AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana News: కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే అనంత లోకాల‌కు.. 24 గంట‌లు మృతదేహం అలానే ఉంది

దూరం నుంచి చూస్తే.. ఎవ‌రో వ్య‌క్తి అక్క‌డ కూర్చున్నాడు అనుకుంటారు. ద‌గ్గ‌రికి వెళ్లి చూస్తే గానీ అత‌డు చ‌నిపోయిన‌ట్లు తెలీదు. అవును.. కూర్చున్న వ్యక్తి....

Telangana News: కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే అనంత లోకాల‌కు.. 24 గంట‌లు మృతదేహం అలానే ఉంది
Main Dies Whie Eating
Ram Naramaneni
|

Updated on: Jun 05, 2021 | 3:10 PM

Share

దూరం నుంచి చూస్తే.. ఎవ‌రో వ్య‌క్తి అక్క‌డ కూర్చున్నాడు అనుకుంటారు. ద‌గ్గ‌రికి వెళ్లి చూస్తే గానీ అత‌డు చ‌నిపోయిన‌ట్లు తెలీదు. అవును.. కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే.. తింటున్న వ్యక్తి తింటున్నట్లే ప్రాణాలు కోల్పోయారు అనే మాట‌లు మ‌నం పెద్ద‌లు చెబుతూ ఉంటే వింటూ ఉంటాం. తాజాగా అలాగే ఒక వ్య‌క్తి అలానే ప్రాణాలు విడిచాడు. బన్ తినేందుకు దాని మీద పెట్టిన చేయి అలానే ఉండగా.. కూర్చున్న చోటే నోట్లో నుంచి రక్తం కారుతూ చ‌నిపోయాడు. ఈ విషయం బంధువుల‌కు తెలిసేసరికి దాదాపు ఒక‌రోజు గ‌డిచిపోయింది. అప్పటికి అదే స్థితిలో అత‌డి డెడ్ బాడీ బ‌లంగా బిగుసుకుపోయి ఉంది. వివ‌రాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం దండుపల్లికి చెందిన కాసాల సాయిలు(46).. తెలంగాణలోని మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం పాలట గ్రామంలో బంధువు అంత్యక్రియలకు గురువారం మధ్యాహ్నం వెళ్లాడు. అదే రోజు తూప్రాన్‌ మీదుగా స్వగ్రామానికి బయలుదేరి, తూప్రాన్‌ పురపాలిక పరిధి అల్లాపూర్‌ వద్ద లిక్క‌ర్ తాగేందుకు ఆగాడు.

మద్యం, ఆహారం తెచ్చుకొని తూప్రాన్‌-గజ్వేల్ రోడ్ పక్కన నిర్మానుష్య ప్ర‌దేశంలో కూర్చుని.. తినడానికి చేతిని ఆహారంలో పెట్టి హార్ట్ అటాక్ కార‌ణంగా సాయిలు అలానే చనిపోయాడు. ఎంతసేపైనా అతను ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు శుక్రవారం.. పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు సెల్ ఫోన్ సిగ్న‌ల్ సాయంతో వెతకగా సాయిలు మృతదేహం కనిపించింది. వ్యవసాయం చేసుకునే సాయిలుకు పిల్లలు లేరు. ఈ ఘటనపై తూప్రాన్‌ సామాజిక ఆరోగ్య కేంద్రం పర్యవేక్షకుడు అమర్‌సింగ్ మాట్లాడుతూ.. సైలెంట్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ వల్ల గుండెపోటు వచ్చి ఉంటుందని.. దీంతో నొప్పి, ఆనవాళ్లు తెలియకుండా ప్రాణాలు పోతాయని తెలిపారు.

Also Read: చెట్టుకు ఉన్న ఒక్క‌ ఆకుతో సుంద‌ర‌మైన గూడు నిర్మించిన ప‌క్షి.. చూస్తే వావ్ అంటారు..

తాబేలు రాక్స్.. దాన్ని తినేందుకు వెళ్లి న‌వ్వులు పాలైన మొస‌లి.. ఏం జ‌రిగిందో మీరే చూడండి

Follow Us
వరుస వివాదాలతో సంచలనం.. బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్ !
వరుస వివాదాలతో సంచలనం.. బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్ !
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..
అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..
145 గ్రాముల బంగారం మాయం వెనుక అసలు కథ ఇదే..
145 గ్రాముల బంగారం మాయం వెనుక అసలు కథ ఇదే..
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..