పులసల సీజన్ షురూ.. మొదటి పులసను పట్టేశారుగా
దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు దండిగా కురుస్తున్నాయి. ఎర్రని నీటితో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక ఎర్రనీరు వచ్చిందంటే..పులసల సీజన్ వచ్చేసినట్టే.. వచ్చేసినట్టే కాదు.. వచ్చేసింది..అప్పుడే మొదటి పులసను పట్టేశారు కూడా. గోదావరి జిల్లాల ప్రజలు ఈ పులసల కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. పుస్తెలు అమ్మి అయినా పులసను తినాల్సిందే అంటారు. ఆషాఢం కొత్త అల్లుళ్లకు, బంధువులకు పులసలతో విందు చేస్తారు.
దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు దండిగా కురుస్తున్నాయి. ఎర్రని నీటితో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక ఎర్రనీరు వచ్చిందంటే..పులసల సీజన్ వచ్చేసినట్టే.. వచ్చేసినట్టే కాదు.. వచ్చేసింది..అప్పుడే మొదటి పులసను పట్టేశారు కూడా. గోదావరి జిల్లాల ప్రజలు ఈ పులసల కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. పుస్తెలు అమ్మి అయినా పులసను తినాల్సిందే అంటారు. ఆషాఢం కొత్త అల్లుళ్లకు, బంధువులకు పులసలతో విందు చేస్తారు. ఈక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అప్పనరాముని లంక గోదావరిలో మత్స్యకారుల వలలో పులస చేప చిక్కింది. పదిరోజులుగా గోదావరిలో నీరు రంగు మారడంతో మత్స్యకారులు వలలకు పనిచెప్పారు. ఈ సీజన్‌లో మొట్టమొదటి పులసను చూసి ఆనందంతో పొంగిపోయారు. ఎందుకంటే పులసకు ఉండే డిమాండ్ అలాంటిది మరి. వలలో పులస పడిందంటే మత్స్కకారుల పంట పండినట్టే. అనుకున్నట్టుగానే ఆ పులస భారీ ధరకే అమ్ముడుపోయింది. కేజీన్నర బరువున్న ఆ పులసను అప్పనరామునిలంకకు చెందిన మాజీ సర్పంచ్ బర్రె శ్రీను రూ.24,000లకు కొనుగోలుచేశారు. ఈ సీజన్‌లో మొదటి పులసను దక్కించుకున్న శ్రీను పులసకూరను బంధువులందరితో షేర్ చేసుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మేడపై ఆవు ప్రత్యక్షం.. ఆశ్చర్యంలో స్థానికులు
ఎయిర్‌పోర్ట్‌లో కుప్పలుతెప్పలుగా ఈల్ చేపలు !! చూసి షాక్ తిన్న ప్రయాణికులు
కూతురే కాదు తల్లి కూడా అదే దందాలో.. వీడియో వైరల్
పిచ్చి గీతల ప్రిస్క్రిప్షన్లు.. ఎంత పని చేస్తున్నాయో తెలుసా ??
TOP 9 ET News: హిట్టైంది కాబట్టి ఓకే.. లేకుంటే ప్రొడ్యూసర్ కు.. | ఇప్పుడున్న వారిలో NTR నెం.1
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!
దాల్ మఖనీకి విస్కీ తాళింపు.. వైరల్ అవుతున్న ప్రత్యేక వంటకం
గుడ్ న్యూస్.. ఇక పురుషులకూ ఫ్రీ బస్ సదుపాయం
ఆ ఆలయంలో అంతుచిక్కని దైవ రహస్యం..
టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం!
తెల్లవారితే పెళ్లి.. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చేసరికి..!

