AP News: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన వచ్చేసిందోచ్
ఏపీలో మహిళలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్ అందించింది. ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ముహూర్తం ఖరారు చేసింది. ఆగష్టు 15 నుంచి ఏపీలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పధకాన్ని.. ఆ వివరాలు ఇలా..
ఏపీలో మహిళలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్ అందించింది. ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ముహూర్తం ఖరారు చేసింది. ఆగష్టు 15 నుంచి ఏపీలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పధకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఇది చదవండి: మొబైల్ పట్టుకునే స్టైల్ బట్టి.. మీరు ఎలాంటివారో చెప్పొచ్చు.. ఎలాగో తెల్సా
మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ముందుగా పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుక విధానం, తల్లికి వందనం లాంటి హామీలను ప్రారంభించిన ప్రభుత్వం.. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనుంది.
ఇది చదవండి: చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా.. గుండె ఆగినంత పనైంది
ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ అధికారులు.. కర్ణాటక, తెలంగాణలో ఈ పధకం అమలవుతున్న తీరుపై నివేదికలు కోరింది. రోజుకు ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు.? ప్రభుత్వంపై ఎంతమేరకు భారం పడుతుంది.? అమలులో ఎలాంటి సమస్యలు వస్తాయి.? అనే అంశాలపై పూర్తిస్థాయిలో అధికారులు నివేదికలను సిద్దం చేశారు.
ఇది చదవండి: ఆ స్కూలంతా కుప్పలు తెప్పలుగా పాములే పాములు.. ధైర్యమున్నోడు కూడా దడుసుకోవాల్సిందే
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..#AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani pic.twitter.com/zJNh0C61aN
— Satya Prasad Anagani (@SatyaAnagani) July 16, 2024
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..