు అలవాట్లు చేసుకుంటే బ్యాటింగ్ ఫామ్‌ పోతుంది. మళ్లీ ప్రపంచకప్‌లో ఫామ్‌లోకి రావడం కష్టం అవుతుంది. ఐపీఎల్‌ లో మీ జట్లు మంచి స్థానంలో ఉంటే 2, 3 మ్యాచ్‌లు విశ్రాంతి తీసుకోవడంలో తప్పులేదు. ఆటగాళ్లు తమ శరీరం, అలసట గురించి నిజాయతీగా వ్యవహరించాలి. మీకు ఎన్ని ప్రాక్టీస్‌ సెషన్లు అవసరమో గుర్తించాలి. అనవసరంగా రెండు మూడు గంటలు నెట్స్‌లో గడపొద్దు. ఆ సమయంలో విశ్రాంతి తీసుకొని మానసికంగా, శారీరకంగా సేదతీరాలి’ అని విరాట్‌ అన్నాడు.