- Telugu News Photo Gallery Sports photos Wimbledon 2021 wimbledon 2021 womens singles winner ashley bharti played cricket in 2015 these are the wimbledon champion who played cricket
వింబుల్డన్ ట్రోఫీని గెలిచిన క్రికెటర్ ఆష్లే భార్టీ.. ఈ జాబితాలో ఇంకెవరున్నారో తెలుసా..?
Wimbledon 2021: ప్రపంచ నంబర్ 1, ఆస్ట్రేలియా ప్లేయర్ ఆష్లే బార్టీ.. శనివారం జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ పోరులో విజేతగా నిలిచింది. బార్టీ టెన్నిస్‌తోపాటు క్రికెట్ కూడా ఆడిందని మీకు తెలుసా..? ఈ లిస్టులో మరో ముగ్గురు ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు కూడా వింబుల్డన్ ట్రోఫీని గెలుచుకున్నారు.
Updated on: Jul 11, 2021 | 12:23 PM

శనివారం జరిగిన వింబుల్డన్ మహిళల తుదిపోరులో ప్రపంచ నంబర్ వన్ ఆష్లీ బార్టీ ట్రోఫీని అందుకుంది. ఈ పోరులో చెక్ రిపబ్లిక్ ఎనిమిదవ సీడ్ కరోలినా ప్లిస్కోవాపై 6-3, 6-7 (4), 6-3 తేడాతో మూడు సెట్లలో బార్టీ విజయం సాధించి, ట్రోఫీని ముద్దాడింది.

ఐదేళ్ల వయసు నుంచి టెన్నిస్ ఆడడం మొదలు పెట్టిన ఆస్లే బార్టీ క్రికెట్ ప్లేయర్ కూడా. ఆమె 2015-16 ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఈ సమయంలో బార్టీ టెన్నిస్ నుంచి విరామం తీసుకున్నారు. తొమ్మిది మ్యాచులు ఆడిన ఆమె.. కేవలం 68 పరుగులు సాధించింది. తన ఆటతో సంతృప్తి చెందని బార్టీ, 2016లో టెన్నిస్ ఆటలోకి రీఎంట్రీ ఇచ్చింది.

న్యూజిలాండ్ క్రికెటర్ ఆంథోనీ వైల్డింగ్ కూడా టెన్నిస్ ఆటగాడు. టెన్నిస్ లో మొదటి సూపర్ స్టార్‌గా పేరుగాంచాడు. అతను నాలుగు వింబుల్డన్ టైటిళ్లతో సహా 12 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్నాడు. అలాగే 1904-1914 సంవత్సరాల మధ్య దేశం కోసం ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు.

ఇంగ్లండ్‌కు చెందిన స్పెన్సర్ విలియం గోరే కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ తోపాటు టెన్ని్స్ ఆడాడు. 1877వ సంవత్సరంలో వింబుల్డన్ ఛాంపియన్ అయిన విలియం గోరే.. తరువాతి ఏడాది జరిగిన వింబుల్డన్ సెమీ ఫైనల్ పోరులో ఫ్రాంక్ హడోవ్ చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు 1874-75 మధ్య సర్రే క్రికెట్ క్లబ్ తరపున క్రికెట్ ఆడాడు.

మరో ఇంగ్లండ్ ఆటగాడు ఫ్రాంక్ హడో 1878వ సంవత్సరంలో వింబుల్డన్ విజేతగా నిలిచాడు. అలాగే క్రికెటర్‌గా ఎంసీసీ క్లబ్, మిడిల్ఎక్స్, ఓర్లీన్ క్లబ్‌ల తరుపున ప్రాతినిధ్యం వహించాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగిన ఫ్రాంక్.. ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడాడు.



