బిడ్డతో పాటు మహిళా క్రికెటర్ మృతి

దక్షిణాఫ్రికా మాజీ మహిళా క్రికెటర్ ఎల్‌రీసా తునీస్సెస్ ఫౌరీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తన బిడ్డతో కలిసి శుక్రవారం సౌతాఫ్రికా మైనింగ్ సిటీ స్లిల్‌ఫౌంటెన్ మార్గంలో వెళ్లేటప్పుడు ఆమె ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం వారిద్దరు మరణించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై స్పందించిన క్రికెట్ సౌతాఫ్రికా చీఫ్ ఎగ్జిగ్యూటివ్ తాబంగ్ మోరోయ్.. ‘‘చెప్పలేని విషాదం ఇది. ఎల్‌రీసా, ఆమె బిడ్డ […]

బిడ్డతో పాటు మహిళా క్రికెటర్ మృతి
Follow us

| Edited By:

Updated on: Apr 08, 2019 | 2:49 PM

దక్షిణాఫ్రికా మాజీ మహిళా క్రికెటర్ ఎల్‌రీసా తునీస్సెస్ ఫౌరీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తన బిడ్డతో కలిసి శుక్రవారం సౌతాఫ్రికా మైనింగ్ సిటీ స్లిల్‌ఫౌంటెన్ మార్గంలో వెళ్లేటప్పుడు ఆమె ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం వారిద్దరు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

దీనిపై స్పందించిన క్రికెట్ సౌతాఫ్రికా చీఫ్ ఎగ్జిగ్యూటివ్ తాబంగ్ మోరోయ్.. ‘‘చెప్పలేని విషాదం ఇది. ఎల్‌రీసా, ఆమె బిడ్డ ఇద్దరు మరణించారు. ఈ చేదు వార్త మమ్మల్ని షాక్‌కు గురి చేసింది. క్రికెట్‌ను ప్రేమించిన ఎల్‌రీసా ఆల్‌రౌండర్‌గా రాణించి అద్బుత ప్రతిభను కనబరిచింది. ఆమె భర్త, కుటుంబ సభ్యులు, సహ క్రీడాకారులకు సీఎస్ఏ తరపున సానుభూతి తెలుపుతున్నా’’ అంటూ పేర్కొన్నారు.

కాగా దేశవాళీ క్రికెట్‌లో నార్త్‌వెస్ల్ డ్రాగన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఎల్‌రీసా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లలో అరంగేట్రం చేశారు. మొత్తం మూడు వన్డేలాడిన ఆమె.. ఒక టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించారు. 2013లో సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె చివరిసారిగా ఆడారు. స్థానికంగా పలు క్రికెట్ జట్లకు ఆమె కోచ్‌గా వ్యవహరించారు.