PKL 2024: ఎదురులేని పుణెరి పల్టన్‌.. గుజరాత్‌ జెయింట్స్‌పై 49-30తో ఘన విజయం

Pro Kabaddi League Season 11: డిఫెండింగ్‌ చాంపియన్‌ పుణెరి పల్టన్‌ టాప్‌ లేపింది. ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో ఐదో విజయం ఖాతాలో వేసుకున్న పుణెరి పల్టన్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం మరింత పదిలం చేసుకుంది. సోమవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన పీకెఎల్‌ 11 లీగ్‌ దశ మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌పై 49-30తో పుణెరి పల్టన్‌ ఏకపక్ష విజయం సాధించింది.

PKL 2024: ఎదురులేని పుణెరి పల్టన్‌.. గుజరాత్‌ జెయింట్స్‌పై 49-30తో ఘన విజయం
Puneri Paltan Vs Gujarat Giants
Follow us
Janardhan Veluru

|

Updated on: Nov 04, 2024 | 9:27 PM

హైదరాబాద్‌, 4 నవంబర్‌ 2024 : డిఫెండింగ్‌ చాంపియన్‌ పుణెరి పల్టన్‌ టాప్‌ లేపింది. ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో ఐదో విజయం ఖాతాలో వేసుకున్న పుణెరి పల్టన్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం మరింత పదిలం చేసుకుంది. సోమవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన పీకెఎల్‌ 11 లీగ్‌ దశ మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌పై 49-30తో పుణెరి పల్టన్‌ ఏకపక్ష విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్నప్పటికీ సమిష్టిగా మెరిసిన పుణెరి పల్టన్‌ 19 పాయింట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌ను చిత్తు చేయటం విశేషం. పుణెరి పల్టన్‌ ఆటగాళ్లలో ఆకాశ్‌ షిండె (11 పాయింట్లు) సూపర్‌ టెన్‌తో మెరువగా.. పంకజ్‌ మోహితె (8 పాయింట్లు), మోహిత్ గోయత్‌ ( 5 పాయింట్లు), ఆమన్‌ ( 5 పాయింట్లు), గౌరవ్‌ ఖత్రి ( 5 పాయింట్లు) అదరగొట్టారు. గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున గుమన్‌ సింగ్‌ ( 13 పాయింట్లు) సూపర్‌ టెన్‌ ప్రదర్శనతో ఒంటరి పోరాటం చేశాడు. పుణెరి పల్టన్‌ ఏడు మ్యాచుల్లో ఐదో విజయం సాధించగా, గుజరాత్‌ జెయింట్స్‌ ఐదు మ్యాచుల్లో నాల్గో పరాజయం చవిచూసింది.

పల్టన్‌ వన్‌సైడ్‌ షో :

వరుస విజయాల జోరుమీదున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ పుణెరి పల్టన్‌.. గుజరాత్‌ జెయింట్స్‌పై పంజా విసిరింది. ప్రథమార్థంలోనే ఆ జట్టుపై ఏకంగా 21 పాయింట్ల భారీ ఆధిక్యం సాధించింది. ప్రథమార్థం తొలి ఐదు నిమిషాల్లో, చివరి ఐదు నిమిషాల ఆటలో గుజరాత్‌ జెయింట్స్‌ను ఆలౌట్‌ చేసిన పుణెరి పల్టన్‌ 30-9తో వన్‌సైడ్‌ షో చేసింది. కెప్టెన్‌ అస్లాం ఇనందార్‌ బరిలో లేకపోయినా.. ఆకాశ్‌ షిండే, పంకజ్‌ మోహితె, మోహిత్‌ గోయత్‌లు కూతలో కేక పెట్టించారు. పంకజ్‌ మోహితె, మోహిత్‌ గోయత్‌లు కండ్లుచెదిరే సూపర్‌ రెయిడ్లతో ఆకట్టుకున్నారు. డిఫెన్స్‌లో గౌరవ్‌ ఖత్రి, ఆమన్‌ ట్యాకిల్స్‌ జెయింట్స్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టాయి. తొలి పది నిమిషాల్లో 14-5తో ముందంజ వేసిన పుణెరి పల్టన్‌.. తర్వాతి పది నిమిషాల్లో రెట్టించిన ఉత్సాహంతో పాయింట్లు సాధించింది. గుజరాత్‌ జెయింట్స్‌ పూర్తిగా తేలిపోయింది. గుమన్‌ సింగ్‌ కూతలో మెరిసినా.. ఇతర ఆటగాళ్లు దారుణంగా నిరాశపరిచారు.

గుజరాత్‌ పుంజుకున్నా.. పుణెరి అదే జోరు :

విరామం అనంతరం సైతం పుణెరి పల్టన్‌ జోరు తగ్గలేదు. గుజరాత్‌ జెయింట్స్‌ ఆట కాస్త మెరుగైనా.. పుణెరి పల్టన్‌కు పోటీ ఇచ్చే స్థాయిలో రాణించలేదు. ద్వితీయార్థం తొలి పది నిమిషాల తర్వాత పుణెరి పల్టన్‌ 41-16తో 25 పాయింట్ల ఆధిక్యం దక్కించుకుంది. క్రమం తప్పకుండా పాయింట్లు సాధించిన గుజరాత్‌ జెయింట్స్‌ ఆఖరు ఐదు నిమిషాల ఆట మిగిలి ఉండగా పుణెరి పల్టన్‌ను ఆలౌట్‌ చేసింది. పాయింట్ల అంతరం తగ్గించేందుకు చివరి ఐదు నిమిషాల్లో మంచి ప్రయత్నమే చేసింది. అయినా, పుణెరి పల్టన్‌ అలవోకగా సీజన్లో ఐదో విజయం సాధించింది. ద్వితీయార్థంలో పుణెరి పల్టన్‌ 19 పాయింట్లు సాధించగా, గుజరాత్‌ జెయింట్స్‌ 21 పాయింట్లు దక్కించుకుంది.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!