కొత్త హెయిర్ స్టైల్‌తో ఫుట్‌బాల్‌లోకి ఎంట్రీ.. బాలీవుడ్ తారలతో కలిసి సందడి చేసిన మిస్టర్ కూల్

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ ధోని.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మాత్రం సందడి చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.

కొత్త హెయిర్ స్టైల్‌తో ఫుట్‌బాల్‌లోకి ఎంట్రీ.. బాలీవుడ్ తారలతో కలిసి సందడి చేసిన మిస్టర్ కూల్
Dhoni New Hair Style
Follow us
Venkata Chari

|

Updated on: Aug 03, 2021 | 11:46 AM

టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ ధోని.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మాత్రం సందడి చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. అయితే తాజాగా మరో క్రీడలోకి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ తారలను ఓడించడంతో వార్తల్లో నిలిచాడు. అసలు విషయంలోకి వెళ్తే.. ధోని ఆదివారం ముంబైలో బాలీవుడ్ తారలతో కలిసి ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడారు. ఓ ఛారిటీ కోసం వీరంతా కలిసి మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచులో ధోని తన కొత్త హెయిర్ స్టైల్‌తో పాల్గొని ఆకట్టుకున్నాడు. ఆల్-స్టార్ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం బాద్రాలోని ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు చేరుకున్న ధోనిని చూసేందుకు జనం ఎగబడ్డారు. ధోని తన కొత్త హెయిర్ స్టైల్‌తో మ్యాచు ఆడుతున్న వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పంచుకున్నాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది.

ఛారిటీ మ్యాచ్ అయినా.. ధోని తన ఫుట్‌బాల్ నైపుణ్యాలు ఆటలో చూపించాడు. ఈ వీడియోలో బాలీవడు నటుడు అర్జున్ కపూర్ కూడా ఉన్నాడు. సరదాగా సాగిన ఈ మ్యాచులో ధోని చాలా ఉత్సాహంగా కనిపించాడు. అంతకు ముందు జరిగిన మ్యాచులో రణ్‌వీర్ సింగ్ కలిసి దిగిన ఓ ఫొటో కూడా నెట్టింట్లో రచ్చ చేసింది. అలాగే ముంబై‌కి చెందిన ఆల్‌స్టర్ ఫుట్‌బాల్ క్లబ్ నిర్వహించిన ట్రైనింగ్‌ సేషన్‌లో ధోనితోపాటు ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టె్న్ శ్రేయాస్ అయ్యర్ కూడా సందడి చేశాడు.

మరోవైపు ఐపీఎల్ 2021 తదుపరి భాగం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) లో జరగనున్నాయి. సీఎస్‌కే‌కు ధోని నాయకత్వం వహించనున్నాడు. కాగా ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో ధోని సేన సత్తా చాటింది. మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా సత్తా చాటిన చెన్నై సూపర్ కింగ్స్.. సెప్టెంబర్ 19 న యుఏఈ లో ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో తలపడనున్నారు.

Also Read: టెస్టులు, వన్డేల్లో పరుగులు, వికెట్లు సేమ్.. దిగ్గజాల రాకతో కెరీర్ ముగించిన టీమిండియా ఆటగాడు

16 ఏళ్ల కెరీర్‌… రికార్డులకు రారాజు.. ఆ భారత దిగ్గజ ఫుట్‌బాలర్ ఎవరో తెలుసా?