AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెస్టులు, వన్డేల్లో పరుగులు, వికెట్లు సేమ్.. దిగ్గజాల రాకతో కెరీర్ ముగించిన టీమిండియా ఆటగాడు

భారత క్రికెట్ జట్టులోని ఈ దిగ్గజం ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేశాడు. కానీ, జట్టులోని మిగతా దిగ్గజ ఆటగాళ్లతో రాణించలేక తన ప్రస్థానాన్ని ముగించాల్సి వచ్చింది.

టెస్టులు, వన్డేల్లో పరుగులు, వికెట్లు సేమ్.. దిగ్గజాల రాకతో కెరీర్ ముగించిన టీమిండియా ఆటగాడు
Happy Birthday Gopal Sharma
Venkata Chari
|

Updated on: Aug 03, 2021 | 11:10 AM

Share

భారత క్రికెట్ జట్టులో ముంబై ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించే రోజులవి. అనంతరం ఢిల్లీ కూడా ఈ లిస్టులో చేరింది. అయితే, ప్రస్తుతం చాలా చిన్న పట్టణాలకు చెందిన క్రీడాకారుడలకు కూడా టీమిండియాలో చోటు సంపాదించే ఛాన్స్ దొరుకుతోంది. టీమిండియా ప్రారంభ దశలో ఉత్తర ప్రదేశ్ ఆటగాళ్లు చాలా తక్కువ మంది ఉండేవారు. నేడు చాలామంది అనుభవజ్ఞులైన క్రికెటర్లు ఈ రాష్ట్రం నుంచి బయటకు వస్తున్నారు. కానీ స్వతంత్ర భారతదేశంలో ఉత్తర ప్రదేశ్ నుంచి టీమిండియాలో ఆడిన మొదటి ఆటగాడిగా గోపాల్ శర్మ పేరుగాంచాడు. ఈరోజు అంటే ఆగస్టు 3 న అతని పుట్టినరోజు.

గోపాల్ శర్మ 3 ఆగస్టు 1960 న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించారు. ఆఫ్ స్పిన్నర్ గోపాల్ టీమిండియా కోసం ఐదు టెస్టులు, 11 వన్డేలు ఆడాడు. అనంతరం లక్ష్మణ్ శివరామకృష్ణన్, మనీందర్ సింగ్, అర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్, రవిశాస్త్రి, నరేంద్ర హిర్వానీ లాంటి ఆటగాళ్ల రాకతో గోపాల్ ప్రస్థానం మరుగునపడింది. ఈ దిగ్గజాలతో టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. టీమిండియా తరపున ఆడిన మొదటి క్రికెటర్ ఉత్తరప్రదేశ్ నుంచి గోపాల్ ఆజాద్ పేరుగాంచాడు. 1936 లో ఉత్తర ప్రదేశ్‌కు విజయనగరం మహారాజ్‌కుమార్ ప్రాతినిధ్యం వహించారు. అలాగే 1984–85 హోమ్ సిరీస్‌లో ఇంగ్లండ్‌పై తన తొలి టెస్టును ఆడాడు.

టీమిండియా తరపున గోపాల్ శర్మ 5 టెస్ట్ మ్యాచ్‌లలో పాల్గొన్నాడు. ఇందులో అతను 10 వికెట్లు తీశాడు. అలాగే 11 వన్డేలలో 10 వికెట్లు మాత్రమే సాధించాడు. ఐదు టెస్టులు, 11 వన్డేల్లో 11 పరుగుల చొప్పున సాధించాడు. అలాగే టెస్టులు, వన్డేలలో 10 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, వన్డేలో పరుగులతోపాటు వికెట్లు సమంగా చేసి అరుదైన వ్యక్తిగా గుర్తింపు సాధించాడు. ఇవి కాకుండా గోపాల్ శర్మ 104 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 22.41 సగటుతో 2309 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 353 వికెట్లు పడగొట్టాడు.

Also Read: 16 ఏళ్ల కెరీర్‌… రికార్డులకు రారాజు.. ఆ భారత దిగ్గజ ఫుట్‌బాలర్ ఎవరో తెలుసా?

MS Dhoni: ఆ కంపెనీలో ధోనీ పెట్టుబడులు.. మూడేళ్ల వ్యూహంతో ముందుకు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..