Viral Video: ‘డెలివరీ ఆఫ్ ది ఇయర్’ బాల్‌ను చూశారా..? మాములుగా టర్న్ అవ్వలే.. బిత్తరపోయిన బ్యాట్స్‌మెన్!
ఇంగ్లండ్‌లోని క్రికెట్ పిచ్‌లు సాంప్రదాయకంగా స్పిన్నర్ల కంటే సీమర్లకు బాగా సహకరిస్తాయి. అయితే, ఇంగ్లండ్ స్పిన్నర్ వేసిన ఓ బంతి నిజంగానే వన్డే చరిత్రలోనే ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది.
Eng vs Pak: ఇంగ్లండ్‌లోని క్రికెట్ పిచ్‌లు సాంప్రదాయకంగా స్పిన్నర్ల కంటే సీమర్లకు బాగా సహకరిస్తాయి. అయితే, ఇంగ్లండ్ స్పిన్నర్ వేసిన ఓ బంతి నిజంగానే వన్డే చరిత్రలోనే ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది. దాంతో ‘డెలివరీ ఆఫ్ ది ఇయర్’, ‘బిగ్గెస్ట్ స్పిన్నింగ్ డెలివరీ’ గా నిలిచిందంటూ కామెంట్లు చేస్తున్నారు మాజీలు. ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ 1993 యాషెస్ టెస్టులో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మైక్ గాట్లింగ్‌పై ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ నెలకొల్పాడు. తాజాగా పాకిస్తాన్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ పార్కిన్సన్ వదిలిన స్పిన్.. వార్న్ డెలివరీని కూడా అధిగమించి బాగా టర్న్ అయింది. పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఇమామ్‌కు బౌలింగ్ చేస్తున్నాడు పార్కిన్సన్.. బంతిని ఆఫ్ స్టంప్ వెలుపలకు వదిలాడు. దీంతో బంతిని షాట్ ఆడేందుకు ఇమామ్ ముందుకు వచ్చాడు. కానీ, తన అంచనా తప్పింది. బంతి బ్యాట్‌ను తాకకుండా అద్భుతంగా టర్న్ తిరిగి వికెట్లను తాకింది. దాంతో షాకైన పాక్ బ్యాట్స్‌మెన్ నిరాశగా వెనుదిరిగాడు. క్రిక్‌బజ్ మేరకు ఇంగ్లండ్ బౌలర్ పార్కిన్సన్ వదిలిన బాల్ ‘వన్డే చరిత్రలోనే ఎక్కువగా స్పిన్నింగ్ బాల్’ గా రికార్డును నెలకొల్పింది. ఈ బంతి 12.1 డిగ్రీల స్పిన్ తిరిగిందని పేర్కొంది.
మ్యాచ్ విషయానికి వస్తే.. 73 బంతుల్లో 56 పరుగులు చేసిన ఇమామ్.. పాకిస్తాన్ 331 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అత్యధిక స్కోరర్‌గా బాబర్ అజామ్(139 బంతుల్లో 158 పరుగులు) నిలిచాడు. పాకిస్తాన్ తరపున ఇంగ్లండ్‌పై అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా, కెప్టెన్‌గా రికార్డును నెలకొల్పాడు. భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ టీం 48 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ విన్స్ 95 బంతుల్లో 102 పరుగలు సాధించగా, లూయిస్ గ్రగొరీ కూడా 69 బంతుల్లో 77 పరుగులు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించారు. పాకిస్తాన్ సిరీస్ ప్రారంభానికి ముందు ఏడుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రిజర్వ్ బెంచ్‌లోని ఆటగాళ్లను బరిలోకి దింపింది. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. రిజర్వ బెంచ్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడి సిరీస్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు.
Also Read:
WTC 23: డబ్ల్యూటీసీ రెండో ఎడిషన్ షెడ్యూల్ వచ్చేసింది.. టీమిండియా మ్యాచ్‌లు ఇవే.!
ENG vs PAK: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రికార్డులను బద్దలు కొట్టిన పాకిస్తాన్ కెప్టెన్..!