Karting Series: హైదరాబాద్ వేదికగా మరో రేసింగ్ ఈవెంట్.. ‘చికేన్ సర్క్యూట్’లోనే ఫైనల్ కూడా..

దేశంలోని కార్టింగ్ ఔత్సాహికుల కోసం సరికొత్తగా ఆరు రౌండ్లలో జరిగే రేసింగ్ ఈవెంట్ త్వరలో ప్రారంభం కానుంది. కొత్త ఫోర్-స్ట్రోక్ కార్టింగ్ సిరీస్ ఏప్రిల్ 29న చెన్నైలో ప్రారంభమై జూన్ 4న హైదరాబాద్‌లో ముగుస్తుందని రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్(RPPL) సోమవారం ప్రకటించింది. అలాగే బెంగళూరులోని..

Karting Series: హైదరాబాద్ వేదికగా మరో రేసింగ్ ఈవెంట్.. ‘చికేన్ సర్క్యూట్’లోనే ఫైనల్ కూడా..
Hyderabad To Host 4 Stroke Karting Series' Final
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 25, 2023 | 7:39 AM

దేశంలోని కార్టింగ్ ఔత్సాహికుల కోసం సరికొత్తగా ఆరు రౌండ్లలో జరిగే రేసింగ్ ఈవెంట్ త్వరలో ప్రారంభం కానుంది. కొత్త ఫోర్-స్ట్రోక్ కార్టింగ్ సిరీస్ ఏప్రిల్ 29న చెన్నైలో ప్రారంభమై జూన్ 4న హైదరాబాద్‌లో ముగుస్తుందని రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్(RPPL) సోమవారం ప్రకటించింది. అలాగే బెంగళూరులోని మెకో కార్టోపియాకు బ్యాండ్‌వాగన్ వెళ్లే ముందుగానే చెన్నైకి చెందిన ECR స్పీడ్‌వే ఏప్రిల్ 20-30 నుంచి ఓపెనర్‌ను నిర్వహిస్తుంది. ఈ క్రమంలో స్పీడ్‌వే త్రిసూర్, ముంబైలోని అజ్మీరా ఇండికార్టింగ్, ఢిల్లీలోని ఎఫ్ 11 కార్టింగ్ తర్వాత, హైదరాబాద్‌లోని చికేన్ సర్క్యూట్ ఈ రేసింగ్ ఈవెంట్ ఫైనల్‌కు వేదిక కానుంది. ఇక హైదరాబాద్‌లో జరిగే ఫైనల్‌లో మొత్తం 6 నగరాల నుంచి 36 మంది డ్రైవర్‌లు పోటీ పడనున్నారు. ఇంకా ఫార్మాట్‌లో ఒక్కో బ్యాచ్‌కు తొమ్మిది మంది డ్రైవర్లతో ప్రాక్టీస్, క్వాలిఫైయింగ్ సెషన్ ఉంటుంది. అలాగే ఈ ఫైనల్‌కి ముందు నాలుగు క్వాలిఫైయింగ్స్ జరుగుతాయి. ప్రతి రౌండ్‌లోని టాప్-5 డ్రైవర్లు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ప్రతి సెమీ-ఫైనల్ హీట్‌లో టాప్-5 డ్రైవర్లు హైదరాబాద్‌లో జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.

మరోవైపు ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు అర్హులైనందున రేసింగ్ చాలా హోరుగా సాగే అవకాశం ఉంది. ఇంకా ఈ ఈవెంట్‌లో విజేతలుగా నిలిచినవారు జూలైలో ప్రారంభమయ్యే FMSCI నేషనల్ కార్టింగ్ ఛాంపియన్‌షిప్ కోసం రూ. 1.5-2 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌లను అందుకుంటారు. ఈ స్కాలర్‌షిప్‌లు ఫ్రీ ఎంట్రీతో పాటు శిక్షణ, కొత్త కార్ట్, మెకానిక్, ఇంజనీర్‌లను కవర్ చేస్తాయి. హైదరాబాద్ మినహా ప్రతి నగరంలో టాప్-3 విజేతలు ట్రోఫీని పొందుతారు. ఇంకా మొత్తం సిరీస్ నుంచి టాప్-6 డ్రైవర్లు FMSCI నేషనల్ కార్టింగ్ ఛాంపియన్‌షిప్ కోసం స్కాలర్‌షిప్‌ను అందుకుంటారు.

RPPL ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అఖిల్ రెడ్డి మాట్లాడుతూ ‘ఈ కొత్త కార్టింగ్ సూపర్ సిరీస్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టడం మాకు ఎంతో సంతోషంగా  ఉంది. యువ డ్రైవర్లు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, మోటార్‌స్పోర్ట్స్‌లో వారి కెరీర్‌ను సమర్థవంతంగా ప్రారంభించేందుకు ఇలా ఒక వేదికను అందజేస్తున్నాం. భారతదేశంలో క్రీడాభివృద్ధికి,  అభివృద్ధికి సహాయం అందించడంలో మా నిబద్ధతకు ఈ సిరీస్ విజేతలకు అందే స్కాలర్‌షిప్ ద్వారా ప్రతిబింబిస్తుంద’ని అన్నారు.

ఇవి కూడా చదవండి

IRL  ప్రారంభ సీజన్‌తో RPPL చాలా కష్టతరంగా ఉన్నా కూడా విజయవంతమైంది. ఈ ఈవెంట్‌లో హైదరాబాద్ నగరానికి చెందిన ఆరు జట్లు ఉన్నాయి. ఇంకా 24 మంది ప్రముఖ విదేశీ, ఇండియన్ డ్రైవర్లు కూడా పాల్గొన్నారు. అందులో డ్రైవర్స్ టైటిల్‌ను అఖిల్ రవీంద్ర (హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్) గెలుచుకోగా, ‘గాడ్‌స్పీడ్ కొచ్చి’ జట్ల ఛాంపియన్‌షిప్ ట్రోఫీని గెలుచుకుంది.

మరిన్ని స్పోర్ట్స్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!