AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2021: నాడు వారి జీవితాలు దారిద్య్రానికి కేరాఫ్ అడ్రస్… నేడు ఒలింపిక్స్ బరిలో..

2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తరపున మొత్తం 11 స్ప్రింటర్లు పాల్గొనబోతున్నారు. వీరిలో ఐదుగురు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారు.

Tokyo Olympics 2021: నాడు వారి జీవితాలు దారిద్య్రానికి కేరాఫ్ అడ్రస్... నేడు ఒలింపిక్స్ బరిలో..
Indian Sprinters Naganathan Pandi, V Revathi, Dhanalakshmi Sekhar, Arokia Rajiv
TV9 Telugu Digital Desk
| Edited By: Venkata Chari|

Updated on: Jul 20, 2021 | 11:57 AM

Share

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ మొత్తం 11 స్ప్రింటర్లను పంపుతోంది. పురుషుల 4×400 మీటర్ల రిలేతోపాటు మిక్స్‌డ్ 4×400 మీటర్ల రిలేలో 5గరు చొప్పున పాల్గొంటున్నారు. అలాగే మహిళల 100 మీ, 200 మీ స్ప్రింట్ల కోసం స్టార్ రన్నర్ ద్యుతీ చంద్ ఆడనుంది. టోక్యో ఒలింపిక్స్ కోసం ఎక్కువ మంది స్ప్రింటర్లను బరిలోకి దింపనున్న రాష్ట్రంగా తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ కోసం అర్హత సాధించిన మొత్తం పదకొండు మంది స్ప్రింటర్లలో ఐదుగురు తమిళనాడు నుంచే బరిలోకి దిగనున్నారు. వీరిలో వి. రేవతి (మిక్స్డ్ 4×400 మీ), సుభా వెంకటేష్ (మిక్స్డ్ 4×400 మీ), ధనలక్ష్మి శేఖర్ (మిక్స్డ్ 4×400 మీ), నాగనాథన్ పాండి (పురుషుల 4×400 మీ), అరోకియా రాజీవ్ (పురుషుల 4×400 మీ) తమిళనాడుకు చెందిన వారు. పురుషుల 4×400 మీ. లో అరోకియా రాజీవ్ నేరుగా ఎంపిక అవగా, మిగిలిన వారు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఎఫ్ఐ) నిర్వహించిన ట్రయల్స్‌లో చూపించిన ప్రతిభ ఆధారంగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

నాగనాథన్ పాండి 25 ఏళ్ల నాగనాథన్ పాండి పోలీస్ కానిస్టేబుల్. అతని తండ్రి ఫామ్‌హ్యాండ్, తల్లి గృహిణి. ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. పాండి బాల్యం చాల కఠినంగా సాగింది. అతను తన కుటుంబాన్ని పోషించడానికి వారాంతాలు, సెలవుల్లో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవాడు. పాఠశాల క్రీడల్లో పరుగులు తీసిన యువ నాగనాథన్ పాండి… బూట్లు కొనే స్థోమత లేకపోవడంతో.. పలు టోర్నమెంట్లలో చెప్పులు కూడా లేకుండా పరిగెత్తేవాడు. జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్‌కు అర్హత సాధించినందుకు పాండి చదువుతన్న స్కూల్ అతనికి బూట్లను బహుమతిగా అందిచింది. హిస్టరీలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందిన నాగనాథన్.. తన ఫీజు చెల్లించడానికి కాలేజీల్లో పార్ట్ టైమ్‌గా పని చేసేవాడు. 2017 లో కానిస్టేబుల్‌గా ఎన్నిక కావడంతో.. స్థిరమైన ఆదాయాన్ని పాండి కుటుంబం పొందుతుంది. 2021 జూన్ 5 న AFI నిర్వహించిన ట్రయల్‌లో నాగనాథన్ పాండి టోక్యో ఒలింపిక్స్ లో పురుషుల 4×400 మీటర్ల పరుగులో పాల్గొనబోతున్నాడు.

వి రేవతి మదురై నగరంలో జన్మించిన వి. రేవతి.. ఏఎఫ్ఐలో జరిగిన పోటీల్లో 53.55 సెకన్లలో పరుగు పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచింది. దాంతో మిక్స్‌డ్ 4×400 మీటర్ల రిలే జట్టులో చోటు సంపాదించింది. ప్రధాన మహిళా క్వార్టర్-మైలర్‌గా నిలిచింది. 23 ఏళ్ల రేవతి.. ఆమె 4 వ తరగతి చదువుతున్నప్పుడు తండ్రిని కోల్పోయింది. ఆ తరువాత ఏడాదే ఆమె తల్లిని కోల్పోయింది. ఆ సమయంలో రేవతి, తన చెల్లెలితో కలిసి ప్రభుత్వ హాస్టళ్లలో ఉండి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంది. రేవతి అమ్మమ్మ వీరికి తోడుగా నిలిచింది. జోనల్ మీట్ సందర్భంగా ఆమె చెప్పులు లేకుండా రేవతి పరుగెత్తింది. దీనిని గమనించిన ఆమె కోచ్.. తనకు మద్దతుగా నిలవడంతో.. రేవతి ఇక వెనుదిరిగి చూడలేదు.

ధనలక్ష్మి శేఖర్ మార్చి 2021 లో జరిగిన ఫెడరేషన్ కప్ ఫైనల్స్‌లో ద్యుతి చంద్, హిమా దాస్ వంటి వారిని అధిగమించి ధనలక్ష్మి శేఖర్ ప్రముఖ స్ప్రింటర్‌గా ఎదిగింది. 22 ఏళ్ల ధనలక్ష్మి.. చిన్న వయస్సులోనే తండ్రిని పోగొట్టుకుంది. ధనలక్ష్మి తల్లి పలు ఇండ్లలో పనిచేస్తూ.. ధనలక్ష్మితోపాటు ఆమె ఇద్దరి తోబుట్టువులకు చదువు చెప్పించింది. పేదరికం నుంచి బయటపడేందుకు క్రీడలను ఒక మాధ్యమంగా ఎంచుకుంది. తన కోచ్ సూచన మేరకు స్ప్రింటర్‌గా మారడానికి ముందు, ధనలక్ష్మి ఖో-ఖో ప్లేయర్‌గా సత్తా చాటేది. అనంతరం స్ప్రింటర్‌గా మారి పలు పోటీలలో ప్రతిభ చూపింది. దాంతో టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు హిమా దాస్, జిస్నా మాథ్యూ, వికె. విస్మయ, ఎంఆర్ పూవమ్మ లాంటి ప్లేయర్లతో బరిలోకి దింగేందుకు వెళ్లనుంది. ధనలక్ష్మి 100 మీ, 200 మీ స్ప్రింట్లలో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారని భావింరారు. కానీ, AFI నిర్వహించిన ట్రయల్స్‌లో 54.27 సెకన్లలోపు పరుగు పూర్తి చేసి మిశ్రమ 4×400 మీటర్ల రిలే జట్టుకు ఎంపికయ్యారు.

అరోకియా రాజీవ్ అరోకియా రాజీవ్ చాలా కాలంగా భారత పురుషుల 4×400 మీటర్ల రిలే జట్టులో చాలా కీలకంగా ఉన్నాడు. 30 ఏళ్ల రాజీవ్, 2016 రియో ​​డి జనీరో ఒలింపిక్స్‌లో దేశం తరపున 400 మీటర్ల రిలేలో పోటీ పడ్డాడు. రాజీవ్ 1991 లో జన్మించాడు. అతని తండ్రి ఓ లారీ డ్రైవర్‌. క్వార్టర్-మైలర్ ప్రారంభంలో బూట్లు కొనేందుకు కూడా డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డాడు. 2018 ఆసియా క్రీడల్లో విజేతగా నిలిచాడు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు అతని సన్నిహితులలో ఒకరి నుంచి బూట్లను తీసుకుని ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు. 2019 లో దోహాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 45.37 సెకన్ల పరుగును పూర్తి చేసి రికార్డు నెలకొల్పాడు. వ్యక్తిగత బెస్ట్ సాధించి టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల 4×400 మీటర్ల రిలేలో పాల్గొంనేందుకు అర్హత సాధించాడు.

Also Read:

Anushka – Sakshi: అనుష్క, సాక్షి, ప్రియాంక, రితికా సజ్దేహ్ : టీమిండియా స్టార్ క్రికెటర్ల భార్యలు ఎంత వరకు చదివారో తెలుసా..!

Viral Video: ‘డెలివరీ ఆఫ్ ది ఇయర్’ బాల్‌ను చూశారా..? మాములుగా టర్న్ అవ్వలే.. బిత్తరపోయిన బ్యాట్స్‌మెన్!