AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WORLD CUP: భారత్ తో మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ కు బిగ్ షాక్.. ఆ ఆటగాడికి గాయం.. ఆదివారం నాటి మ్యాచ్ కు డౌటే..?

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా సూపర్-12 మ్యాచ్ లు అక్టోబర్ 22వ తేదీ శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. సూపర్ -12లో భాగంగా ఆదివారం భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ లో..

T20 WORLD CUP: భారత్ తో మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ కు బిగ్ షాక్.. ఆ ఆటగాడికి గాయం.. ఆదివారం నాటి మ్యాచ్ కు డౌటే..?
Pakistan Cricketer Shan Mas
Amarnadh Daneti
| Edited By: |

Updated on: Oct 22, 2022 | 5:49 PM

Share

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా సూపర్-12 మ్యాచ్ లు అక్టోబర్ 22వ తేదీ శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. సూపర్ -12లో భాగంగా ఆదివారం భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ లో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు ముమ్మర ప్రాక్టీస్ చేస్తున్నాయి. శుక్రవారం పాకిస్తాన్ జట్టు నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా.. ఆ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ప్రాక్టీస్ సమయంలో పాకిస్తాన్ ఓపెనర్ షాన్ మసూద్ తలకు తీవ్ర గాయమైంది. షాన్ మసూద్ ను స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే పెద్ద ప్రమాదం లేదని టీమ్ డాక్టర్లు చెప్పినప్పటికి స్కానింగ్ రిపోర్టు ఆధారంగా వైద్య నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా షాన్ మసూద్ ఆదివారం నాటి మ్యాచ్ కు అందుబాటులో ఉంటారా లేదా అనేది తెలియనుంది. T20 ప్రపంచ కప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్ కు ముందు స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది ఫిట్ నెస్ తో జట్టులో చేరడంతో పాకిస్తాన్ కొంత ఊపిరి పీల్చుకుంది. అయితే, శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌లో ఓపెనర్ షాన్ మసూద్ గాయపడటంతో ఆ జట్టుకు షాక్ తగిలింది.

షాన్ మసూద్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పాకిస్థాన్ జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా, ఆల్ రౌండర్ మహ్మద్ నవాజ్ నెట్స్‌లోకి వెళ్లి కొట్టిన షాట్ తో బంతి షాన్ మసూద్ తలపై తగిలింది. వెంటనే టీమ్ వైద్యులు అతడికి వైద్య సహాయం అందించారు. ఆ తర్వాత స్కానింగ్ కోసం తరలించారు. గ్రౌండ్ నుండి బయటికి వెళుతున్నప్పుడు బంతి తగిలిన తల భాగాన్ని తన చేతితో పట్టుకోవడం వీడియోలో కనిపించింది.

33 ఏళ్ల షాన్ మసూద్ ఇప్పటివరకు పాకిస్తాన్ తరపున పన్నెండు T20I మ్యాచ్‌లు ఆడాడు, 125.00 స్ట్రైక్ రేట్‌తో 220 పరుగులు చేశాడు, రెండు అర్ధసెంచరీలు చేశాడు. సున్నిత ప్రాంతంలో దెబ్బ తగిలిందని, అతడి ప్రస్తుత ఆరోగ్య స్థితి తనకు తెలియదని, జట్టు ఫిజియో చేసిన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాడని సంఘటన తర్వాత పాకిస్తాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ తెలిపారు. షాన్ మసూద్ త్వరగా కోలుకోవాలని తాము ప్రార్థిస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..