Tokyo Olympics 2020: రోయింగ్‌లో పతకం ఆశలు సజీవం.. సెమీస్ చేరిన అర్జున్ లాల్, అరవింద్ సింగ్
రోయింగ్‌లో భారత ఆటగాళ్లు అర్జున్ లాల్, అరవింద్ సింగ్ సెమీస్ చేరుకున్నారు. అలాగే జులై 27 న జరగనున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అర్జున్ లాల్, అరవింద్ సింగ్ ప్రదర్శనలో పతకం లెక్కలు తేలనున్నాయి. ఒకవేళ వీరు సెమీస్‌లో గెలిస్తే కచ్చితంగా ఓ పతకం భారత ఒడిలో చేరనుంది.
Tokyo Olympics 2020: రోయింగ్ ఈవెంట్‌లో టోక్యో ఒలింపిక్స్‌లో పతకం ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. అర్జున్ లాల్, అరవింద్ సింగ్ సెమీస్‌కు చేరి, పతకం సాధించే దిశగా తమ ప్రయాణాన్ని మరింత సులభం చేసుకున్నారు. ఆదివారం జరిగిన పురుషుల లైట్‌వెయిట్ డబుల్స్ స్కల్స్ రెపికేజ్ రౌండ్‌లో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. దీంతో సెమీ-ఫైనల్‌కు టికెట్ పొందారు. ఈ రేసును పూర్తి చేయడానికి భారత ఆటగాళ్లు 6 నిమిషాల 51:36 సెకండ్లు తీసుకున్నారు. సెమీస్‌లో గెలిస్తే భారత్‌కు క్యాంస్యం ఖరారు అవుతుంది. రెపికేజ్ రౌండ్లో, పోలిష్ జోడీ 6 నిమిషాల 43 సెకన్లలో లక్ష్యాన్ని సాధించి మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు, స్పానిష్ జోడీ 6 నిమిషాల 45 సెకన్లతో రెండవ స్థానంలో నిలిచింది. పురుషుల రెపికేజ్ విభాగంలో రోయింగ్ డబుల్స్ సెమీ ఫైనల్స్ జులై 27 న జరగనున్నాయి.
ఆదివారం రోయింగ్‌లో పతకం సాధించాలన్న భారత్ ఆశలు సజీవంగా ఉండగా, మహిళల షూటింగ్ ఈవెంట్‌లో భారత్‌కు నిరాశ ఎదరైంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మహిళల విభాగంలో, భారతదేశానికి చెందిన మను బాకర్, యషస్విని దేస్వాల్ ఫైనల్స్‌కు చేరుకోలేకపోయారు. మరోవైపు, బ్యాడ్మింటన్ నుంచి భారత స్టార్ ఉమెన్ షట్లర్ పీవీ సింధు రౌండవ రౌండ్‌లోకి ఎంటరైంది.ఇజ్రాయెల్ షట్లర్‌పై మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించి విజయం సాధించింది.
రోయింగ్ సెమీ ఫైనల్స్ జులై 27 న అర్జున్ లాల్, అరవింద్ సింగ్ సెమీస్‌లోకి రావడంతో రోయింగ్‌లో భారత పతక ఆశల సజీవంగా ఉన్నాయి. జులై 27 న జరగబోయే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఈ ఇద్దరి ప్రదర్శనపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. వీరు ఎంత వేగంగా లక్ష్యాన్ని చేరుకుంటారో పతకానికి అంత చేరువకానున్నారు.
Also Read: