AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boxing : బాక్సింగ్ రింగ్‌లో విషాదం.. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు బాక్సర్‌ల మృతి!

టోక్యోలోని కోరకూన్ హాల్‌లో జరిగిన రెండు వేర్వేరు బాక్సింగ్ మ్యాచ్‌లలో ఇద్దరు జపనీస్ బాక్సర్‌లు తలకు తీవ్ర గాయాల కారణంగా మరణించారు. బాక్సింగ్‌లో ఉన్న ప్రమాదాలను ఈ సంఘటనలు మరోసారి గుర్తు చేశాయి. ఈ దురదృష్టకర సంఘటనల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Boxing : బాక్సింగ్ రింగ్‌లో విషాదం.. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు బాక్సర్‌ల మృతి!
Boxing
Rakesh
|

Updated on: Aug 10, 2025 | 4:40 PM

Share

Boxing : సాహసం, పోరాటానికి మారుపేరుగా నిలిచే బాక్సింగ్ రింగ్.. జపాన్‌లో విషాదాన్ని మిగిల్చింది. ఒకే ఈవెంట్‌లో జరిగిన రెండు వేర్వేరు మ్యాచ్‌లలో ఇద్దరు బాక్సర్లు మరణించడం బాక్సింగ్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. టోక్యోలోని కొరాకుఎన్ హాల్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో, తీవ్రమైన తల గాయాల కారణంగా ఇద్దరు యువ బాక్సర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా బాక్సింగ్ సంఘాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. టోక్యోలోని కొరాకుఎన్ హాల్‌లో ఆగస్టు 2న జరిగిన బాక్సింగ్ ఈవెంట్ బాక్సింగ్ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజుగా మిగిలింది. ఈ ఈవెంట్‌లో జరిగిన రెండు వేర్వేరు మ్యాచ్‌లలో 28 సంవత్సరాల వయసున్న ఇద్దరు బాక్సర్లు తలకు తీవ్ర గాయాలై మరణించారు. ఈ దుర్ఘటనతో బాక్సింగ్‌లో భద్రత ప్రమాణాలపై తీవ్ర చర్చ మొదలైంది.

మొదటి విషాదం: షిగెటోషి కొటారి

ఓరియెంటల్ అండ్ పసిఫిక్ బాక్సింగ్ ఫెడరేషన్ జూనియర్ లైట్‌వెయిట్ ఛాంపియన్షిప్ కోసం యమటో హాటాతో జరిగిన 12 రౌండ్ల మ్యాచ్‌లో షిగెటోషి కొటారి పాల్గొన్నారు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిన వెంటనే, కొటారి అస్వస్థతకు గురై రింగ్‌లోనే కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించి బ్రెయిన్ సర్జరీ చేసినప్పటికీ, శుక్రవారం (ఆగస్టు 8న) ఆయన తుది శ్వాస విడిచారు. కొటారి మెదడు, పుర్రె మధ్య రక్తం గడ్డకట్టడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.

రెండో విషాదం: హిరోమాసా ఉరకావా

ఆగస్టు 2న అదే ఈవెంట్‌లో యోజి సైటోతో జరిగిన మ్యాచ్‌లో 28 ఏళ్ల హిరోమాసా ఉరకావా పాల్గొన్నారు. ఈ మ్యాచ్‌లో ఉరకావా తలకు తీవ్ర గాయాలయ్యాయి, దీంతో నాకౌట్ అయ్యారు. ఆ వెంటనే అతనికి మెదడుకు సర్జరీ చేసినప్పటికీ, శనివారం (ఆగస్టు 9న) ఆయన కూడా మరణించారు.

బాక్సింగ్ సంఘాల స్పందన

ఈ రెండు మరణాలపై ప్రపంచ బాక్సింగ్ సంస్థ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. కొటారి మరణంపై “బాక్సింగ్ ప్రపంచం ఈ విషాదకరమైన మరణాన్ని చూసి విలపిస్తోంది. అతను రింగ్‌లో ఒక యోధుడు. అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. వారి కుటుంబాలకు, జపాన్ బాక్సింగ్ కమ్యూనిటీకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం” అని ఒక పోస్ట్‌లో తెలిపింది. ఉరకావా మరణం తర్వాత మరో పోస్ట్‌లో.. “ఈ హృదయం బద్దలయ్యే వార్త కొటారి మరణం తర్వాత ఒక రోజులోనే వచ్చింది. ఈ కష్టకాలంలో వారి కుటుంబాలకు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం” అని పేర్కొంది.

కొత్త భద్రతా నిబంధనలు

ఈ దుర్ఘటనల నేపథ్యంలో జపాన్ బాక్సింగ్ కమిషన్ అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఓరియెంటల్ అండ్ పసిఫిక్ బాక్సింగ్ ఫెడరేషన్(OPBF) టైటిల్ బౌట్‌ల రౌండ్లను 12 నుంచి 10కి తగ్గించాలని నిర్ణయించింది. బాక్సింగ్ క్రీడలో సేఫ్టీ స్టాండర్ట్స్ పెంచాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..