AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WORLD CUP 2022: రెండు సార్లు ఛాంపియన్.. అయినా సూపర్-12కు నో క్వాలిఫై.. చుక్కలు చూపించిన పసికూనలు..

టీ20 ఫార్మట్ లో వెస్టిండీస్ జట్టుకు ఓ ప్రత్యేకత ఉంది. అయితే అది గతం.. ప్రస్తుతం మాత్రం పనికూనల చేతిలో ఓటమితో టీ20 ప్రపంచ కప్ లో సూపర్-12కు అర్హత సాధించలేకపోయింది. వెస్టిండీస్ క్రికెట్ జట్టులో ఆటగాళ్లను..

T20 WORLD CUP 2022: రెండు సార్లు ఛాంపియన్.. అయినా సూపర్-12కు నో క్వాలిఫై.. చుక్కలు చూపించిన పసికూనలు..
Ireland Cricket Team
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 21, 2022 | 10:49 PM

టీ20 ఫార్మట్ లో వెస్టిండీస్ జట్టుకు ఓ ప్రత్యేకత ఉంది. అయితే అది గతం.. ప్రస్తుతం మాత్రం పనికూనల చేతిలో ఓటమితో టీ20 ప్రపంచ కప్ లో సూపర్-12కు అర్హత సాధించలేకపోయింది. వెస్టిండీస్ క్రికెట్ జట్టులో ఆటగాళ్లను చూస్తే భారీ స్కోర్ కొట్టగల సత్తా ఉన్నవారిగానే కనిపిస్తారు. ఆజట్టు టీ20 మ్యాచ్ ఆడితే భారీ స్కోర్ తప్పదనుకుంటారు అంతా. కాని టీ20 ప్రపంచకప్ 2022లో మాత్రం సీన్ రివర్స్ అయింది. సూపర్-12 కోసం క్వాలిఫయింగ్ రౌండ్స్ ఆడాల్సి వచ్చింది. గ్రూప్ స్థాయిలో మూడు మ్యాచ్ లు ఆడి రెండింటిలో ఓడిపోవడంతో టోర్నమెంట్ నుంచి విండీస్ జట్టు ఇంటిముఖం పట్టింది. గ్రూప్ స్థాయి మ్యాచుల్లో అక్టోబర్ 21వ తేదీన శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. పసికూన ఐర్లాండ్ జట్టు వెస్టిండీస్‌కు షాక్‌ ఇచ్చి.. టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12లోకి దూసుకొచ్చింది. గ్రూప్‌ -బి నుంచి అర్హత సాధించిన జట్టుగా నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2022 ప్రారంభమ్యాచ్ లోనే నమీబియా జట్టు ఆసియా కప్ 2022 విజేత శ్రీలంకను ఓడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌లో రెండుసార్లు టైటిట్‌ గెల్చుకున్న వెస్టిండీస్‌.. ఈసారి మాత్రం క్వాలిఫయిర్‌ రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది.

నికోలస్‌ పూరన్ నాయకత్వంలోని వెస్టిండీస్ కీలకమైన పోరులో ఐర్లాండ్‌ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన ఐర్లాండ్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్‌ 62 పరుగులతో నాటౌట్ గా నిలవగా, చార్లెస్ 24 పరుగులు, ఓడియన్ స్మిత్ 19 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి పర్వాలేదనిపించారు. ఐర్లాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వెస్టిండీస్ జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. ఐర్లాండ్‌ బౌలర్లలో డెలానీ 3, బారీ, సిమి సింగ్‌ చెరో వికెట్ తీసుకున్నారు. 147 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టుకు ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బాల్బిర్నీ శుభారంభానిచ్చారు. దీంతో 7.3 ఓవర్లలోనే 73 పరుగుల స్కోర్ చేసింది ఐర్లాండ్ జట్టు. అల్జారీ జోసెఫ్‌, జాసన్ హోల్డర్, మెకాయ్‌ వంటి పేసర్లు ఉన్న వెస్టిండీస్‌ను ఐర్లాండ్ తేలికగా ఎదుర్కొంది.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి వెస్టిండీస్ బౌలింగ్ ను ఎదుర్కొని ఐర్లాండ్ 147 పరుగులు చేయడం అసాధ్యం అనుకున్నారంతా. అయితే దానిని సాధ్యం చేసి చూపించారు ఐర్లాండ్ బ్యాట్స్ మెన్స్. పాల్ స్టిర్లింగ్ 66 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా, ఆండ్రూ బాల్బిర్నీ 37 పరుగులు చేశాడు. బాల్బిర్నీ పెవిలియన్ చేరినప్పటికి.. ఐర్లాండ్‌ బ్యాట్స్ మెన్ వేగంగానే ఆడారు. లొర్కాన్ టక్కర్ 45 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయిన ఐర్లాండ్‌ 17.3 ఓవర్లలో 150 పరుగులు చేసి విజయం సాధించింది.

వెస్టిండీస్ జట్టుపై ఐర్లాండ్ జట్టు విజయం పై అనేక మంది క్రీడారంగ ప్రముఖులు స్పందించారు. ఐర్లాండ్ బాగా ఆడిందని వ్యాఖ్యాత హర్షా బోగ్లే ట్విట్టర్ లో స్పందించగా, మొదటి సారి వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ సూపర్ 12కు అర్హత సాధించలేదని భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ పేర్కొన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..