AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16 ఏళ్ల కెరీర్‌… రికార్డులకు రారాజు.. ఆ భారత దిగ్గజ ఫుట్‌బాలర్ ఎవరో తెలుసా?

Happy Birthday Suni Chhetri: భారత పురుషుల ఫుట్‌బాల్ టీం సారథి సునీల్ ఛెత్రి గురించి తెలియని వాళ్లు ఉండరు. అత్యధిక పుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడిన వ్యక్తిగానే కాదు.. అత్యధికంగా గోల్స్ చేసిన రికార్డును కూడా ఈ ప్లేయర్ సొంతం చేసుకున్నాడు.

16 ఏళ్ల కెరీర్‌... రికార్డులకు రారాజు.. ఆ భారత దిగ్గజ ఫుట్‌బాలర్ ఎవరో తెలుసా?
Happy Birthday Suni Chhetri
Venkata Chari
|

Updated on: Aug 03, 2021 | 11:01 AM

Share

Sunil chhetri: భారత పురుషుల ఫుట్‌బాల్ టీం సారథి సునీల్ ఛెత్రి గురించి తెలియని వాళ్లు ఉండరు. అత్యధిక పుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడిన వ్యక్తిగానే కాదు.. అత్యధికంగా గోల్స్ చేసిన రికార్డును కూడా ఈ ప్లేయర్ సొంతం చేసుకున్నాడు. నేడు అంటే ఆగస్టు 3న సునిల్ ఛెత్రి పుట్టిన రోజు. 1984లో సికింద్రాబాద్‌లో పుట్టిన ఛెత్రి.. చిన్నతనం నుంచే ఫుట్‌బాల్ ఆటపై మక్కువతో ఉండేవాడు. 16 ఏళ్లుగా ఈ ఆటలో రాణిస్తున్నాడు. 2005లో జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. భారత్‌ తరఫున ఇప్పటివరకు 117 మ్యాచ్‌లు ఆడాడు. అలాగే స్టార్ ఆటగాడు‌ రొనాల్డో (99) తర్వాత అత్యధిక అంతర్జాతీయ గోల్స్‌ చేసిన రికార్డు నెలకొల్పాడు. 2002లో మోహన్​బగన్​జట్టుతో తన ఫుట్‌బాల్ కెరీర్​ ఆరంభించాడు. ఈ జట్టులో 48 మ్యాచ్‌ల్లో 21 గోల్స్ సాధించాడు.

ఇంటర్ నేషనల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో అత్యధిక గోల్స్ కొట్టిన టాప్ 10 ప్లేయర్ల లిస్టులో సునిల్ ఛెత్రి ఒకరు. క్రిస్టియానో రొనాల్డో తర్వాత స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ ఆల్‌టైం గోల్స్‌లో లియోనల్ మెస్సీని దాటేసి టాప్ 10లోకి ప్రవేశించాడు. టీమ్ ఇండియా తరపున అత్యధిక అంతర్జాతీయ గోల్స్ (74) చేసిన ఏకైక క్రీడాకారుడు సునిల్ ఛెత్రి. 117 మ్యాచ్‌లలో అతను 74 గోల్స్ చేసి, రోనాల్డో (103) తర్వాత స్థానం పొందాడు. ఇండియా తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఫుట్‌బాలర్ కూడా సునిల్ ఛెత్రినే కావడం విశేషం. అంతకు ముందు మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా 107 అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

అలాగే అత్యధిక అంతర్జాతీయ హ్యాట్రిక్ గోల్స్(3 సార్లు) చేసిన వాడిగాను సునిల్ ఛెత్రి నిలిచాడు. మొదట 2008 ఏఎఫ్‌సీ చాలెంజ్ కప్‌లో తజకిస్తాన్‌పై తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఆ తరువాత వియత్నాంతో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో రెండవ హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. ఇక మూడవది 2018 ఇంటర్ కాంటినెంటర్ కప్‌లో చైనీస్ తైపీపై హ్యాట్రిక్ సాధించి రికార్డు నెలకొల్పాడు. ఏఐఎఫ్ఎఫ్ అందించే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 6 సార్లు అందుకుని, ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. 1992 నుంచి ఈ అవార్డు అందిస్తున్నారు. కాగా అంతకుముందు ఏఐ విజయన్ 3 సార్లు, జో పాల్ అచేరి 2 సార్లు, భైచుంగ్ భూటియా 2 సార్లు మాత్రమే ఈ అవార్డును అందుకున్నారు.

ఐ లీగ్‌లో మోహన్ బగాన్ , జేసీటీ ఎఫ్‌సీ, యునైటెడ్ స్పోర్ట్స్ క్లబ్, బెంగళూరు ఎఫ్‌సీ తరపున ఆడి 90 గోల్స్ కొట్టి, అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. అతడి తర్వాత 89 గోల్స్‌తో భూటియా నిలిచాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లోనూ 47 గోల్స్ సాధించి తొలిస్థానంలో నిలిచాడు. మాజీ చెన్నయిన్ స్ట్రైకర్ జేజే లాల్‌పెక్లూవా 24 గోల్స్‌తో రెండవ స్థానంలో నిలిచాడు. ఈ లీగ్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన తొలి భారత ప్లేయర్‌గా పలు రికార్డులు నెలకొల్పాడు. 2015లో ఈ హ్యాట్రిక్ సాధించాడు. అలాగే ఈ లీగ్‌లో రెండు హ్యాట్రిక్స్ సాధించి ఎవరికీ అందనతం ఎత్తులో నిలిచాడు. అలాగే ఏఎఫ్‌సీ ఛాంపియన్స్ లీగ్‌లో 31 మ్యాచ్‌లు ఆడిన సునిల్ ఛెత్రి 19 గోల్స్ సాధించాడు.

Also Read: Men in Blue: సెమీ ఫైనల్‌లో ఓడిన భారత్ మెన్ హాకీ టీమ్.. ఇంకా ఒలింపిక్స్‌లో పతకం పొందే ఛాన్స్

MS Dhoni: ఆ కంపెనీలో ధోనీ పెట్టుబడులు.. మూడేళ్ల వ్యూహంతో ముందుకు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..