AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli vs BCCI: మరోసారి మిస్సయిన విరాట్ కోహ్లీ.. ఎందుకిలా చేస్తున్నారంటోన్న ఫ్యాన్స్

India Tour of South Africa: విరాట్ కోహ్లి నేతృత్వంలో దక్షిణాఫ్రికా వెళ్లిన టీమిండియా.. కెప్టెన్ లేకుండానే పార్టీ చేసుకుంది. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని చిత్రాలను జట్టు సభ్యులు నెట్టింట్లో షేర్ చేశారు. ఇందులో..

Virat Kohli vs BCCI: మరోసారి మిస్సయిన విరాట్ కోహ్లీ.. ఎందుకిలా చేస్తున్నారంటోన్న ఫ్యాన్స్
Ind Vs Sa 1st Test
Venkata Chari
|

Updated on: Dec 23, 2021 | 6:56 AM

Share

Virat Kohli vs Ganguly: విరాట్ కోహ్లి నేతృత్వంలో దక్షిణాఫ్రికా వెళ్లిన టీమిండియా.. కెప్టెన్ లేకుండానే పార్టీ చేసుకుంది. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని చిత్రాలను జట్టు సభ్యులు నెట్టింట్లో షేర్ చేశారు. ఇందులో కోచ్ రాహుల్ ద్రవిడ్, సపోర్టింగ్ స్టాఫ్, సీనియర్ సభ్యుడు చెతేశ్వర్ పుజారా, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఉన్నారు. విశేషమేమిటంటే, ఈ చిత్రాలలో కోహ్లి ఎక్కడా కనిపించడం లేదు.

డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా ఆఫ్రికాలో తొలి టెస్టు మ్యాచ్‌ను టీమిండియా ఆడనుంది. భారత జట్టు బయో బబుల్‌లో నెట్ ప్రాక్టీస్ చేస్తోంది. అయితే, ఈ విధంగా పార్టీని జరుపుకోవడం ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రత పరంగా కూడా ప్రమాదకరమని నిరూపణయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే. ఒమిక్రాన్ వేరియంట్ ద్వారా ఎక్కువగా ప్రభావితమైన దేశాలలో ఆఫ్రికా ఒకటిగా నిలిచింది.

మయాంక్ అగర్వాల్.. పార్టీలోని కొన్ని ఫోటోలను టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పంచుకున్నాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఆటగాళ్లతో పాటు కనిపించారు. మయాంక్ అగర్వాల్ తన పోస్ట్‌లో ఇలా రాశాడు- బార్బెక్యూ నైట్ లాగా ఏమీ లేదు. రోహిత్ శర్మ గాయం తర్వాత మయాంక్ అగర్వాల్‌కు టెస్టు సిరీస్‌లో ఆడే అవకాశాలు పెరిగాయి.

విభేదాలకు సంబంధించిన నివేదికలు.. ఆఫ్రికన్ పర్యటనలో బయలుదేరే ముందు బీసీసీఐ, కోహ్లీ మధ్య విభేదాలకు సంబంధించిన నివేదికలు ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. నిజానికి, బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను జట్టు కొత్త వన్డే, టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమించింది. హిట్‌మ్యాన్‌ను కెప్టెన్‌గా చేసిన తర్వాత, వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంపై కోహ్లి తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడని, వన్డే సిరీస్‌కు కూడా విశ్రాంతి తీసుకుంటాడని వార్తలు వచ్చాయి. కోహ్లి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీల మధ్య వివాదం జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి.

అయితే, దక్షిణాఫ్రికాకు బయలుదేరే ముందు, విరాట్ వన్డే కెప్టెన్సీని వెనక్కి తీసుకున్నందుకు తాను బాధపడలేదని విలేకరుల సమావేశంలో కోహ్లీ పేర్కొన్న విషయం తెలిసిందే. టెస్టు, వన్డేలకు కెప్టెన్సీని కొనసాగించాలని కోరుకున్నానని, అయితే టెస్టు జట్టు ఎంపిక సమయంలో చీఫ్ సెలక్టర్ వన్డే కెప్టెన్సీని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పాడని కోహ్లీ చెప్పాడు.

Also Read: BAN vs NZ: న్యూజిలాండ్ టెస్ట్ జట్టు నుంచి స్టార్ బౌలర్ ఔట్.. వింత కారణం చెప్పిన కోచ్..!

IPL 2022 Mega Auction: ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం..! ఎదురు చూస్తున్న ఫ్రాంచైజీలు..