Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH Vs DC Match Report: డేవిడ్ వార్నర్ ప్రతీకారం! హైదరాబాద్‌పై ఢిల్లీ క్యాపిటర్స్ వరుస విజయం..

ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 7 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ విన్నింగ్‌తో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది ఢిల్లీ. ఈ విజయంలో ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రతీకారం తీర్చుకున్నట్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే.. వార్నర్ 2021లో సన్ రైజర్స్‌ టీమ్‌కి కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ సీజన్ మధ్యలో ఫ్రాంచైజీ అతనికి షాక్ ఇచ్చింది కెప్టెన్సీ నుంచి తొలగించింది.

SRH Vs DC Match Report: డేవిడ్ వార్నర్ ప్రతీకారం! హైదరాబాద్‌పై ఢిల్లీ క్యాపిటర్స్ వరుస విజయం..
Srh Vs Dc
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 25, 2023 | 5:52 AM

ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 7 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ విన్నింగ్‌తో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది ఢిల్లీ. ఈ విజయంలో ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రతీకారం తీర్చుకున్నట్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే.. వార్నర్ 2021లో సన్ రైజర్స్‌ టీమ్‌కి కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ సీజన్ మధ్యలో ఫ్రాంచైజీ అతనికి షాక్ ఇచ్చింది కెప్టెన్సీ నుంచి తొలగించింది. ఆ తరువాత టీమ్ నుంచి తొలగించింది. దాంతో వార్నర్ టీమ్‌కు దూరమయ్యాడు.

ఇప్పుడు ఢిల్లీ టీమ్ కెప్టెన్‌గా వచ్చిన వార్నర్.. ఎస్ఆర్‌హెచ్ని తన సొంత గడ్డపైనే ఓడించాడు. కాగా, హైదరాబాద్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 144 పరుగులు చేసింది. ఆ తరువాత ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ 6 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.

మయాంక్ అగర్వాల్ హైదరాబాద్ తరఫున అత్యధికంగా 49 పరుగులు చేశాడు. చివరి బంతి వరకు ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివరి ఓవర్లో హైదరాబాద్ విజయానికి 6 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉంది. వాషింగ్టన్ సుందర్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ ముఖేష్ కుమార్ చివరి ఓవర్లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సుందర్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

భువీ, సుందర్‌ల కష్టం వృధా..

హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ను 144 పరుగులకే కట్టడి చేశారు. వాషింగ్టన్ సుందర్, భువేశ్వర్ కుమార్ బంతుల ముందు ఢిల్లీ టీమ్ మెకరిల్లినా.. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ మాత్రం వారి శ్రమకు ఫలితం లేకుండా చేశారు. ఇన్నింగ్స్ తొలి బంతికే భువీ ఫిల్ సాల్ట్ రూపంలో ఢిల్లీకి గట్టి దెబ్బ ఇచ్చాడు. ఈ వికెట్ తర్వాత వికెట్ల వర్షం కురిసింది. మిచెల్ మార్ష్ 25, కెప్టెన్ డేవిడ్ వార్నర్ 21, సర్ఫరాజ్ ఖాన్ 10, అమన్ ఖాన్ 4 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు.

పాండే, అక్షర్‌ల పోరాటం..

62 పరుగులకే 5 వికెట్లు పతనమైన తర్వాత మనీష్ పాండే, అక్షర్ పటేల్ కలిసి ఇన్నింగ్స్‌ను ఆదుకునేందుకు ప్రయత్నించారు. వీరిద్దరి మధ్య 59 బంతుల్లో 69 పరుగుల భాగస్వామ్యం ఉంది. అక్షర్‌ను బౌల్డ్ చేసి.. భువీ ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. ఆ తర్వాత వెంటనే పాండే కూడా ఔటయ్యాడు. పటేల్ రూపంలో ఢిల్లీకి 131 పరుగుల వద్ద ఆరో దెబ్బ తగిలింది. ఆ తర్వాత ఢిల్లీ 8 పరుగులకే తన తదుపరి 3 వికెట్లను కోల్పోయింది. పటేల్ మరియు పాండే ఇద్దరూ 34 34 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు.

మ్యాచ్ వివరాలు సంక్షిప్తంగా..

స్కోర్లు: ఢిల్లీ 144/9, హైదరాబాద్ 137/6

అగర్వాల్ 49, హెన్రిచ్‌ 31, వాషింగ్టన్‌ 24

అక్షర్‌, అన్రిచ్‌కు రెండేసి వికెట్లు

ఢిల్లీ: అక్షర్‌ పటేల్‌ 34, మనీష్‌ పాండే 34 పరుగులు

మార్ష్‌ 25, డేవిడ్‌ వార్నర్‌ 21 పరుగులు

మూడు వికెట్లు పడగొట్టిన వాషింగ్టన్‌ సుందర్‌

భువనేశ్వర్‌ 2, నటరాజన్‌కు ఒక వికెట్‌

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..