Martin Guptill Stunning Catch: న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్తిల్ అద్బుతమైన క్యాచ్ అందుకుని వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. సూపర్ స్మాష్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో మైదానంలో మెరుపు వేగంతో కదిలి ఆశ్యర్యపరిచే క్యాచ్ ఒంటిచేత్తే పట్టేశాడు. గప్తిల్ ఈ టోర్నీలో ఆక్లాండ్‌కు తరుఫున ఆడుతున్నాడు.
ఈడెన్ పార్క్‌లో సెంట్రల్ డిస్ట్రిక్స్, ఆక్లాండ్ ఏసెస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ విన్యాసంతో మెస్మరైజ్ చేశాడు గప్తిల్. సెంట్రల్ డిస్ట్రిక్స్ ఓపెనింగ్ ఆటగాడు జార్జ్ వర్కర్(11) నాలుగో ఓవర్లో భారీ షాట్ ఆడాడు. లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గప్తిల్ మెరుపు వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సెగ సర్కులేట్ అవుతుంది. కాగా దేశవాలీ క్రికెట్ లీగుల్లో ఈ తరహా ఫీల్డింగ్ విన్యాసాలు తరుచుగా చూస్తేనే ఉంటాం. ఐపీఎల్‌లో కూాడా ఈ మాదిరి ఫీట్లు ఇప్పటికే చాలాసార్లు చూశారు క్రికెట్ ప్రేమికులు.
Just in case you missed it on Saturday, start your Sunday with this OUTSTANDING juggling catch from @Martyguptill in the Dream11 @SuperSmashNZ for @aucklandcricket‘s Aces. Catch today’s Super Smash action from the @BasinReserve on @sparknzsport #SuperSmashNZ pic.twitter.com/TDesZteDg7
— BLACKCAPS (@BLACKCAPS) January 23, 2021
Also Read: Spectators: క‌్రికెట్ అభిమానులకు శుభవార్త… స్టేడియంలోకి ఆ మ్యాచ్ నుంచి ప్రేక్షకులకు అనుమతి..?