Inspiring Story: ఓ వైపు తోట పనులు చేస్తూనే.. పిహెచ్‌డీ స్థాయికి ఎదిగిన ఓ యువతి .. సివిల్స్ తుది లక్ష్యం అంటున్న వైనం
Selvamari Inspiring Story : సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేనిది ఏముంది.. కష్టే ఫలి అని నిరూపించిందో చదువుల తల్లి.. కుటుంబానికి అండగా తోడు నీడగా ఉండాల్సిన తండ్రి..
Selvamari Inspiring Story : సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేనిది ఏముంది.. కష్టే ఫలి అని నిరూపించిందో చదువుల తల్లి.. కుటుంబానికి అండగా తోడు నీడగా ఉండాల్సిన తండ్రి తన బరువు దింపుకుంటూ ఇంటి నుంచి వెళ్ళిపోతే.. ఆ చదువుల తల్లి పెద్ద కొడుకుగా మారింది.. తల్లికి అండగా ఉంటూ ఇంటి బాధ్యతను తన భుజాన వేసుకుంది.. తల్లితో పాటు చిన్నతనం నుంచి పనికి వెళ్ళేది.. అయితే కూలీపనులు తమ కుటుంబ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచవని గుర్తించింది.. అందుకే చదువు పై దృష్టి సారించింది. ఓ వైపు పనులు చేస్తూనే.. మరోవైపు చదువుకుంది. పట్టుదలతో పరిస్థితులను ఎదిరించి ఈరోజు పిహెచ్ డీ కూడా చేస్తోంది. తాజాగా హై స్కూల్ లో ఉపాధ్యాయురాలిగా చేస్తూ.. విద్యార్థులకు విద్యను భోదిస్తుంది. ఆ చదువుల తల్లిది కేరళ.. 28 ఏళ్ల సెల్వమరి స్ఫూర్తిదాయకంగా ఎదిగిన తీరు గురించి తెలుసుకుందాం..
కేరళలోని చోట్టుపారా కి చెందిన సెల్వమరి పీఎస్‌సీ పరీక్షా ఫలితాల్లో సివిల్ పోలీస్ ఆఫీసర్‌గా ఎంపికైంది. ఈ ఉద్యోగంలో చేరడానికి ఆసక్తి చూపని సెల్వమరి తాజాగా ఇడుక్కి జిల్లాలోని వంచివాయల్ ప్రభుత్వ హైస్కూల్‌లో టీచర్ గా తన ఉద్యోగ ప్రయాణాన్ని ప్రారంభించింది. సెల్వమరి చిన్నతనంలోనే తండ్రి ఇంటివదిలి వెళ్ళిపోయాడు.. దీంతో ఇంటి భాద్యతలతో పాటు ఇద్దరు కూతుళ్ళ భాద్యతలు తల్లి సెల్వమ్ మీద పడ్డాయి.
దీంతో సెల్వమ్ యాలకుల తోటలో రోజుకూలీగా పనిచేస్తూ.. ఆ వచ్చిన డబ్భుతో తనని, పిల్లలని పోషించసాగింది. అయితే తల్లి కష్టాన్ని గుర్తించిన సెల్వమరి తను కూడా తల్లితో పాటు తోటపనికి వెళ్ళేది. ఓ వైపు తల్లికి సాయంగా పనులు చేస్తూనే మరోవైపు చోట్టుపారా, మురిక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసింది. ప్లస్ టూ తమినాడులో చదివి.. తిరువనంతపురంలోని ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి డిగ్రీ పట్టా అందుకుంది.
ఈ డిగ్రీ చదివే సమయంలో సెల్వమరి చాలా సమస్యలను ఎదుర్కొంది. ముఖ్యంగా మలయాళం, ఇంగ్లిష్ భాషల మీద పట్టులేకపోవడంతో అనేక ఇబ్బందులు పడింది. డిగ్రీలో సబ్జెక్టులన్నీ మలయాళంలో లేదా ఇంగ్లిష్ భాషల్లో ఉండడంతో సెల్వమరి తీవ్ర ఇబ్బందులు పడింది. తోటి స్టూడెంట్స్ కూడా వెక్కిరించేవారని.. దీంతో ఒకానొక సమయంలో చదువుకు గుడ్ బై చెప్పేసి ఇంటికి వెళ్ళిపోదామని కూడా అనుకున్నట్లు తెలిపింది. అయితే తల్లి యాలకుల పడుతున్న కష్టం కళ్ళ ముందు కనిపించడంతో ఎలాగైనా చదువు పూర్తి చెయ్యాలి.. మంచి ఉద్యోగంలో చేరి… తల్లికి అండగా నిలబడాలి అనుకుంటూ.. పట్టుదలతో మలయాళం, ఇంగ్లిష్ భాషలు నేర్చుకుని డిగ్రీ పూర్తి చేసినట్లు తెలిపింది.
Hon’ble Governor Shri Arif Mohammed Khan felicitating Ms.#SelvaMari who became a teacher braving many odds and working as daily wage labourer in cardamom estate in Idukki to pursue studies. Hon’ble Governor had invited her to Raj Bhavan: PRO,KeralarajBhavan pic.twitter.com/k6Vbm6ZnCm
— Kerala Governor (@KeralaGovernor) July 29, 2021
డిగ్రీ తర్వాత ఎమ్మెసీ తర్వాత కుమ్లిలోని ఎంజీ యూనివర్సిటీ సెంటర్ నుంచి బీఈడీ పూర్తి చేసింది. అనంతరం తిరువనంతపురంలోని థైక్వాడ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ నుంచి ఎంఈడీ, ఎం.ఫిల్ కోర్సులను పూర్తిచేసింది. వీటితో పాటు దేశ వ్యాప్తంగా నిర్వహించే యూజీసీ నెట్ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించింది. ప్రస్తుతం మ్యాథ్స్ లో పీహెచ్ డీ చేస్తోంది. ఇప్పుడు స్కూల్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్న సెల్వమరి అంతిమ లక్ష్యం సివిల్ సర్వీస్ అధికారిణిగా ప్రజలకు సేవ చేయడం అంటుంది. కష్టాల కడలిని ఎదురీతుతో జీవితంలో సెల్వమరి ఎదిగిన తీరుపై గవర్నర్ నుంచి అనేకమంది సెలబ్రెటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఫోన్ ద్వారా సెల్వమరికి అభినందనలు తెలిపారు. రాజ్‌భవన్‌కు రావాలని ఆహ్వానించారు.
Also Read: సహజశత్రువులకు ఆపధర్మంగా ఉపకారం చేయవచ్చు.. కానీ ఎప్పటికీ స్నేహం చేయకూడదు..