Virat Kohli: ఆర్‌సిబి కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారీ జరిమానా.. కారణమిదే..

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన జట్టు స్లో ఓవర్‌రేట్‌ను కొనసాగించినందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సిబి) స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి జరిమానా విధించింది ఐపీఎల్ మేనేజ్‌మెంట్. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యా్చ్‌లో ఆర్‌సిబి స్లో ఓవర్ రేట్ నమోదు చేసిందని,

Virat Kohli: ఆర్‌సిబి కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారీ జరిమానా.. కారణమిదే..
Virat Kohli
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 25, 2023 | 5:56 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన జట్టు స్లో ఓవర్‌రేట్‌ను కొనసాగించినందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సిబి) స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి జరిమానా విధించింది ఐపీఎల్ మేనేజ్‌మెంట్. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యా్చ్‌లో ఆర్‌సిబి స్లో ఓవర్ రేట్ నమోదు చేసిందని, ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ టీమ్ రెండోసారి తప్పుడు చేసినందు స్టాండ్ ఇన్ కెప్టెన్ అయిన కోహ్లీకి ఫైన్ వేసినట్లు ఐపీఎల్ ప్రకటించింది. విరాట్ కోహ్లికి రూ. 24 లక్షలు జరిమానా విధించగా.. ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌తో సహా ప్లేయింగ్ ఎలెవన్‌లోని ప్రతి సభ్యునికి రూ. 6 లక్షలు ఫైన్ లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత, ఏది తక్కువైతే అది వేయడం జరుగుతుందని ఐపీఎల్ ప్రకటించింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆదివారం ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్‌ల భీకర అర్ధ సెంచరీలు, హర్షల్ పటేల్ మూడు వికెట్ల పడగొట్టడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్.. రాజస్థాన్ రాయల్స్‌ని 7 పరుగుల తేడాతో ఓడించింది. డు ప్లెసిస్ 39 బంతుల్లో 62 పరుగులు, మాక్స్వెల్ 44 బంతుల్లో 77 పరుగులతో దుమ్మురేపారు. ఇక హర్షల్ పటేల్ 3/32 తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అతను చివరి ఓవర్‌లో తనదైన బౌలింగ్‌తో ఆర్‌సీబీ గెలుపునకు కారణం అయ్యాడు. ఇక డేవిడ్ విల్లీ, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు.

మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సిబి నిర్ణీత 20 ఓవర్లలో 189/9 చేసింది. స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లిని గోల్డెన్ డకౌట్‌తో 12/2తో కష్టకాలంలో పడింది. ఆ సమయంలో ఫాఫ్ డు ప్లెసిస్ (39 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 62), గ్లెన్ మాక్స్వెల్ (44 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 77) మూడో వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఆర్ఆర్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ (2/41) అద్భుతంగా రాణించాడు. సందీప్ శర్మ కూడా తన నాలుగు ఓవర్లలో 2/49 తీసుకున్నాడు. యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశారు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. జోస్ బట్లర్ డకౌట్ అయి అందరినీ నిరాశ పరిచాడు. అయితే రెండో వికెట్‌కు యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 47), దేవదత్ పడిక్కల్ (34 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 52) మధ్య రెండో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు స్కోర్‌ని అమాంతం పెంచారు. ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ (15 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22), ధ్రువ్ జురెల్ (16 బంతుల్లో 2 ఫోర్లు, రెండు సిక్సర్లతో 34*) అందించారు. అయినప్పటికీ ఆర్‌సిబి బౌలర్ల దాటికి ఏడు పరుగుల తేడాతో రాజస్థాయి రాయల్స్ టీమ్ ఓడిపోయింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?