Spectators: క‌్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త‌… స్టేడియంలోకి ఆ మ్యాచ్ నుంచి ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తి..?

స్టేడియంలో కూర్చొని కొహ్లీ బ్యాటింగ్‌.. బుమ్రా బౌలింగ్ చూడ‌క స‌గ‌టు క్రికెట్ అభిమాని చాలా నిరాశ‌లో ఉన్నాడు. లాక్‌డౌన్ కార‌ణంగా దాదాపు...

Spectators: క‌్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త‌... స్టేడియంలోకి ఆ మ్యాచ్ నుంచి ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తి..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 24, 2021 | 4:02 PM

స్టేడియంలో కూర్చొని కొహ్లీ బ్యాటింగ్‌.. బుమ్రా బౌలింగ్ చూడ‌క స‌గ‌టు క్రికెట్ అభిమాని చాలా నిరాశ‌లో ఉన్నాడు. లాక్‌డౌన్ కార‌ణంగా దాదాపు సంవ‌త్స‌రానికి పైగా ప్ర‌త్యేక్షంగా క్రికెట్ మ‌జాకు దూర‌మ‌య్యారు. అయితే ఇప్పుడు భార‌తీయ క్రికెట్ అభిమానుల‌కు ఓ శుభ‌వార్త‌… అన్ని స‌క్ర‌మంగా సాగితే… మార్చిలో క్రికెట్ మ్యాచ్‌ను స్టేడియం నుంచి వీక్షించొచ్చు.

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు…

భార‌త టీం ఇంగ్లండ్‌తో స్వ‌దేశంలో నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వ‌న్డేలు ఆడ‌నుంది. ఆ మ్యాచ్‌లు ఫిబ్ర‌వ‌రి 5 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే టెస్టు మ్యాచ్ టికెట్లు అమ్మ‌డం లేద‌ని ఇప్ప‌టికే త‌మిళ‌నాడు క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో బీసీసీఐ కేంద్ర అనుమ‌తితో మార్చి నెల రెండో వారం నుంచి జరిగే టీ 20 సిరీస్ నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించాల‌ని యోచిస్తోంది. అభిమానులను స్టేడియంలోకి అనుమతించే విషయం ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉంటుందని బీసీసీఐ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం అనుమతించినా గతంలో మాదిరిగా స్టేడియంలు ఫుల్‌ ప్యాకై కనిపించే పరిస్థితులు లేవనే చెప్పాలి. 50 శాతం సామర్ధ్యంతో ప్రేక్షుకుల ప్రవేశాన్ని బోర్డు ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని త్వరలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వపరంగా అనుమతి పొందేలా బీసీసీఐ చర్యలు తీసుకొంటున్నది.