Viral Video: ఒలింపిక్‌ కిట్‌తో టెన్నిస్ స్టార్ డ్యాన్స్‌.. అదుర్స్‌ అంటూ నెటిజన్ల కామెంట్లు

టోక్యో వేదికగా ఒలింపిక్ క్రీడలు జులై 23 నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ నుంచి దాదాపు 120మంది అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌లో ఆడనున్నారు.

Viral Video: ఒలింపిక్‌ కిట్‌తో టెన్నిస్ స్టార్ డ్యాన్స్‌.. అదుర్స్‌ అంటూ నెటిజన్ల కామెంట్లు
Sania Mirza
Follow us
Venkata Chari

|

Updated on: Jul 20, 2021 | 11:57 AM

Tokyo Olympics 2021: టోక్యో వేదికగా ఒలింపిక్ క్రీడలు జులై 23 నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ నుంచి దాదాపు 120మంది అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌లో ఆడనున్నారు. ఈమేరకు తొలి విడతగా కొంతమంది అథ్లెట్లు జులై 17న టోక్యో వెళ్లనున్నారు. ఈమేరకు నిన్న ప్రధాని మోడీ.. అథ్లెట్లతో మాట్లాడి, వారిలో ధైర్యాన్ని నింపారు. తాజాగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను విడుదల చేసింది. దాంతో నెట్టింట్లో బాగా వైరల్‌గా మారింది. ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు ఒలింపిక్ ఇండియా కిట్లను అందించింది.

సానియా మీర్జా అందుకున్న కిట్‌తో వచ్చిన బ్లూ కలర్ జెర్సీ ధరించి, అమెరికన్ రాపర్ డోజా క్యాట్‌ సూపర్ హిట్ సాంగ్ ‘కిస్ మి మోర్’కు డ్యాన్స్ చేసింది. ఈ మేరకు ‘నా పేరులో వచ్చే ఆంగ్ల అక్షరం ‘ఏ’ అర్థాన్ని వివరిస్తూ.. ఆశయం, ఆప్యాయత, సాధించడం, దూకుడు లాంటివి ఏ లో ఉన్నాయంటూ’ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ఈ వీడియో దాదాపు 55వేల మంది లైక్ చేయగా, ఎంతోమంది కామెంట్లు చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా ‘నీ డాన్స్ బాగా నచ్చింది, అభినందనలు’ అంటూ కామెంట్ చేసింది. అలాగే మరికొందరు ఆల్ ద బెస్ట్ అంటూ కామెంట్లు చేశారు.

View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)

Also Read:

Viral Pic: ఇదేంటి.! మెస్సీ, రొనాల్డో చిత్రాలు బీడీ ప్యాకెట్లపైనా.. వైరల్‌ అవుతున్న పోస్ట్‌..

Tokyo Olympics 2021: నాడు వారి జీవితాలు దారిద్య్రానికి కేరాఫ్ అడ్రస్… నేడు ఒలింపిక్స్ బరిలో..

Anushka – Sakshi: అనుష్క, సాక్షి, ప్రియాంక, రితికా సజ్దేహ్ : టీమిండియా స్టార్ క్రికెటర్ల భార్యలు ఎంత వరకు చదివారో తెలుసా..!