నీరజ్‌చోప్రా పసిడి తెచ్చిన ఆశలు.. అథ్లెటిక్స్ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.. బల్లెం వీరుడి శిక్షణపై ఎంత ఖర్చు చేసిందంటే?

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో క్రీడలు ప్రారంభం కావడానికి దాదాపు 11 రోజుల సమయం ఉంది. ఈ నేపధ్యంలో పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 16 విభిన్న క్రీడల సన్నాహాల్లో నిమగ్నమైందని ఒక నివేదిక వెల్లడించింది. గత మూడేళ్లలో SAI ద్వారా దాదాపు రూ. 470 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో మూడేళ్ల క్రితం వరకు కలలా ఉన్న అథ్లెటిక్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వారి శిక్షణ కోసం డబ్బులు వెచ్చించారు.

నీరజ్‌చోప్రా పసిడి తెచ్చిన ఆశలు.. అథ్లెటిక్స్ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.. బల్లెం వీరుడి శిక్షణపై ఎంత ఖర్చు చేసిందంటే?
Paris Olympics 2024
Follow us

|

Updated on: Jul 16, 2024 | 11:49 AM

క్రీడాభిమానులకు కనులు విందు చేసే ఒలింపిక్ క్రీడలు త్వరలో ప్రారంభంకానున్నాయి. పారిస్ వేదికగా జరగనున్న ఒలింపిక్ క్రీడలు ఈ నెల (జూలై) 26 నుంచి ప్రారంభం కానున్నాయి. మూడేళ్ళ తర్వాత జరగనున్న ఒలింపిక్స్ లో పునరాగమనం చేయడానికి భారత అథ్లెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా అభిమానులు ఒలింపిక్స్ కోసం నిరీక్షిస్తున్నారు. 2021లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఇప్పటి వరకు దేశం అత్యధికంగా 7 పసిడి పతకాలను గెలుచుకుంది. పారిస్‌లో ఈ బంగారు పతకాల సంఖ్య పెరగాలనే ఆశ, కోరిక ప్రతి భాతీయుడిలో ఉంది. ఈ మేరకు భారతీయ క్రీడాకారులు ప్రపంచ స్థాయి అథ్లెటిక్స్‌లో సమానంగా శిక్షణ తీసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ లో పతకాల సంఖ్యపై ఆశ పెరిగింది. టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా సాధించిన గోల్డెన్ విజయం..ఈ దిశలో శిక్షణ ఇప్పించడానికి పెట్టుబడి పెట్టడానికి భారతదేశంలోని క్రీడా ఆధికారులను ప్రేరేపించింది. అందుకే గత 3 సంవత్సరాలలో అథ్లెటిక్స్ కోసం సుమారు రూ. 100 కోట్లు ఖర్చు చేశారు.

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో క్రీడలు ప్రారంభం కావడానికి దాదాపు 11 రోజుల సమయం ఉంది. ఈ నేపధ్యంలో పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 16 విభిన్న క్రీడల సన్నాహాల్లో నిమగ్నమైందని ఒక నివేదిక వెల్లడించింది. గత మూడేళ్లలో SAI ద్వారా దాదాపు రూ. 470 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో మూడేళ్ల క్రితం వరకు కలలా ఉన్న అథ్లెటిక్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వారి శిక్షణ కోసం డబ్బులు వెచ్చించారు.

అథ్లెటిక్స్‌కు ఎక్కువ డబ్బు ఖర్చు

SAI మిషన్ ‘ఒలింపిక్ సెల్’ గత 3 సంవత్సరాలలో అథ్లెటిక్స్ కోసం గరిష్టంగా 96.08 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని PTI నివేదిక వెల్లడించింది. ఈ ఖర్చు భారతదేశం, విదేశాలలో ఆటగాళ్లకు శిక్షణ ఇప్పించడంతో పాటు క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు కోచ్‌ల నియామకం, క్రీడా పరికరాలను అందించడం వరకు ప్రతిదానికీ ఖర్చు చేసినట్లు వెల్లడించింది. గత ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈసారి అథ్లెటిక్స్‌లో భారత్‌ ప్రాతినిధ్యం అత్యధికంగా ఉండనున్నట్లు వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా నేతృత్వంలో మొత్తం 28 మంది క్రీడాకారులు వివిధ అథ్లెటిక్స్ ఈవెంట్లలో పాల్గొంటారని ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

అథ్లెటిక్స్‌ మెరుగైన ప్రదర్శన చేయడం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయడం ఒక చారిత్రాత్మకమైన నిర్మాణం అని అంటున్నారు. ఇలా ఖర్చు చేయడనికి ముఖ్య కారణం టోక్యోలో అథ్లెటిక్స్‌లో తొలి పసిడి పతకం అందించిన నీరజ్ చోప్రా ప్రభావం నేరుగా పడిందని భావిస్తున్నారు. ఇక అథ్లెటిక్స్ కోసం ఖర్చు చేసిన రూ.96 కోట్లలో నీరజ్ చోప్రా శిక్షణ కోసమే ప్రభుత్వం రూ.5.72 కోట్లు వెచ్చించింది.

బ్యాడ్మింటన్, హాకీకి కూడా ప్రభుత్వం మద్దతు

అథ్లెటిక్స్ క్రీడాకారులకు మాత్రమే కాదు.. ఇతర పతకాలు సాధించిన క్రీడలకు కూడా ప్రభుత్వం నుంచి మంచి మద్దతు లభించింది. ఇందులో రూ.72.02 కోట్లతో బ్యాడ్మింటన్ రెండో స్థానంలో, రూ.60.93 కోట్లతో బాక్సింగ్ మూడో స్థానంలో, షూటింగ్ నాలుగో స్థానంలో (60.42 కోట్లు) నిలిచాయి. కాగా గత ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత కాంస్య పతకం సాధించిన హాకీ జట్టు కోసం రూ.41.29 కోట్లు వెచ్చించారు. అంతేకాదు టేబుల్ టెన్నిస్, జూడో, గోల్ఫ్, సెయిలింగ్, టెన్నిస్, స్విమ్మింగ్ వంటి క్రీడాకారుల శిక్షణ కోసం ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల సాయం లభించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..