MS Dhoni: ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందంటే.. ధోనీ రిటైర్మెంట్‌ గురించి కీలక విషయాలు చెప్పిన గైక్వాడ్..

Mahendra Singh Dhoni: ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్ ఆడటానికి విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ చేరుకుంది.

MS Dhoni: ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందంటే.. ధోనీ రిటైర్మెంట్‌ గురించి కీలక విషయాలు చెప్పిన గైక్వాడ్..
Ruturaj
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 04, 2021 | 4:14 PM

Mahendra Singh Dhoni: ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్ ఆడటానికి విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ చేరుకుంది. జూన్ 18 నుండి సౌతాంప్టన్‌లో జరుగనున్న ఈ టైటిల్ మ్యాచ్‌లో.. న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ అనంతరం టీమ్ ఇండియా కూడా ఆతిథ్య జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్‌లో పాల్గొననుంది.

ఇదిలావుండగా, భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతున్నాడు. కరోనా కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 14 కొద్ది రోజుల క్రితం వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ సెకండ్ పేజ్ మ్యాచ్‌లు త్వరలో జరుగాయని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. దాంతో ధోనీ ఈ మ్యాచ్‌లకు సన్నద్ధం కావాల్సి ఉంది. ఇప్పుడు ధోనీ టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గతేడాది గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ధోనీ చేసిన పదవి విరమణ ప్రకటనకు సంబంధించి తాజాగా రుతురాజ్ గైక్వాడ్ కీలక విషయాలు వెల్లడించాడు. ధోనీ తన రిటైర్మెంట్ గురించి ఎవరికీ సమాచారం ఇవ్వలేదన్నారు.

ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందంటే.. రుతురాజ్ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘ఆగస్టు 15న దుబాయ్ బయలుదేరే ముందు 10 నుంచి 15 మంది ఆటగాళ్ళం చెన్నైలో ధోనితో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాం. కానీ ఆటగాళ్ళు ఎవరూ ధోనీని పెద్దగా గమనించలేదు. విచిత్రమేంటంటే ధోనీ రిటైర్మెంట్ వార్త సోషల్ మీడియా ద్వారా సీఎస్‌కే టీమ్‌‌కు తెలిసింది. అది చూసి అందరం షాక్ అయ్యాం. ఆ రోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రాక్టీస్ ముగిసింది. రాత్రి 7 గంటలకు ధోనీతో సహా అందరూ రాత్రి భోజనం చేయడానికి కూర్చున్నాం. అప్పుడు అకస్మాత్తుగా ఎవరో నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మహీ భాయ్ తన రిటైర్మెంట్ ప్రకటించినట్లు చెప్పారు. అప్పుడు ఏమీ అనిపించలేదు. దానిపై ఎలాంటి చర్చా జరుగలేదు. ధోని రిటైర్ ప్రకటించే వాతావరణే అక్కడ కనిపించలేదు. అందుకే ఆ వ్యక్తికి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ, అదే నిజమైంది. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ధోనీ తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు. ఆ ప్రకటన తరువాత ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ధోనీని చూడలేమనే భావనను మేమెవ్వరం కూడా జీర్ణించుకోలేకపోయాం. ధోనీ రిటైర్ ప్రకటించారనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి నాకు రెండు, మూడు రోజులు పట్టింది. నేను మాత్రమే కాదు.. ధోనీ భాయ్ నిర్ణయం తెలిసి టీమ్ సభ్యులందరి పరిస్థితి అలానే ఉంది.’’ అని గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.

Also read:

Viral News: కత్తిలాంటి ఐడియా.. మంచంపై పడుకొనే పొలం పనులు చేస్తోన్న రైతు.. నెటిజన్లు ఫిదా.!