Siraj complaint on Rohit Sharma: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మపై మహ్మద్ సిరాజ్ ఫిర్యాదు.. వీడియో విడుదల చేసిన బీసీసీఐ..

Siraj complaint on Rohit Sharma: టీమ్ ఇండియా ఆటగాళ్లందరూ ఇంగ్లాండ్ చేరుకున్నారు. జూన్ 2 అర్ధరాత్రి భాతర క్రికెట్ ప్లేయర్లు ఇంగ్లండ్‌కు...

Siraj complaint on Rohit Sharma: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మపై మహ్మద్ సిరాజ్ ఫిర్యాదు.. వీడియో విడుదల చేసిన బీసీసీఐ..
Siraj And Rohit Sharma
Follow us

|

Updated on: Jun 05, 2021 | 3:28 PM

Siraj complaint on Rohit Sharma: టీమ్ ఇండియా ఆటగాళ్లందరూ ఇంగ్లాండ్ చేరుకున్నారు. జూన్ 2 అర్ధరాత్రి భాతర క్రికెట్ ప్లేయర్లు ఇంగ్లండ్‌కు ప్రత్యేక విమానంలో బయలుదేరగా.. జూన్ 3న లండన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి సౌతాంప్టన్‌కు బస్సులో బయలుదేరారు. ఈ ప్రయాణాన్ని టీమిండియా ప్లేయర్లు బాగా ఆస్వాధించారు. ఇదిలావుండగా, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రేక్షకుల కోసం ఒక వీడియోను ట్వీట్ చేసింది. అయితే, ఈ వీడియోలో, ఓపెనర్ రోహిత్ శర్మ పై ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ద్వారా టిమిండియా క్రికెటర్ల మధ్య ఎంత సాన్నిహిత్యం ఉంటుందో ఇట్టే తెలిసిపోతుంది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇంగ్లండ్ పర్యటన పట్ల టీమిండియా ప్లేయర్లు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. భారత్ నుంచి ఇంగ్లండ్‌కు వెళ్లే ప్రయాణంలో రచ్చ రచ్చ చేశారు. కొందరు సినిమాను చూస్తే.. మరికొందరు విశ్రాంతి తీసుకున్నారు. మొత్తానికి అందరూ చాలా సంతోషంగా తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అయితే, బీసీసీఐ వారితో ఒక వీడియో తీసింది. ఆ వీడియోలో అక్సర్ పటేల్ తాను 2 గంటలు సినిమా చూశానని, 6 గంటల పాటు నిద్రపోయానని చెప్పుకొచ్చాడు. ఇక మహమ్మద్ సిరాజ్ మాత్రం రోహిత్ శర్మపై ఫిర్యాదు చేశాడు. ‘‘మేము ఇప్పుడే విమానాశ్రయంలో దిగాము. ఇప్పుడు హోటల్‌కు చేరుకోవడానికి మరో రెండు గంటలు ప్రయాణించాల్సి ఉంటుంది. నేను రెండు గంటలు మాత్రమే నిద్రపోయాను, కాని అప్పుడే రోహిత్ భాయ్ వచ్చి నన్ను ఆటపట్టించి నిద్ర లేపారు. ఆ తరువాత ఇక నాకు నిద్రపట్టలేదు. ల్యాండింగ్‌కు రెండు గంటల ముందు నాకు మళ్ళీ కొంచెం నిద్ర వచ్చింది. అంతకు ముందు రోజు భారీ రన్నింగ్ ప్రాక్టీస్ చేసినందున కొంచెం అలసిపోయాను’’ అని సిరాజ్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.

న్యూజిలాండ్, భారతదేశం మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ మ్యాచ్ జూన్ 18 నుండి 23 వరకు సౌతాంప్టన్ క్రికెట్ మైదానంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల ఆటగాళ్ళు ఎదురుచూస్తున్నారు. డబ్ల్యుటిసి ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్ ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడనుంది.

మూడు రోజుల క్వారంటైన్.. కరోనానా వ్యాప్తి నేపథ్యంలో బ్రిటిష్ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం భారత ఆటగాళ్ళు ఇప్పుడు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. సౌతాంప్టన్‌లోని హోటల్‌లో మూడు రోజుల పాటు క్వారంటైన్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మూడు రోజులు టీమిండియా ప్లేయర్లు ఎవరి గదిలో వారే ఉండిపోవాల్సి ఉంటుంది. ఈ మూడు రోజుల తరువాత టీమిండియా ప్లేయర్లందరికీ కరోనా టెస్టులు నిర్వహించారు. ఇక సిరీస్ ముగిసే వరకు కూడా వీరు బయో బబుల్ నుంచి బయటకు వచ్చేందుకు వీలు లేదు.

ఫామ్‌లో టీమిండియా ప్లేయర్లు.. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ ప్లేయర్లు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్, మయాంక్ అగర్వాల్, చేటేశ్వర్ పూజారా, హనుమా విహారీ, రిషబ్ పంత్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు. టీమిండియా డబ్ల్యుటిసి ఫైనల్ మ్యాచ్‌తో పాటు.. 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్‌తో ఆడనుంది.

BCCI Tweet:

Also read:

Anandaiah Medicine: ఆనందయ్య మందుకు బ్రేక్.. పొలిటికల్ వివాదంలో తయారీ ప్రక్రియ.. సోమవారం నుంచి పంపిణీ డౌటే!

Latest Articles