AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics: కూతురు శిక్షణ కోసం కారు, భూమిని అమ్మేసిన తండ్రి.. కట్‌చేస్తే.. పారిస్‌లో సత్తా చాటేందుకు సిద్ధం

Antim Panghal: 2004లో హర్యానాలోని ఒక రైతు కుటుంబంలో జన్మించింది. ఆమె ముగ్గురు సోదరీమణులలో చిన్నది. అందుకే ఆమెకు 'ఆఖ్రీ' అంటే చివరిదని పేరు పెట్టారు. ఈమె సోదరి సరిత జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణి. ఈమెకు కేవలం 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, తన సోదరి సరిత హిసార్‌లోని మహావీర్ స్టేడియంకు రెజ్లింగ్ ప్రోగ్రామ్ కోసం తీసుకువెళ్లింది. ఇక్కడ నుంచి అంతిమ్‌కు కుస్తీపై ఆసక్తి ఏర్పడింది.

Paris Olympics: కూతురు శిక్షణ కోసం కారు, భూమిని అమ్మేసిన తండ్రి.. కట్‌చేస్తే.. పారిస్‌లో సత్తా చాటేందుకు సిద్ధం
Antim Panghal
Venkata Chari
|

Updated on: Jul 15, 2024 | 9:10 PM

Share

Antim Panghal Success Story: క్రీడల మహా కుంభకోణం అంటే ఒలింపిక్స్ జులై 26 నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ప్రారంభం కానున్నాయి . ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 మందికి పైగా అథ్లెట్లు తమ దేశం జెండాను అగ్రస్థానంలో ఉంచడానికి ఒకరితో ఒకరు పోటీపడతారు. భారత్ నుంచి కూడా పలువురు క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఒలింపిక్స్‌కు చేరుకోవాలంటే అథ్లెట్లందరూ చాలా కష్టపడి శిక్షణ పొందాలి. ప్రతి అథ్లెట్‌కు తనదైన ప్రత్యేక కథ ఉంటుంది. ఒలింపిక్స్ వరకు ప్రయాణం చాలా కష్టతరమైన ఓ మహిళా రెజ్లర్ గురించి ఈ రోజు తెలుసుకుందాం..

హర్యానాకు చెందిన 20 ఏళ్ల రెజ్లర్ అంతిమ్ పంఘల్ కూడా పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తరపున రెజ్లింగ్‌లో పాల్గొంటుంది. మహిళల 53 కేజీల విభాగంలో ఆమె భారత్‌కు సవాల్‌గా కనిపించనుంది. పంఘల్ ఒలింపిక్స్‌కు చేరుకున్నప్పటికీ, ఆమె ప్రయాణం అంత సులభం కాదు.

2004లో హర్యానాలోని ఒక రైతు కుటుంబంలో జన్మించింది. ఆమె ముగ్గురు సోదరీమణులలో చిన్నది. అందుకే ఆమెకు ‘ఆఖ్రీ’ అంటే చివరిదని పేరు పెట్టారు. ఈమె సోదరి సరిత జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణి. ఈమెకు కేవలం 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, తన సోదరి సరిత హిసార్‌లోని మహావీర్ స్టేడియంకు రెజ్లింగ్ ప్రోగ్రామ్ కోసం తీసుకువెళ్లింది. ఇక్కడ నుంచి అంతిమ్‌కు కుస్తీపై ఆసక్తి ఏర్పడింది.

తండ్రి అప్పు చేసి కూతురిని రెజ్లర్‌గా మార్చాడు..

రెండో కూతురుని రెజ్లర్‌గా మార్చడంలో తండ్రి సహకారం అపారమైనది. అత్యుత్తమ శిక్షణ పొందేందుకు, ఆమె తండ్రి తన ఎకరంన్నర భూమి, కారు, ట్రాక్టర్‌ను కూడా విక్రయించాడు. దీంతో పాటు స్నేహితులు, బంధువుల నుంచి కూడా డబ్బులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమె కూడా పల్లెటూరి ఇల్లు వదిలి నగరంలో నివసించడం ప్రారంభించింది. కూతురు కూడా తన తండ్రి కలలను నెరవేర్చి ఇప్పుడు ఒలింపిక్స్‌లో పాల్గొనబోతోంది.

అంతిమ్ పంఘల్ సాధించిన విజయాలు..

ఇప్పటి వరకు పంఘల్ సాధించిన విజయాల గురించి చెప్పాలంటే.. తన పేరు మీద ఇప్పటివరకు చాలా పతకాలు సాధించింది. అవేంటో ఓసారి చూద్దాం..

అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌ – స్వర్ణం (2022, 2023)

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ – కాంస్యం (2023)

ఆసియా ఛాంపియన్‌షిప్‌ – కాంస్యం (2023)

ఆసియా క్రీడలు – కాంస్యం (2023)

రెజ్లింగ్‌లో U-20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయ మహిళగా నిలిచింది.

UWW రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ 2023

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..