IND vs PAK: ఆ రుజువు ఐసీసీకి ఇవ్వాల్సిందే: బీసీసీఐని ఇరకాటంలో పడేసిన పీసీబీ.. అదేంటంటే?
ICC Champions Trophy 2025: తదుపరి ఛాంపియన్స్ ట్రోఫీని వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో అంటే 2025లో నిర్వహించాలని నిర్ణయించారు. కాబట్టి టీమిండియాను పాకిస్థాన్‌కు పంపడానికి భారత ప్రభుత్వం నిరాకరిస్తే, దీనికి సంబంధించి మాకు రాతపూర్వక రుజువు కావాలి, ఈ రుజువును BCCI, ICCకి సమర్పించాలని పాక్ కోరిందంట. ఐదు నుంచి ఆరు నెలల సమయం ఉన్న టోర్నీ ప్రారంభానికి ముందే ఈ రాతపూర్వక రుజువు ఇవ్వాలని పీసీబీ పట్టుబట్టినట్లు సమాచారం.

ICC Champions Trophy: 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీకి సమర్పించింది. ఈ ముసాయిదా ప్రకారం లాహోర్‌లో భారత్ మ్యాచ్‌లు జరుగుతాయి. కానీ ANI నివేదిక ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లకపోతే లేదా భారత జట్టును పంపడానికి భారత ప్రభుత్వం అంగీకరించకపోతే రాతపూర్వక రుజువు ఇవ్వాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐని కోరినట్లు తెలిపాయి.
రాతపూర్వక రుజువు అవసరం..
తదుపరి ఛాంపియన్స్ ట్రోఫీని వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో అంటే 2025లో నిర్వహించాలని నిర్ణయించారు. కాబట్టి టీమిండియాను పాకిస్థాన్‌కు పంపడానికి భారత ప్రభుత్వం నిరాకరిస్తే, దీనికి సంబంధించి మాకు రాతపూర్వక రుజువు కావాలి, ఈ రుజువును BCCI, ICCకి సమర్పించాలని పాక్ కోరిందంట. ఐదు నుంచి ఆరు నెలల సమయం ఉన్న టోర్నీ ప్రారంభానికి ముందే ఈ రాతపూర్వక రుజువు ఇవ్వాలని పీసీబీ పట్టుబట్టినట్లు సమాచారం.
తప్పుడు పుకార్లు..
టీమిండియాను పాకిస్థాన్‌కు పంపే విషయమై భారత ప్రభుత్వం కానీ, బీసీసీఐ కానీ ఎలాంటి చర్చలు జరపలేదని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. అయితే టీమ్ ఇండియా పాక్ వెళ్లడం అనుమానమే అని అంటున్నారు. భారత్ పాకిస్థాన్‌కు వెళ్లే బదులు హైబ్రిడ్ ఫార్మాట్‌లో టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ కోరినట్లు సమాచారం.
హైబ్రిడ్ మోడల్..
భారత్ మ్యాచ్‌లను యూఏఈ లేదా శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ, ఐసీసీని కోరినట్లు సమాచారం. 2023లో జరిగిన ఆసియా కప్ కూడా ఇదే తరహాలో జరిగింది. సమాచారం ప్రకారం, ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలన్నది బీసీసీఐ వాదన.
మేం పంపం..
బీసీసీఐ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు సిద్ధమైన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే 2026 టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకుంటానని పాకిస్తాన్ బెదిరించినట్లు సమాచారం. జియో న్యూస్ ప్రకారం, పీసీబీ మొత్తం టోర్నమెంట్‌ను పాకిస్తాన్‌లో నిర్వహించడం పట్ల మొండిగా ఉందంట. జులై 19, 22 మధ్య కొలంబోలో జరిగే ఐసీసీ వార్షిక సమావేశంలో ఏదైనా హైబ్రిడ్ ఫార్మాట్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని పీసీబీ కోరుకుంటుందని తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




