Pro Kabaddi 2023: బెంగళూరు బుల్స్‌ను బోల్తా కొట్టించిన గుజరాత్ జెయింట్స్‌.. సత్తా చాటిన నీరజ్, భరత్..

Gujarat Giants vs Bengaluru Bulls: కానీ, ద్వితీయార్థం ఆరంభంలో గుజరాత్ జెయింట్స్ జట్టుకు చెందిన సోనూ దూకుడు ఆటను ప్రదర్శించి సూపర్ రైడ్ ద్వారా 3 పాయింట్లు రాబట్టాడు. నిలకడ లేకపోవడంతో బెంగళూరు బుల్స్ జట్టు ట్యాకిల్‌లో తడబడింది. ఫలితంగా రెండో అర్ధభాగం చివరి దశలో గుజరాత్ జెయింట్స్ 26 పాయింట్లు సాధించింది. కానీ, బెంగళూరు బుల్స్ జట్టు 23 పాయింట్ల వద్ద కొనసాగింది.

Pro Kabaddi 2023: బెంగళూరు బుల్స్‌ను బోల్తా కొట్టించిన గుజరాత్ జెయింట్స్‌.. సత్తా చాటిన నీరజ్, భరత్..
Gg Vs Blr
Follow us
Venkata Chari

|

Updated on: Dec 04, 2023 | 6:48 AM

Gujarat Giants vs Bengaluru Bulls: అహ్మదాబాద్‌లోని ఈకేఏ ఎరీనా స్టేడియం వేదికగా జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ 4వ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌పై గుజరాత్‌ జెయింట్స్‌ ఉత్కంఠ విజయం సాధించింది. ఆరంభంలో బలమైన పోరాటానికి సాక్షిగా నిలిచిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ జట్టు తొలి రౌండ్‌లో మంచి ప్రదర్శన కనబరిచింది.

గుజరాత్ జెయింట్స్ జట్టు తొలి రైడర్‌ను అమన్ సమర్థంగా ఎదుర్కొని బెంగళూరు బుల్స్ జట్టుకు తొలి పాయింట్ తీసుకొచ్చాడు. దీని తర్వాత బెంగళూరు బుల్స్ తరపున తొలి రైడ్ చేసిన నీరజ్ నర్వాల్ ఇద్దరిని అవుట్ చేసి 2 పాయింట్లు రాబట్టాడు.

ఇవి కూడా చదవండి

తొలుత 5-0తో ఓటమి చవిచూసిన గుజరాత్ జెయింట్స్.. ట్యాకిల్‌లో జట్టు ప్రదర్శన కనబరిచింది. ఫలితంగా బ్యాక్ టు బ్యాక్ పాయింట్లు సాధించారు. మొదటిసారి 9-9తో స్కోరును సమం చేయగలిగారు.

అయితే, తొలి అర్ధభాగంలో బెంగళూరు బుల్స్‌కు చెందిన నీరజ్‌, భరత్‌ అద్భుతంగా రైడ్‌ చేసి వరుసగా పాయింట్లు రాబట్టారు. ఫలితంగా తొలి అర్ధభాగం ముగిసే సమయానికి బెంగళూరు బుల్స్ జట్టు 20 పాయింట్లు సేకరిస్తే, గుజరాత్ జెయింట్స్ జట్టు 14 పాయింట్లు సాధించింది.

కానీ, ద్వితీయార్థం ఆరంభంలో గుజరాత్ జెయింట్స్ జట్టుకు చెందిన సోనూ దూకుడు ఆటను ప్రదర్శించి సూపర్ రైడ్ ద్వారా 3 పాయింట్లు రాబట్టాడు. నిలకడ లేకపోవడంతో బెంగళూరు బుల్స్ జట్టు ట్యాకిల్‌లో తడబడింది. ఫలితంగా రెండో అర్ధభాగం చివరి దశలో గుజరాత్ జెయింట్స్ 26 పాయింట్లు సాధించింది. కానీ, బెంగళూరు బుల్స్ జట్టు 23 పాయింట్ల వద్ద కొనసాగింది.

అయితే, చివరి దశలో ఇరు జట్ల ఆటగాళ్ల నుంచి హోరాహోరీ పోరు నెలకొంది. ఫలితంగా చివరి 2 నిమిషాల్లో ఇరు జట్ల స్కోర్లు 30-30తో సమమయ్యాయి.

ఈ దశలో గుజరాత్ జెయింట్స్ జట్టు బెంగళూరు బుల్స్ జట్టుకు చెందిన భరత్, నీరజ్ నర్వాల్‌ను ఢీకొని 4 సూపర్ ట్యాకిల్ పాయింట్లు సేకరించింది. ఈ పాయింట్లతో గుజరాత్ జెయింట్స్ జట్టు 34-31తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది.

బెంగళూరు బుల్స్ జట్టు: నీరజ్ నర్వాల్, భరత్, సౌరభ్ నందాల్, యశ్ హుడా, విశాల్, వికాష్ ఖండోలా, రాన్ సింగ్, ఎండీ లిటన్ అలీ, పియోటర్ పాములక్, పొన్‌పర్తిబన్ సుబ్రమణియన్, సుందర్, సుర్జీత్ సింగ్, అభిషేక్ సింగ్, బంటీ, మోను, అంకిత్, సుశీల్, రక్షిత్, రోహిత్ కుమార్.

గుజరాత్ జెయింట్స్ స్క్వాడ్: మనుజ్, సోను, రాకేష్, రోహన్ సింగ్, పార్టిక్ దహియా, ఫజెల్ అత్రాచలి, రోహిత్ గులియా, మహ్మద్ ఇస్మాయిల్ నబీబక్ష్, అర్కం షేక్, సోంబిర్, వికాస్ జగ్లాన్, సౌరవ్ గులియా, దీపక్ రాజేందర్ సింగ్, రవి కుమార్, మోర్ జీబీ, జితేందర్ యాదవ్ నితేష్, నితేష్ బాలాజీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..