AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తాబేలు రాక్స్.. దాన్ని తినేందుకు వెళ్లి న‌వ్వులు పాలైన మొస‌లి… ఏం జ‌రిగిందో మీరే చూడండి

మొసలి దవడల శక్తి గురించి మీకు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ జీవికి అతిపెద్ద జంతువు యొక్క ఎముకలను ముక్కలు చేసే శక్తి ఉంది. ఒక్క‌సారి దాని...

Viral Video: తాబేలు రాక్స్.. దాన్ని తినేందుకు వెళ్లి న‌వ్వులు పాలైన మొస‌లి... ఏం జ‌రిగిందో మీరే చూడండి
Alligator tries to eat Turtle
Ram Naramaneni
|

Updated on: Jun 05, 2021 | 3:14 PM

Share

మొసలి దవడల శక్తి గురించి మీకు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ జీవికి అతిపెద్ద జంతువు యొక్క ఎముకలను ముక్కలు చేసే శక్తి ఉంది. ఒక్క‌సారి దాని నోటికి చిక్కితే అది పులి అయినా సింహాం అయినా త‌ప్పించుకుని బ‌య‌ట‌కు రావ‌డం కల్లే. కానీ ఓ చిన్న జీవి అదేనండి తాబేలు.. మొస‌లి నోటిలోప‌లికి వెళ్లి కూడా.. సజీవంగా తప్పించుకుంటుంది. అదెలాగో తెలుసుకుందాం ప‌దండి. ప్ర‌జంట్ వైర‌ల్ అవుతున్న వీడియోలో ఒక మొసలి తాబేలు మింగడానికి ప్రయత్నిస్తోంది. కానీ తాబేలు తన ప్రాణాల కోసం పోరాడుతోంది. ఏదైనా అద్భుతం జ‌రిగితే త‌ప్ప‌ మొసలి నోటి నుండి తాబేలు సజీవంగా బయటకు రావాలి. కాగా అక్క‌డ తాబేలును కాపాడానికి ఎవ‌రూ రాలేదు.. మ‌రే అద్భుతం జ‌ర‌గ‌లేదు. అయినా కానీ త‌ప్పించుకుంది.

మొద‌ట ఈ వీడియోపై ఒక లుక్ వేయండి.

తాబేలు.. ఓ పెద్ద మొసలి దవడలలో చిక్కుకున్నట్లు వీడియోలో స్ప‌ష్టంగా చూడవచ్చు. మొసలి తన ద‌వ‌డ‌ల‌తో తాబేలును విచ్ఛిన్నం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది. కానీ తాబేలు పైన ఉండే క‌వ‌చం కార‌ణంగా అది విజయవంతం కాలేదు. నోట్లో నుంచి రెండు సార్లు.. తాబేలు జారిపోయింది. అయితే చిరాకు వ‌చ్చిందో ఏమో.. రెండోసారి తాబేలును జారిపోయాక‌.. మొస‌లి దాన్ని ప‌ట్టుకునే ప్ర‌యత్నం చేయ‌లేదు. దీంతో మొసలి బారి నుండి విముక్తి పొంది అక్కడి నుండి సురక్షితంగా నీటి కొల‌నువైపు వెళ్లిపోయింది తాబేలు. ఈ షాకింగ్ వీడియో ఆఫ్రికన్ యానిమ‌ల్స్ అనే ట్విట్టర్ పేజీలో షేర్ చేయబడింది. భారీ వ్యూస్, లైక్స్, షేర్స్‌తో ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో తెగ స‌ర్కులేట్ అవుతుంది.

Also Read : ఆక‌లితో ఉన్న పాము.. ఓ భారీ సైజ్ గుడ్డును ఎలా మింగేసిందో మీరే చూడండి

విష‌మ పరిస్థితుల్లో డాక్ట‌ర్.. వెంట‌నే స్పందించి రూ. కోటి విడుద‌ల చేసిన సీఎం జ‌గ‌న్