Viral Photo: అంతరిక్షం నుంచి ఒలింపిక్ వెలుగులు.. నెట్టింట్లో వైరలవుతోన్న నాసా ఫొటో

Tokyo Olympics 2020: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టోక్యో ఒలింపిక్స్ సందడి కనిపిస్తోంది. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నా.. అథ్లెట్లు పతకాల కోసం పోటీపడున్నారు. నెట్టింట్లోనూ ఒలింపిక్స్ సందడి మాములుగా లేదు. ఇలాంటి సందర్భంలోనే నాసా ఓ ఫొటోను విడుదల చేసింది.

Viral Photo: అంతరిక్షం నుంచి ఒలింపిక్ వెలుగులు.. నెట్టింట్లో వైరలవుతోన్న నాసా ఫొటో
Olympics Viral Photo
Follow us
Venkata Chari

|

Updated on: Jul 29, 2021 | 11:00 AM

Tokyo Olympics 2020: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టోక్యో ఒలింపిక్స్ సందడి కనిపిస్తోంది. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నా.. అథ్లెట్లు పతకాల కోసం పోటీపడున్నారు. నెట్టింట్లోనూ ఒలింపిక్స్ సందడి మాములుగా లేదు. ఇలాంటి సందర్భంలోనే నాసా ఓ ఫొటోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో కాంతులు నింపుతూ తెగ వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే… అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) టోక్యోలోని ఒలింపిక్ విలేజ్ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇది రాత్రవేళ స్పేస్ స్టేషన్‌ నుంచి తీసింది కావడంతో.. ఒలింపిక్ విలేజ్ వెలుగుల జిలుగులు అద్భుతంగా కెమెరాలో బంధించబడ్డాయి. ఈ ఫొటో ఐఎస్ఎస్‌కు చెందిన వింటేజ్ పాయింట్ నుంచి తీసినట్లు పేర్కొంది. ఈ ఫొటోలో ఒలింపిక్ విలేజ్‌ విద్యుత్ కాంతులలో జిల్.. జిల్ మంటూ వెలుగులు చిమ్ముతుండడాన్ని గమనించవచ్చు.

ఈ ఫొలోను నాసా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఈ పోస్ట్ పెట్టిన 12 గంటల్లో 5.3 లక్షల లైక్స్‌‌తో దూసుకపోతోంది. అలాగే ఎందరో కామెంట్లు చేస్తూ వైరల్‌గా మార్చేశారు. కాగా, జులై 23న ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలు ఆగస్టు 8 వరకూ జరగనున్నాయి. ఈ క్రీడల్లో ఇప్పటివరకు భారత్ తరుపున వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను ఒక్కరే పతకం సాధించారు. టోక్యో ఒలింపిక్ పతకాల లిస్టులో భారత్ ప్రస్తుతం 43వ స్థానంలో నిలిచింది. 13 స్వర్ణాలతో(మొత్తం 22 పతకాలు) జపాన్ తొలిస్థానంలో నిలవగా, 12 స్వర్ణాలతో(మొత్తం 27 పతకాలు) చైనా రెండవ స్థానంలో కొనసాగుతోంది.

View this post on Instagram

A post shared by NASA (@nasa)

Also Read: Tokyo Olympics 2020 Live: క్వార్టర్ ఫైనల్ చేరిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. అర్జెంటీనాపై భారత హాకీ టీం విజయం

Tokyo Olympics 2020: మీరాబాయి చాను తరువాత ఎవరు.. పతకం తెచ్చే లిస్టులో ఎందరున్నారో తెలుసా..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!