నిద్రపోదామని మంచంపై వాలిన రైతు.. ఎదురుగా సెల్ఫ్‌లో ఉన్నది చూసి షాక్
వర్షాలు జోరందుకున్నాయి. వాగులు, వకంలు పొంగి ప్రవహిస్తున్నాయి. అటవీ ప్రాంతాలు సైతం నీటమునుగుతుండటంతో కొన్ని ప్రాణులు ఆవాసాలు కోల్పోతున్నాయి. దీంతో వనాల్లో ఉండాల్సిన పాములు, ఇతర సరీశృపాలు జనావాసాల్లోకి చేరుతున్నాయి. ఆహారం, ఆవాసం కోసం ఇళ్ళలోకి చొరబడుతూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా దువ్వాడలోని ఓ ఇంట్లోని కిచెన్‌లో నాగుపాము చేరి కుటుంబం మొత్తాన్ని పరుగులు పెట్టించింది.
వర్షాలు జోరందుకున్నాయి. వాగులు, వకంలు పొంగి ప్రవహిస్తున్నాయి. అటవీ ప్రాంతాలు సైతం నీటమునుగుతుండటంతో కొన్ని ప్రాణులు ఆవాసాలు కోల్పోతున్నాయి. దీంతో వనాల్లో ఉండాల్సిన పాములు, ఇతర సరీశృపాలు జనావాసాల్లోకి చేరుతున్నాయి. ఆహారం, ఆవాసం కోసం ఇళ్ళలోకి చొరబడుతూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా దువ్వాడలోని ఓ ఇంట్లోని కిచెన్‌లో నాగుపాము చేరి కుటుంబం మొత్తాన్ని పరుగులు పెట్టించింది. తాజాగా తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. వరంగల్ జిల్లా కాసింపల్లి గ్రామం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మయ్య అనే రైతు ఇంట్లోకి అర్ధరాత్రి నాగుపాము చొరబడింది. ఉదయం అంతా పొలం పనులు చేసుకొని రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించిన లక్ష్మయ్యకు ఎదురుగా సెల్ఫ్‌లో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. ఏంటా అని చూసేసరికి ఓ పెద్ద నాగుపాము కనిపించింది. దెబ్బకు షాకైన లక్ష్మయ్య భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసాడు. లక్ష్మయ్య అరుపులతో ఇంట్లోని వారంతా అలర్టయి బయటకు వచ్చారు. సెల్ప్‌లో నక్కిన పామును చూసి భయపడిన వారు వెంటనే స్థౄనిక స్నేక్ క్యాచర్ రహీంకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న రహీం జాగ్రత్తగా పామును బంధించి అటవీప్రాంతంలో వదిలి పెట్టాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పులసల సీజన్ షురూ.. మొదటి పులసను పట్టేశారుగా
మేడపై ఆవు ప్రత్యక్షం.. ఆశ్చర్యంలో స్థానికులు
ఎయిర్‌పోర్ట్‌లో కుప్పలుతెప్పలుగా ఈల్ చేపలు !! చూసి షాక్ తిన్న ప్రయాణికులు
కూతురే కాదు తల్లి కూడా అదే దందాలో.. వీడియో వైరల్
పిచ్చి గీతల ప్రిస్క్రిప్షన్లు.. ఎంత పని చేస్తున్నాయో తెలుసా ??
ఇక రైళ్లలో 'డగ డగ' శబ్దాలు వినిపించవు.. కుదుపులూ తగ్గుతాయి.. !
చైనా యావో మహిళల పొడవైన జుట్టు సీక్రెట్.. రైస్ వాటరా ??
స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న వ్యక్తి.. అంతలోనే..
సామాన్య పాస్టర్ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు
పేద భక్తులకు రూ.100కే శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజ
గ్యాస్ రాలేదు కానీ.. డెలివరీ అయినట్లు ఓటీపీ వచ్చింది
సార్.. ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ.. విద్యార్థి ఫోన్ కాల్

