- Telugu News Photo Gallery Cricket photos R ashwin opening in tnpl hit 45 runs in just 20 balls but become villain with bowling in Chepauk Super Gillies vs Dindigul Dragons match
ఓపెనర్‌గా వచ్చి 225 స్ట్రైక్ రేట్‌తో హీరో అయ్యాడు.. కట్‌చేస్తే.. 1.5 ఓవర్లతో విలన్‌గా మారిన టీమిండియా ప్లేయర్..
Chepauk Super Gillies vs Dindigul Dragons: వర్షంతో ప్రభావితమైన ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు తలో 7 ఓవర్లు ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లోని మొదటి బంతికే డ్రాగన్స్ తొలి వికెట్ పడింది. అశ్విన్‌తో కలిసి ఓపెనింగ్ బ్యాటర్ శివమ్ సింగ్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. తొలి ఓవర్ చివరి బంతికి జట్టు రెండో వికెట్ కూడా పడగా, తర్వాతి ఓవర్ నాలుగో బంతికి మూడో వికెట్ కూడా పడింది.
Updated on: Jul 15, 2024 | 8:15 PM

R Ashwin: హీరో అవ్వాలని అనుకున్నా జీరోగానే మిగిలిపోయాడు. అవును, TNPLలో అలాంటిదే జరిగింది. టీమిండియా ప్లేయర్ అశ్విన్ తన తుఫాను ఇన్నింగ్స్ బ్యాటింగ్‌లో అదరగొట్టినా.. ఆ తర్వాత చెత్త బౌలింగ్‌తో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. కెప్టెన్‌గా హీరోగా అవకాశం వచ్చిన అశ్విన్ దానిని వృధా చేసుకున్నాడు. ఇది ఎలా జరిగిందో తెలియాలంటే మ్యాచ్ వివరాలు తెలియాల్సి ఉంది.

TNPL అంటే తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో జులై 14న దిండిగల్ డ్రాగన్స్ వర్సెస్ చెపాక్ సూపర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో దిండిగల్‌కు అశ్విన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ జట్టు కూడా మొదట బ్యాటింగ్ చేసింది. ఇందులో కెప్టెన్ అశ్విన్ ఓపెనర్‌గా వచ్చాడు.

వర్షంతో ప్రభావితమైన ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు తలో 7 ఓవర్లు ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లోని మొదటి బంతికే డ్రాగన్స్ తొలి వికెట్ పడింది. అశ్విన్‌తో కలిసి ఓపెనింగ్ బ్యాటర్ శివమ్ సింగ్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. తొలి ఓవర్ చివరి బంతికి జట్టు రెండో వికెట్ కూడా పడగా, తర్వాతి ఓవర్ నాలుగో బంతికి మూడో వికెట్ కూడా పడింది. అంటే 1 పరుగుకే 3 వికెట్లు పడిపోయాయి. పరిస్థితి విషమించడంతో అశ్విన్ దాడి వ్యూహాన్ని అనుసరించాడు. అతను ఒక ఎండ్ నుంచి చెపాక్ సూపర్ బౌలర్లపై దాడి చేశాడు.

అశ్విన్ గేమ్ ప్లాన్ మార్చాడు. దీంతో ఆ జట్టు స్కోర్ బోర్డు పెంచడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంతలో మరో 3 వికెట్లు పడిపోయినా అది అశ్విన్ మూడ్‌పై ప్రభావం చూపలేదు. ప్రత్యర్థి బౌలర్లపై దాడులు చేస్తూనే ఉన్నాడు. ఫలితంగా ఓపెనింగ్‌కు వచ్చిన అశ్విన్ చివరి వరకు నాటౌట్‌గా నిలిచి కేవలం 20 బంతుల్లోనే 225 స్ట్రైక్ రేట్‌తో 45 పరుగులు చేశాడు. అతని తుఫాన్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

అశ్విన్ వేగవంతమైన ఇన్నింగ్స్‌తో దిండిగల్ డ్రాగన్స్ 7 ఓవర్లలో 65 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అయితే, ఈ లక్ష్యాన్ని చెపాక్ సూపర్ కేవలం 4.5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి సాధించింది. కేవలం 5 బంతుల్లో 16 పరుగులిచ్చి 13 బంతుల్లో విజయం సాధించడంలో దిండిగల్ కెప్టెన్ అశ్విన్ గొప్ప సహకారం అందించాడు. అంటే 225 స్ట్రైక్ రేట్‌తో బ్యాట్‌తో పరుగులు చేసిన అశ్విన్ కేవలం 5 బంతుల్లోనే 300 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో, అశ్విన్ 1.5 ఓవర్లలో 12.54 ఎకానమీ వద్ద 23 పరుగులు ఇచ్చాడు. ఎటువంటి వికెట్ తీయలేకపోయాడు.




