Controversy: పాక్‌పై గెలుపు.. సంబరాల్లో యూవీ, రైనా, భజ్జీ డ్యాన్స్‌లు.. కట్‌చేస్తే.. వివాదస్పదమైన స్టెప్పులు..

Viral Video Create New Controversy: టీమిండియా మాజీ ఆటగాళ్లు సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లకు సంబంధించిన కొత్త వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి కొత్త వివాదానికి దారితీసింది. వాస్తవానికి, భారత ఛాంపియన్స్ జట్టులో భాగమైన యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ మొదటి ఎడిషన్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'తౌబా తౌబా' పాటకు డ్రెస్సింగ్ రూమ్‌లోకి చిందులేశారు.

Controversy: పాక్‌పై గెలుపు.. సంబరాల్లో యూవీ, రైనా, భజ్జీ డ్యాన్స్‌లు.. కట్‌చేస్తే.. వివాదస్పదమైన స్టెప్పులు..
Yuvi Bajji Raina
Follow us

|

Updated on: Jul 15, 2024 | 9:27 PM

Viral Video Create New Controversy: టీమిండియా మాజీ ఆటగాళ్లు సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లకు సంబంధించిన కొత్త వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి కొత్త వివాదానికి దారితీసింది. వాస్తవానికి, భారత ఛాంపియన్స్ జట్టులో భాగమైన యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ మొదటి ఎడిషన్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘తౌబా తౌబా’ పాటకు డ్రెస్సింగ్ రూమ్‌లోకి చిందులేశారు. అయితే ఈ ముగ్గురు చేసిన డిఫరెంట్ డ్యాన్స్ ఇప్పుడు పారా అథ్లెట్ల ఆగ్రహానికి కారణమైంది. అలాగే, సోషల్ మీడియాలో దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సిగ్గుచేటు, ఈ ముగ్గురు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

తౌబా తౌబా పాటకు హుక్ స్టెప్..

బర్మింగ్‌హామ్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్స్‌లో, భారత ఛాంపియన్‌లు పాకిస్థాన్ ఛాంపియన్‌లను ఓడించి ప్రారంభ ఎడిషన్‌ను గెలుచుకున్నారు. టైటిల్ గెలిచిన తర్వాత, భారత ఛాంపియన్లు నటుడు విక్కీ కౌశల్ పాడిన ‘తౌబా తౌబా’ పాటకు స్టెప్స్ వేయడానికి ప్రయత్నించారు.

అయితే ఈ వీడియో వైరల్ కావడంతో భారత పారా అథ్లెట్లు దీనిపై మండిపడుతున్నారు. పారా-స్విమ్మర్ షామ్స్ ఆలం, బ్యాడ్మింటన్ స్టార్, అర్జున అవార్డు గ్రహీత మాన్సీ జోషి వికలాంగ సమాజాన్ని ఇబ్బంది పెట్టారంటూ భారత మాజీ క్రికెటర్‌పై మండిపడ్డారు.

ఎగతాళి చేయడం లాంటిదే..

Raina Dance

ఈ మేరకు వీరు.. హర్భజన్, యువరాజ్, ఇతర గౌరవనీయమైన జట్టు సభ్యులు అంటూ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. ఆట తర్వాత శరీరం అలసిపోయిందని మనకు అర్థమైంది. కానీ, మీరు సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన తీరు వికలాంగుల సంఘాన్ని అపహాస్యం చేసేలా ఉంది. అందువల్ల ఇది ఆమోదయోగ్యం కాదు. నా వ్యాఖ్యలు మిమ్మల్ని లేదా మీ బృంద సభ్యులను ప్రభావితం చేయవని నాకు తెలుసు. అయితే మీకు సన్నిహితంగా ఉండే వ్యక్తికి ఇలాంటివి జరిగితే ఊహించుకోండి. మీరు మీ బాధను ఇలా వ్యక్తం చేస్తారా? మేమంతా మిమ్మల్ని గౌరవిస్తాం. మీరు వ్యక్తులను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాము అంటూ పోస్ట్ చేశారు.

అవమానకరమైన సంజ్ఞలు..

Yuvraj Dance Video

పారాలింపిక్స్ ఇండియా కూడా ఈ పోస్ట్‌తో కలత చెందింది. ఆటగాళ్ల ప్రవర్తన ‘సిగ్గుచేటు’గా అభివర్ణించింది. క్రికెటర్లుగా, స్టార్ సెలబ్రిటీలు సానుకూల భావోద్వేగాలను సృష్టించే బాధ్యత వహిస్తారు. కానీ, వికలాంగులను అనుకరించడం, అవమానకరమైన హావభావాలు ఉపయోగించడం, వారి శారీరక వైకల్యాన్ని ఎగతాళి చేయడమే కాదు, ఇదో రకమైన వివక్ష. ఈ చర్యలకు క్షమాపణలు చెప్పాల్సిన సమయం వచ్చింది అంటూ పోస్ట్ చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..