Tokyo Olympics 2020: నేటి బరిలో స్టార్ ప్లేయర్లు.. పీవీ సింధు, మేరీ కోమ్, మను బాకర్, భారత పురుషుల హాకీ టీంలపైనే అందరి చూపు..! పూర్తి షెడ్యూల్
టోక్యో ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు భారతదేశం తరపును కేవలం ఒక్క పతకమే చేరింది. మీరాబాయి చాను తరువాత ఇంతవరకు మరో పతకం భారత్ ఖాతాలో పడలేదు. నేడు స్టార్ ప్లేయర్లు బరిలో నిలిచారు. మను బాకర్ పతకం సాధించేందుకు చివరి అవకాశంగా పోటీ పడనుంది.
Tokyo olympics 2020: టోక్యో ఒలింపిక్స్ 2020 లో ప్రస్తుతం అందరి దృష్టి గురువారం మహిళా బాక్సర్ ఎంసీ మేరీ కోమ్ పైనే ఉంది. అలాగే పీవీ సింధు విజయం దేశం మొత్తం ఆశిస్తుంది. ఈ రోజు నుంచి టోక్యోలో గోల్ఫ్ కూడా ప్రారంభమవుతుంది. భారత పురుష గోల్ఫ్ క్రీడాకారుడు అనిర్బన్ లాహిరి కూడా నేడు బరిలోకి దిగనున్నాడు. 10 మీటర్ల పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో పతకం కోల్పోయిన మను బాకర్, 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో మహిళల విభాగంలో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనుంది. అలాగే నేడు ఆర్చరీ, ఈక్వెస్ట్రియన్, సెయిలింగ్, సెయిలింగ్‌లో కూడా భారత అథ్లెట్లు పోటీ పడనున్నారు.
టోక్యో ఒలింపిక్స్ -2020 లో భారత అథ్లెట్ల షెడ్యూల్. (భారత కాలమానం ప్రకారం)
ఆర్చరీ: ఉదయం 7.30 నుంచి: అతాను దాస్ వర్సెస్ డెంగ్ యు చెంగ్ (చైనీస్ తైపీ), పురుషుల వ్యక్తిగత చివరి 32 ఎలిమినేషన్ మ్యాచ్
బ్యాడ్మింటన్ : ఉదయం 6 గంటలకు 15 నుంచి: పీవీ సింధు vs మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్), మహిళల సింగిల్స్ చివరి -16 మ్యాచ్
బాక్సింగ్: ఉదయం 8.15 నుంచి: సతీష్ కుమార్ Vs రికార్డో బ్రౌన్ (జమైకా), పురుషుల 91 ప్లస్ కిలోల చివరి -16 మ్యాచ్
మధ్యాహ్నం 3.35: ఎంసీ మేరీ కోమ్ వర్సెస్ ఇంగ్రిట్ లోరెనా వాలెన్సియా (కొలంబియా), మహిళల 51 కిలోల చివరి -16 మ్యాచ్
హార్స్ రైడింగ్ : ఉదయం ఆరు గంటలకు ఫవాద్ మీర్జా
గోల్ఫ్: తెల్లవారుజాము 4 నుంచి: అనిర్బన్ లాహిరి – ఉదయన్ మానే, పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ గేమ
హాకీ: ఉదయం 6 : ఇండియా వర్సెస్ అర్జెంటీనా, పురుషుల పూల్ ఏ మ్యాచ్
రోయింగ్: ఉదయం 5.20 నుంచి: అర్జున్ లాల్ జాట్- అరవింద్ సింగ్, పురుషుల తేలికపాటి డబుల్ స్కల్స్
సెయిలింగ్: ఉదయం 8:35 – కేసీ గణపతి, వరుణ్ ఠక్కర్, పురుషుల స్కిఫ్ ఉదయం 8:45 – నేత్రా కుమనన్, మహిళల లేజర్ రేడియల్ రేస్ ఉదయం 8:35 – విష్ణు శరవణన్, పురుషుల లేజర్ రేస్
షూటింగ్ : ఉదయం 5:30 నుండి: మహిళల 25 మీ పిస్టల్ అర్హతపోటీలు రాహి సర్నోబాత్, మను బాకర్.
స్విమ్మింగ్ : సాయంత్రం 4.16 నుంచి: పురుషుల వంద మీటర్ల బట్టర్‌ప్లై ఈవెంట్2లో సజన్ ప్రకాష్
Also Read: చతికిలబడిన గబ్బర్ సేన.. మూడేళ్ల తర్వాత భారత్‌పై లంక విజయం.. సిరీస్ 1-1తో సమం..
Viral Video: జింబాబ్వే- బంగ్లాదేశ్ టీంల మధ్య జరిగిన వింత ఘటన.. వికెట్ తీసిన దెయ్యం… వీడియో