AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satish Kumar: బాక్సింగ్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరిన సతీష్‌ కుమార్‌. ఒలంపిక్స్‌లో మరో పతాకంపై ఆశలు రేపుతున్న ఆర్మీ ఆఫీసర్

Boxer Satish Kumar: టోక్యో ఒలంపిక్స్ ఏడో రోజులోకి అడుగు పెట్టాయి. ఇప్పటివరకూ మీరాబాయి చాను గెలుచుకున్న రజతం తప్ప.. మరొక పతాకం దక్కించుకోలేదు.. అయితే ఈరోజు జరుగుతున్న..

Satish Kumar: బాక్సింగ్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరిన సతీష్‌ కుమార్‌.  ఒలంపిక్స్‌లో మరో పతాకంపై ఆశలు రేపుతున్న ఆర్మీ ఆఫీసర్
Boxer Satish Kumar
Surya Kala
|

Updated on: Jul 29, 2021 | 11:15 AM

Share

Boxer Satish Kumar: టోక్యో ఒలంపిక్స్ ఏడో రోజులోకి అడుగు పెట్టాయి. ఇప్పటివరకూ మీరాబాయి చాను గెలుచుకున్న రజతం తప్ప.. మరొక పతాకం దక్కించుకోలేదు.. అయితే ఈరోజు జరుగుతున్న పోటీల్లో భారత క్రీడాకారులు మంచి ఫలితను సాధిస్తున్నారు. దాదాపు అన్నికేటగిరీల్లోనూ అద్భుతంగా విజయాలను సొంతం చేసుకుంటూ.. పతాకాలపై ఆశలను రేపుతున్నారు. పీవీ సింధు, హాకీ తదితర విభాగాల్లో గెలుపొందగా.. తాజాగా బాక్సింగ్ లో కూడా విజయం సొంతం చేసుకుంది. భారత బాక్సర్ ఆర్మీ అధికారి సతీష్ కుమార్ నాకౌట్ లో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టడానికి మార్గం సుగమం చేసుకున్నాడు. 91 కేజీల పురుషుల సూపర్ హెవీ వెయిట్ విభాగంలో భారత్ క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగు పెట్టడం ఇదే ఫస్ట్ టైం. పురుషుల సూపర్ హెవీవెయిట్ విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయుడు సతీష్. 16 మ్యాచ్‌ల రౌండ్‌లో జమైకన్ రికార్డో బ్రౌన్‌ను 4-1 తేడాతో ఓడించాడు. ఒలంపిక్స్ లో పతకం సాధించటానికి కేవలం ఒక విజయం దూరంలో ఉన్నాడు.

మెన్స్ 91 కేజీల సూపర్ హెవీవెయిట్ బాక్సింగ్ విభాగం ప్రీక్వార్టర్ ఫైనల్స్ బౌట్ లో సతీష్ కుమార్ జమైకాకు చెందిన రికార్డో బ్రౌన్‌తో తలపడ్డాడు. ఎన్నో అంచనాల నడుమ బాక్సింగ్ బరిలోకి దిగాడు 31 ఏళ్ల బ్రౌన్‌‌. 1996 తర్వాత మెన్స్ 91 కేజీల సూపర్ హెవీవెయిట్ బాక్సింగ్ విభాగంలో జమైకా తరపున బ్రౌన్‌‌ బరిలోకి దిగాడు. అయితే బ్రౌన్‌‌ పై సతీష్ కుమార్ మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించాడు.. తన హెవీ వెయిట్ పంచ్ లతో విరుచుకుపడ్డాడు.. తీవ్ర ఒత్తిడికి గురైన బ్రౌన్‌‌ పై విక్టరీ సాధించి క్వార్టర్ ఫైనల్ లో అడుగు పెట్టాడు.

జమైకా కు చెందిన బ్రౌన్‌‌ కే కాదు సతీష్ కుమార్ కూడా ఇదే మొదటి ఒలంపిక్స్. 32 సంవత్సరాల సతీష్ కుమార్‌ ఉత్తర ప్రదేశ్ బులంద్‌షెహర్‌కు చెందిన సూపర్ హెవీవెయిట్ బాక్సర్. ఒలంపిక్స్ లో మొదటి సారిగానీ ఆసియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌ పాల్గొని అద్భుత ప్రదర్శనతో పతకాలను సొంతం చేసుకున్నాడు. 2014లో ఆసియన్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని అందుకున్నాడు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతాన్ని సొంతం చేసుకున్నాడు.

Also Read: ఓ వైపు తోట పనులు చేస్తూనే.. పిహెచ్‌డీ స్థాయికి ఎదిగిన ఓ యువతి .. సివిల్స్ తుది లక్ష్యం అంటున్న వైనం

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి