‘నాన్నకు ప్రేమతో’.. జీవా ఏం చేసిందంటే?
మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని కూతురు జీవాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన ముద్దు ముద్దు మాటలు, అల్లరితో ఎందరో అభిమానులను సంపాదించింది. జీవాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఖాతా ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని అమ్మ సాక్షి, నాన్న ధోని నిర్వహిస్తుంటారు. ఇక తాజాగా జీవా ఇన్‌స్టాలో శనివారం ఓ అద్భుతమైన వీడియో పోస్ట్ చేశారు. దానిలో ‘తలా’ ధోని ఇంచక్కా కూతురుతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ వీడియోలో సోఫాలో కూర్చున్న ధోనికి […]
మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని కూతురు జీవాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన ముద్దు ముద్దు మాటలు, అల్లరితో ఎందరో అభిమానులను సంపాదించింది. జీవాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఖాతా ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని అమ్మ సాక్షి, నాన్న ధోని నిర్వహిస్తుంటారు. ఇక తాజాగా జీవా ఇన్‌స్టాలో శనివారం ఓ అద్భుతమైన వీడియో పోస్ట్ చేశారు. దానిలో ‘తలా’ ధోని ఇంచక్కా కూతురుతో ఎంజాయ్ చేస్తున్నాడు.
ఆ వీడియోలో సోఫాలో కూర్చున్న ధోనికి భుజాలు నొక్కుతూ జీవా మసాజ్ చేస్తుంటుంది. మరో వీడియోలో ఇద్దరూ ఉయ్యాల ఊగుతున్నట్లు ఊగుతుంటారు. ఇక ఈ వీడియోలు పెట్టిన కొద్దిసేపటికే వైరల్ అయ్యాయి. దాదాపు కొన్ని గంటల్లోనే 4 లక్షలకు పైగా లైకులు సొంతం చేసుకున్నాయి. అంతేకాక మహీ అప్పుడప్పుడు తన కూతురు చేసే అల్లరి చేష్టలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటాడు.
ఫ్యాన్స్ అందరూ తలా ధోని ఎప్పుడు జట్టులోకి పునరాగమనం చేస్తాడని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే.. ధోని మాత్రం తన కూతురుతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు ధోని ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్‌కు తిరిగి జట్టులోకి వస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
View this post on Instagram