నిద్రమత్తులో రైల్లోంచి జారిపడ్డ భార్య !! కాపాడబోయిన భర్త.. చివరికి ??
రైలు నుంచి జారిపడ్డ తన భార్యను కాపాడబోయిన ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో సయ్యద్ ఆసిఫ్, ఆయన భార్య ఆసియాబాను ఫుట్‌బోర్డుపై కూర్చుని ప్రయాణించారు. రైలు ఎర్రగుంట్ల మీదుగా వెళుతున్న సమయంలో నిద్రమత్తులో ఉన్న ఆసియాబాను రైలు నుంచి జారి కిందపడింది.
రైలు నుంచి జారిపడ్డ తన భార్యను కాపాడబోయిన ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో సయ్యద్ ఆసిఫ్, ఆయన భార్య ఆసియాబాను ఫుట్‌బోర్డుపై కూర్చుని ప్రయాణించారు. రైలు ఎర్రగుంట్ల మీదుగా వెళుతున్న సమయంలో నిద్రమత్తులో ఉన్న ఆసియాబాను రైలు నుంచి జారి కిందపడింది. ఇది గమనించిన వెంటనే భార్యను కాపాడేందుకు రైలు నుంచి దూకిన ఆసిఫ్ మృతిచెందాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన మహిళను చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులను కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా చిరూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. నాలుగు నెలల క్రితమే ఆ జంట ప్రేమ వివాహం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గుంటూరు నుంచి బెంగళూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళలు ప్రతిరోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా ??
10 ఉద్యోగాలకు పోటెత్తిన 1800 ఆశావాహులు
నిద్రపోదామని మంచంపై వాలిన రైతు.. ఎదురుగా సెల్ఫ్‌లో ఉన్నది చూసి షాక్
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!

