Wimbledon 2021, Men’s Final: 20వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన నొవాక్‌ జకోవిచ్‌.. తొలిసారి వింబుల్డన్ ఫైనల్ చేరిన బెరెట్టిని!

వింబుల్డన్ 2021లో పురుషుల సింగిల్స్ లో ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఈ పోరులో నొవాక్‌ జకోవిచ్‌తో మాటియో బెరెట్టిని తలపడనున్నాడు.

Wimbledon 2021, Men’s Final: 20వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన నొవాక్‌ జకోవిచ్‌.. తొలిసారి వింబుల్డన్ ఫైనల్ చేరిన బెరెట్టిని!
Novak Djokovic
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Venkata Chari

Updated on: Jul 11, 2021 | 2:02 PM

వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో 19 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన నొవాక్‌ జకోవిచ్‌.. ఇటలీకి చెందిన మాటియో బెరెట్టినితో తలపడనున్నాడు. బెరెట్టిని తన కెరీర్‌లో తొలిసారిగా గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. వింబుల్డన్ ఫైనల్‌కు చేరుకున్న మొదటి ఇటాలియన్ ఆటగాడిగా బెరెట్టిని నిలిచాడు. మరోవైపు టాప్ సీడ్ జకోవిచ్‌ 30 వ సారి ఫైనల్ ఆడనున్నాడు.

జకోవిచ్‌ ఈ టైటిల్ గెలిస్తే.. 20వ సారి గ్రాండ్ స్లామ్‌ను గెలుచుకున్న రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్‌ల సరసన నిలవనున్నాడు. 1976 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇటటీ ఆటగాడు అడ్రియానో పియాటా టైటిల్ గెలిచాడు. ఆయన తరువాత ఇటలీ నుంచి బరిలోకి దిగిన బెరెట్టిన ఫైనల్ చేరాడు. ఏడవ సీడ్‌గా బరిలోకి దిగిన బెరెట్టిని మొదటిసారి ఫైనల్ చేరాడు. అయితే, ఈ మ్యాచ్‌లో మరో విశేషం కూడా ఉంది. మరియా సిసాక్ అనే ఒక మహిళ అంపైర్‌గా వ్యహరించనుంది. 1877లో ప్రారంభమైన ఈ టోర్నీలో పురుషుల తుదిపోరుకు ఓ మహిళ అంపైర్‌గా వ్యవహరించనుండడం ఇదే మొదటిసారి. క్రొయేషియాకు చెందిన 43 ఏళ్ల మారియా సికాక్‌ ఈ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచింది. గోల్డ్‌ బ్యాడ్జ్‌ అంపైర్‌ హోదా ఉన్న మారియా.. 2012 నుంచి డబ్ల్యూటీఏ ఎలైట్‌ బృందంలో సభ్యురాలిగా కొనసాగుతోంది. 2014 వింబుల్డన్‌ మహిళల ఫైనల్‌, 2017 వింబుల్డన్‌ మహిళల డబుల్స్‌ ఫైనల్లో అంపైర్‌గా చేసింది. వీటితోపాటు 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లోనూ అంపైర్‌గా పని చేసింది.

నొవాక్‌ జకోవిచ్‌, మాటియో బెరెట్టిని మధ్య వింబుల్డన్ ఫైనల్ ఎప్పుడు జరగనుంది? నొవాక్‌ జకోవిచ్‌, మాటియో బెరెట్టినిల మధ్య వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ జులై 11 ఆదివారం జరగనుంది.

నొవాక్‌ జకోవిచ్‌, మాటియో బెరెట్టినిల మధ్య వింబుల్డన్ ఫైనల్ ఎప్పుడు మొదలుకానుంది? నొవాక్‌ జకోవిచ్‌, మాటియో బెరెట్టినిల మధ్య వింబుల్డన్ ఫైనల్ సాయంత్రం 6.30 గంటలకు మొదలుకానుంది.

నొవాక్‌ జకోవిచ్‌, మాటియో బెరెట్టినిల మధ్య వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసే ఛానల్స్? నొవాక్‌ జకోవిచ్‌, మాటియో బెరెట్టినిల మధ్య వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2 ఛానల్స్‌తో పాటు డిస్నీ + హాట్‌స్టార్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

Also Read:

ENG vs PAK: ఈ బౌలర్లకు భయపడుతోన్న ఇంగ్లండ్ ఆల్‌ రౌండర్‌.. లిస్టులో టీమిండియా స్పిన్నర్ కూడా..!

వింబుల్డన్ ట్రోఫీని గెలిచిన క్రికెటర్ ఆష్లే భార్టీ.. ఈ జాబితాలో ఇంకెవరున్నారో తెలుసా..?

Euro 2020 final: తొలిసారి ట్రోఫీని ముద్దాడాలని ఇంగ్లండ్.. రెండవసారి ఒడిసి పట్టాలని ఇటలీ.. హోరాహోరీగా యూరో కప్ తుది పోరు..!