IND vs SL: లంక పర్యటనకు ఇద్దరు కెప్టెన్లు.. గంభీర్ సెలెక్ట్ చేసింది ఎవరినంటే?

Team India: ఇప్పుడు రోహిత్ శర్మ టీ 20 ఫార్మాట్ నుంచి నిష్క్రమించడంతో అతని స్థానంలో పాండ్యాను తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది అంత సులభం కాదని మరికొంతమంది చెబుతున్నారు. ఈ రేసులో పాండ్య కచ్చితంగా ముందంజలో ఉంటాడు. కానీ, ప్రస్తుతం ఈ రేసులో అతనే గెలవబోతున్నాడని చెప్పడం సరికాదంటూ వాదిస్తున్నారు. మీడియా కథనాల మేరకు శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు సెలక్టర్లు త్వరలో జట్టును ప్రకటించే అవకాశం ఉంది.

IND vs SL: లంక పర్యటనకు ఇద్దరు కెప్టెన్లు.. గంభీర్ సెలెక్ట్ చేసింది ఎవరినంటే?
Team India
Follow us

|

Updated on: Jul 15, 2024 | 8:46 PM

IND vs SL: టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత జింబాబ్వే టూర్‌ను కూడా గెలుచుకున్న టీమ్ ఇండియా ఇప్పుడు శ్రీలంక టూర్‌లో టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది ఈ సిరీస్‌ ముందున్న అతిపెద్ద ప్రశ్న. భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారు? చాలా మంది హార్దిక్ పాండ్యా మాత్రమే అంటూ సమాధానం చెబుతున్నారు. టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అతను అద్భుత ప్రదర్శనతో జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా మార్చాడు. ఇప్పుడు రోహిత్ శర్మ టీ 20 ఫార్మాట్ నుంచి నిష్క్రమించడంతో అతని స్థానంలో పాండ్యాను తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది అంత సులభం కాదని మరికొంతమంది చెబుతున్నారు. ఈ రేసులో పాండ్య కచ్చితంగా ముందంజలో ఉంటాడు. కానీ, ప్రస్తుతం ఈ రేసులో అతనే గెలవబోతున్నాడని చెప్పడం సరికాదంటూ వాదిస్తున్నారు. మీడియా కథనాల మేరకు శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు సెలక్టర్లు త్వరలో జట్టును ప్రకటించే అవకాశం ఉంది.

హార్దిక్ కెప్టెన్ అవుతాడా?

కెప్టెన్సీ రేసులో హార్దిక్ పాండ్యా ముందున్నప్పటికీ, దాని నిర్ణయాన్ని కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కే వదిలేశారని తెలుస్తోంది. మీడియా కథనాలను విశ్వసిస్తే, టీ20 ప్రపంచకప్ 2026ని దృష్టిలో ఉంచుకుని టీమ్ ఇండియా నిర్ణయం తీసుకోబడుతుందని భావిస్తున్నారు. ఈ విషయాలన్నింటిపై త్వరలో గంభీర్, చీఫ్ సెలక్టర్ల మధ్య చర్చలు జరుగుతాయని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

శ్రేయాస్ అయ్యర్ వన్డే కెప్టెన్ అవుతాడా?

శ్రీలంక టూర్‌లో టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్ కూడా జరగాల్సి ఉంది. ఈ సిరీస్‌లో రోహిత్ ఆడకపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్‌గా ఎవరుంటారనేది ప్రశ్నగా మారింది. కొద్ది రోజుల క్రితం, కేఎల్ రాహుల్ పేరు వన్డే కెప్టెన్సీకి వచ్చింది. అయితే బీసీసీఐ వర్గాల ప్రకారం, ఇంకా ఏమీ నిర్ణయించలేదు. ఇన్‌సైడ్ స్పోర్ట్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ, ‘ఇంకా ఏమీ నిర్ణయించలేదు. టీమ్ ఇండియాకు చాలా కెప్టెన్సీ ఎంపికలు ఉండటం చాలా అదృష్టం. ఒక్క జింబాబ్వే సిరీస్‌లోనే ముగ్గురు ఐపీఎల్‌ కెప్టెన్లు ఉన్నారు. శ్రీలంక టూర్‌లో కూడా ఇలాంటి పేర్లే ఉంటాయి. రోహిత్ లేకపోవడంతో సరైన కెప్టెన్‌ను వెతుక్కోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

శ్రేయాస్ అయ్యర్ కూడా వన్డే జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. గౌతమ్ గంభీర్ మెంటార్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ను అయ్యర్ IPLలో ఛాంపియన్‌గా మార్చాడు. ఇప్పుడు గంభీర్ జట్టుకు ప్రధాన కోచ్ కాబట్టి అయ్యర్‌ను వన్డే కెప్టెన్‌గా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది సారాంశం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఖాళీ స్టేడియంలో పాక్, బంగ్లా మ్యాచ్.. షాకిచ్చిన పీసీబీ
ఖాళీ స్టేడియంలో పాక్, బంగ్లా మ్యాచ్.. షాకిచ్చిన పీసీబీ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్, లావణ్య..
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్, లావణ్య..
బిర్యానీ ఆకుతో షుగర్ వ్యాధి కంట్రోల్.. ఎలా వాడాలంటే..
బిర్యానీ ఆకుతో షుగర్ వ్యాధి కంట్రోల్.. ఎలా వాడాలంటే..
కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై గ్యాంగ్‌ రేప్‌.? విచారణలో విస్తుపోయే
కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై గ్యాంగ్‌ రేప్‌.? విచారణలో విస్తుపోయే
ప్రధాని మోదీతో ఫాక్స్‌కాన్ గ్రూప్ చైర్మన్ కీలక భేటి..
ప్రధాని మోదీతో ఫాక్స్‌కాన్ గ్రూప్ చైర్మన్ కీలక భేటి..
ఒక్క రూపాయి కట్టకుండానే రూ.7 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ ..
ఒక్క రూపాయి కట్టకుండానే రూ.7 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ ..
తెలంగాణ హెడ్ కానిస్టేబుల్‌‌ యాదయ్యకు అరుదైన గౌరవం..
తెలంగాణ హెడ్ కానిస్టేబుల్‌‌ యాదయ్యకు అరుదైన గౌరవం..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. చిల్లర సమస్యకు చెక్‌..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. చిల్లర సమస్యకు చెక్‌..
వేపాకు నీటితో స్నానం చేస్తే ఈ సమస్యలన్నీ దూరం.. అద్భుతమైన మెరిసే
వేపాకు నీటితో స్నానం చేస్తే ఈ సమస్యలన్నీ దూరం.. అద్భుతమైన మెరిసే
ఆ ఐపీఎస్‌ ఆఫీసర్లపై ఏపీ డీజీపీ ఫుల్ సీరియస్.. మెమోలు జారీ..
ఆ ఐపీఎస్‌ ఆఫీసర్లపై ఏపీ డీజీపీ ఫుల్ సీరియస్.. మెమోలు జారీ..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..