- Telugu News Photo Gallery Cricket photos Bangladesh Tour of New Zealand: New zealand star spinner Ajaz Patel left out for two test series vs bangladesh
BAN vs NZ: న్యూజిలాండ్ టెస్ట్ జట్టు నుంచి స్టార్ బౌలర్ ఔట్.. వింత కారణం చెప్పిన కోచ్..!
New Zealand Cricket: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టును ప్రకటించారు. అయితే ఈ జట్టులో ఓ ఇన్నింగ్స్‌లో టీమిండియా 10 వికెట్లను పడగొట్టిన అజాజ్ పటేల్‌కు అవకాశం మాత్రం దక్కలేదు.
Updated on: Dec 23, 2021 | 6:44 AM

భారత్‌తో జరిగిన ముంబై టెస్టులో లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. కానీ, ప్రస్తుతం అతను కివీ టెస్ట్ జట్టు నుంచి తప్పించారు. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగే సిరీస్ కోసం న్యూజిలాండ్ టెస్ట్ జట్టును ప్రకటించారు. ఇందులో అజాజ్ పటేల్ పేరు లేకపోవడం విశేషం.

న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ కూడా అజాజ్ పటేల్ నిష్క్రమణకు కారణాన్ని వెల్లడించాడు. భారత్‌పై అజాజ్ పటేల్ చారిత్రాత్మక బౌలింగ్‌ని కలిగి ఉన్నాడని, అయితే ఎంపిక విధానంలో ఇక్కడి మైదానాలకు ఆటగాళ్ల సహకారం చాలా అవసరమని, సొంతగడ్డపై న్యూజిలాండ్ జట్టులో అజాజ్ పటేల్‌ను తీసుకోకపోవడం కూడా ఇదే కారణమంటూ పేర్కొన్నాడు. అంటే అజాజ్ పటేల్ బౌలింగ్ కండీషన్స్ కివీస్ పిచ్‌లకు సెట్ కావని తెలుస్తోంది.

బంగ్లాదేశ్‌తో న్యూజిలాండ్ స్వదేశంలో జనవరి 1 నుంచి రెండు టెస్టుల సిరీస్‌ను ఆడాల్సి ఉంది. జనవరి 9 నుంచి రెండో మ్యాచ్ జరగనుండగా, ఈ సిరీస్‌కు కివీస్ జట్టును ప్రకటించారు.

న్యూజిలాండ్ జట్టులో భారత్‌తో ఆడిన దాదాపు అందరు ఆటగాళ్లకు చోటు లభించగా, అజాజ్ పటేల్ మాత్రమే జట్టుకు దూరమయ్యాడు. డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ మళ్లీ కివీస్ జట్టులోకి వచ్చారు. గాయపడిన కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు విశ్రాంతినిచ్చారు.

న్యూజిలాండ్ టెస్ట్ జట్టు: టామ్ లాథమ్, టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, కైల్ జేమ్సన్, డారెల్ మిచెల్, హెన్రీ నికోల్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సౌతీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, విల్ యంగ్.





























