AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pro Kabaddi League 2021: నేడు బరిలోకి దిగనున్న ఆరు టీంలు.. హోరాహోరీ పోరులో గెలుపెవరిదో?

Pro Kabaddi League Season 8: ప్రో-కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ డిసెంబర్ 22న ప్రారంభమైంది. ఈ ఉత్కంఠ లీగ్‌లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. మొదటి రోజు మూడు మ్యాచులు జరిగాయి. రెండో రోజు షెడ్యూల్ ఎలా ఉందంటే..

Pro Kabaddi League 2021: నేడు బరిలోకి దిగనున్న ఆరు టీంలు.. హోరాహోరీ పోరులో గెలుపెవరిదో?
Pkl 2021 Live Streaming Timings
Venkata Chari
|

Updated on: Dec 23, 2021 | 8:17 AM

Share

PKL 2021 Live Streaming Details: ప్రో కబడ్డీ లీగ్ అట్టహాసంగా మొదలైంది. ఉత్కంఠ రేపుతున్న ఈ లీగ్ ఎనిమిదో సీజన్ నిన్నటి నుంచి ప్రారంభమైంది. గత ఏడాది కరోనా కారణంగా ఈ లీగ్ నిర్వహించలేకపోయారు. ఈసారి పూర్తి ముందుజాగ్రత్తతో నిర్వహిస్తున్నారు. మరోసారి ఈ టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు 12 జట్లు తలపడనున్నాయి. తొలిరోజు కబడ్డీలో మూడు మ్యాచ్‌లు జరిగాయి. తొలిమ్యాచులో యూ ముంబా, రెండో మ్యాచులో తమిళ తలైవాస్, మూడో మ్యాచులో బెంగాల్ వారియర్స్ విజయం సాధించాయి. ఇక రెండో రోజు కూడా ఆరు జట్లు బరిలోకి దిగనున్నాయి.

రెండో రోజు మ్యాచ్‌ల వివరాలు.. 1. Gujarat Giants vs Pink Panthers: తొలి మ్యాచ్ గుజరాత్ గెయింట్స్, పింక్ పాంథర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.

2. Dabang Delhi vs Puneri Paltan: కబడ్డీ రెండో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ వర్సెస్ పునేరి పల్తాన్ మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది.

3. Haryana Steelers vs Patna Pirates: ప్రో కబడ్డీ లీగ్ మూడో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ వర్సెస్ పాట్నా పైరెట్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.

మ్యాచ్‌లు ఎక్కడ ఆడతారు? ఇప్పటివరకు, ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్‌లు దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహించారు. అయితే ఈసారి కరోనా మహమ్మారి కారణంగా, అన్ని మ్యాచ్‌లు బెంగళూరులోనే జరుగుతున్నాయి.

లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడ చూడగలరు? ప్రో-కబడ్డీ లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూడొచ్చు. మీరు ఈ టోర్నమెంట్‌కి సంబంధించిన అన్ని అప్‌డేట్‌లను www.tv9telugu.comలో చదవొచ్చు.

చివరిసారి టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు? ప్రో-కబడ్డీ లీగ్‌లోని అన్ని సీజన్‌లు ఇప్పటివరకు అద్భుతంగా సాగాయి. అభిమానులు ఈ లీగ్‌ని చాలా ఇష్టపడ్డారు. ఈ టోర్నీ చివరి సీజన్ 2019లో జరిగింది. చివరిసారిగా ప్రో-కబడ్డీ లీగ్ టైటిల్‌ను బెంగాల్ వారియర్స్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో దబాంగ్ ఢిల్లీని ఓడించారు.

Also Read: PKL 2021-22 Highlightss: టైగా ముగిసిన మ్యాచ్‌.. అద్భుత ఆటతీరు కనబరిచిన తెలుగు టైటాన్స్‌..

Virat Kohli vs BCCI: మరోసారి మిస్సయిన విరాట్ కోహ్లీ.. ఎందుకిలా చేస్తున్నారంటోన్న ఫ్యాన్స్