Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం.. రికార్డు సృష్టించిన అవనీ లేఖారా..
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఫైనల్‌లో..
టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ పంట పండింది. మెగా క్రీడల్లో ఆరో రోజు భారత అథ్లెట్స్ దుమ్ముదులిపారు. ఒకే రోజు నాలుగు పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉంది. ఇదిలా ఉంటే షూటింగ్‌లో అవనీ లేఖారా చరిత్ర సృష్టించింది.
ఆర్-2 విభాగంలో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఫైనల్‌లో అవని లేఖారా విజయం సాధించి దేశానికి గోల్డ్ మెడల్ అందించింది. ఈ మ్యాచ్‌లో 249.6 పాయింట్లు సాధించిన అవని.. ప్రపంచ రికార్డును సమం చేయడమే కాకుండా పారాలింపిక్స్‌లో సరికొత్త రికార్డును సృష్టించింది. మెగా క్రీడల్లో స్వర్ణం గెలిచిన నాలుగో భారత అథ్లెట్‌గా 19 ఏళ్ల అవని రికార్డుల్లోకి ఎక్కింది. స్విమ్మర్ మురళీకాంత్, దేవేంద్ర జజారియా, మరియప్పన్ ఇప్పటికే ఈ జాబితాలో ఉన్నారు.
కాగా, పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన అవనీ లేఖారాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. ”అద్భుతమైన ప్రదర్శన అవనీ. కంగ్రాచులేషన్స్.. గోల్డ్ మెడల్‌కు నువ్వు నిజమైన అర్హురాలివి. షూటింగ్‌లో నీ హార్డ్‌వర్క్, అభిరుచి వల్ల ఇది సాధ్యమైంది. నిజంగా ఇది భారత క్రీడా రంగానికి స్పెషల్ మూమెంట్” అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
Read Also: కివి పండ్లను వీరు అస్సలు తినకూడదు.. తింటే ఎలా పరిస్థితులు ఎదురవుతాయంటే..
ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో కనిపెట్టండి.! కళ్లకు పని చెప్పండి.. గుర్తించండి!