‘షూ’ లేస్​ కట్టుకోవడం రాదు.. ధోనీని విమర్శిస్తారా..?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తనకు నచ్చినప్పుడు రిటైర్మెంట్ ప్రకటించే హక్కు ఉందని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. బంగ్లాదేశ్‌తో సిరిస్‌కు భారత జట్లను ఎంపిక చేసేందుకుగాను ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని భవిష్యత్తు గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు జట్టు ఎంపికకు ముందే ధోనీతో మాట్లాడామని ఎమ్మెస్కే తెలిపాడు. యువ […]

'షూ' లేస్​ కట్టుకోవడం రాదు.. ధోనీని విమర్శిస్తారా..?
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 26, 2019 | 5:10 PM

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తనకు నచ్చినప్పుడు రిటైర్మెంట్ ప్రకటించే హక్కు ఉందని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. బంగ్లాదేశ్‌తో సిరిస్‌కు భారత జట్లను ఎంపిక చేసేందుకుగాను ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని భవిష్యత్తు గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు జట్టు ఎంపికకు ముందే ధోనీతో మాట్లాడామని ఎమ్మెస్కే తెలిపాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలన్న ఆలోచనలకు ధోని సైతం మద్దతు తెలిపాడని అన్నాడు.

రిటైర్మెంట్‌పై తుది నిర్ణయం ధోనీదేనని… మేం పూర్తిగా భవిష్యత్తుపై దృష్టి పెట్టామని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు బంగ్లాదేశ్‌తో సిరిస్‌కు రిషబ్ పంత్‌తో పాటు యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు సెలక్టర్లు చోటిచ్చారు. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ మరోసారి తెరపైకి వచ్చింది. ధోనీని తన ఫేర్‌వెల్ సిరిస్‌కే సెలక్టర్లు ఎంపిక చేస్తారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ధోని భవితవ్యంపై చర్చించే వారిపై రవిశాస్త్రి మండిపడ్డాడు.

షూలేస్‌ కట్టుకోలేనివారు.. ధోనీపై కామెంట్స్‌:

“ధోనిపై కామెంట్ చేసేవారిలో సగం మందికి షూ లేస్ కట్టుకోవడం చేతకాదు. దేశం కోసం అతడు(మహీ) ఏం సాధించాడో చూడండి. అతడు వెళ్లాలని ఎందుకు అంత తొందరపడుతున్నారు. మహీ గురించి మాట్లాడేందుకు ఈ విషయం తప్ప వారికి ఇంకేమి దొరకలేదనుకుంటా. ఆటకు త్వరలోనే వీడ్కోలు పలకాలని ధోనీతో పాటు అందరికీ తెలుసు. 15 ఏళ్లపాటు భారత్​కు ప్రాతినిధ్యం వహించిన మహీకి ఎప్పుడు రిటైర్​ అవ్వాలో తెలుసు. టెస్టులు నుంచి వైదొలిగినప్పుడు అతడు ఏమైనా చెప్పాడా.. ఆ నిర్ణయం తీసుకుని సాహాకు అవకాశం కల్పించాడు. జట్టుకు అతడో నీడలాంటి వాడు. ధోనీ వ్యూహాలు, ప్రణాళికలు జట్టుకు ఎంతో ఉపయోగపడతాయి. ధోనీపై వ్యాఖ్యలు చేయడం.. అతడిని అగౌరవపరిచినట్లే” అంటూ టీమిండియా హెచ్ కోచ్ రవిశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇటీవల జరిగిన ప్రపంచకప్‌ సెమీఫైనల్లో భారత్‌ ఓటమి తర్వాత ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ఇచ్చాడు. భారత ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతో వెస్టిండీస్‌ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత సొంతగడ్డపై జరిగిన దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు. తాజాగా బంగ్లాదేశ్‌ టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కూడా ధోనీ లేడు. అయితే, ధోనీ తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ అందుకోవడానికి ఝార్ఖండ్‌ అండర్‌-23 జట్టుతో కలిసి అతడు సాధన చేసే అవకాశముంది.