AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunil Chetri: మెస్సీనే బీట్ చేసిన ఇండియన్… మ‌రో అరుదైన మైల్‌స్టోన్‌ను అందుకున్న కెప్టెన్ సునీల్ ఛెత్రీ

ఇండియ‌న్ ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ మ‌రో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్య‌ధిక గోల్స్ చేసిన లిస్ట్‌లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీని వెన‌క్కి నెట్టి...

Sunil Chetri: మెస్సీనే బీట్ చేసిన ఇండియన్... మ‌రో అరుదైన మైల్‌స్టోన్‌ను అందుకున్న కెప్టెన్ సునీల్ ఛెత్రీ
Unil Chetri Becomes First I
Sanjay Kasula
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jun 09, 2021 | 9:15 AM

Share

Sunil Chetri: ఇండియ‌న్ ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ మ‌రో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్య‌ధిక గోల్స్ చేసిన లిస్ట్‌లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీని వెన‌క్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు. 2022 ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్ క్వాలిఫ‌య‌ర్స్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఛెత్రీ 2 గోల్స్ చేశాడు. దీంతో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫుట్‌బాల్‌లో అత‌ని గోల్స్ సంఖ్య 74కు చేరింది. మెస్సీ 72 గోల్స్‌తో నాలుగోస్థానంలో ఉన్నాడు.

సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి రెండు గోల్స్ చేశాడు. ఈ రెండు గోల్స్ అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఛెత్రిని 74 గోల్స్‌కు తీసుకువచ్చాయి. ప్ర‌స్తుతం పోర్చుగ‌ల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 103 గోల్స్‌ మాత్ర‌మే సునీల్ ఛెత్రీ కంటే ముందున్నాడు. యూఏఈకి చెందిన అలీ మ‌బ్‌ఖౌత్ 73 గోల్స్‌తో మూడోస్థానంలో ఉన్నాడు.

ఈ రికార్డుతో పాటు ఛెత్రి మరో ప్రత్యేక రికార్డును సృష్టించాడు. మూడు దశాబ్దాల్లో దేశం తరఫున స్కోరు చేసిన తొలి భారతీయ ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోయాడు. అతను 2004 లో భారత జట్టుకు అరంగేట్రం చేసినప్పటి నుంచి దేశం కోసం ఆడుతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించాడు. మెస్సీని ఛెత్రీ వెన‌క్కి నెట్టిన విష‌యాన్ని ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు ప్ర‌ఫుల్ ప‌టేల్ త‌న ట్విట‌ర్‌లో వెల్ల‌డించాడు.

ఛెత్రి అద్భుత ప్రదర్శన…

2004 లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన తర్వాత 2007 లో కంబోడియాపై ఛేత్రి తొలి గోల్ చేశాడు. ఇప్పటివరకు ఛెత్రి 117 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 74 గోల్స్ చేశాడు. ప్రస్తుతం ఛెత్రి భారత జట్టులో కీలక ఆటగాడు. బంగ్లాదేశ్‌పై విజ‌యంతో గ్రూప్ ఇలో ఇండియాలో మూడోస్థానానికి ఎగ‌బాకింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏడు మ్యాచ్‌ల‌లో ఆరు పాయింట్లు సాధించింది. బంగ్లాతో మ్యాచ్‌లో ఛెత్రీ త‌న తొలి గోల్‌ను హెడ‌ర్‌తో చేయ‌గా.. మ‌రో గోల్ ఇంజురీ టైమ్‌లో వ‌చ్చింది. క్వాలిఫ‌య‌ర్స్‌లో భాగంగా ఈ నెల 15న త‌న త‌ర్వాతి మ్యాచ్‌లో ఆఫ్ఘ‌నిస్తాన్‌తో ఇండియా త‌ల‌ప‌డ‌నుంది.

ఇవి కూడా చదవండి: అమరావతి ఎంపీ, నటి నవనీత్‌ కౌర్‌ రాణాకు భారీ షాక్.. క్యాస్ట్ సర్టిఫికెట్‌ను రద్దు చేసిన కోర్టు