Manu Bhaker: 22 ఏళ్లకే ఒలింపిక్స్‌లో పతకం.. అందంలోనే కాదు, సంపాదనలోనూ తగ్గేదేలే.. మను బాకర్ నెట్‌వర్త్ ఎంతంటే?

Manu Bhaker bronze medal Paris Olympics 2024 Networth: భారత కుమార్తె మను భాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఒలింపిక్స్‌ చరిత్రలో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ మను నిలిచింది. ఫైనల్లో 221.7 పాయింట్లతో కాంస్యం సాధించింది.

Manu Bhaker: 22 ఏళ్లకే ఒలింపిక్స్‌లో పతకం.. అందంలోనే కాదు, సంపాదనలోనూ తగ్గేదేలే.. మను బాకర్ నెట్‌వర్త్ ఎంతంటే?
Manu Bhaker
Follow us
Venkata Chari

|

Updated on: Jul 29, 2024 | 8:11 AM

Manu Bhaker bronze medal Paris Olympics 2024 Networth: భారత కుమార్తె మను భాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఒలింపిక్స్‌ చరిత్రలో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ మను నిలిచింది. ఫైనల్లో 221.7 పాయింట్లతో కాంస్యం సాధించింది. మను గురించి మాట్లాడితే, ఆమె చాలా తక్కువ వయసులోనే కోట్లాది అభిమానులను సంపాదించుకోవడంతో పాటు కోట్ల రూపాయలను కూడా సంపాదించింది. ప్రస్తుతం దేశంలో మను పేరు మార్మోగిపోతుంది.

2021 టోక్యో ఒలింపిక్స్‌లో మను పిస్టల్ పాడైన సంగతి తెలిసిందే. ఆమె 20 నిమిషాల పాటు గురిపెట్టలేకపోయింది. పిస్టల్ రిపేర్ చేసిన తర్వాత కూడా, మను కేవలం 14 షాట్లు మాత్రమే షూట్ చేయగలిగింది. దీంతో ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ కారణంగా మను చాలా బాధపడింది. కానీ ఆమె పూర్తి ఉత్సాహంతో తిరిగి వచ్చి పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి పతకాన్ని అందించింది. పారిస్ ఒలింపిక్స్‌లో కొరియాకు చెందిన ఓహ్ యే జిన్ స్వర్ణం సాధించింది. 243.2 పాయింట్లు సాధించి ఒలింపిక్ రికార్డు సృష్టించింది. కొరియాకు చెందిన కిమ్ యెజీ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఆమె 241.3 పాయింట్లు సాధించింది.

ఇవి కూడా చదవండి

12 ఏళ్ల కరువుకు స్వస్తి..

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు తొలి పతకాన్ని సాధించిపెట్టడం ద్వారా షూటింగ్‌లో 12 ఏళ్ల కరువును మను భాకర్ ముగించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల ఈవెంట్‌లో మను భాకర్ కాంస్య పతకాన్ని ప్రపంచవ్యాప్తంగా భారతదేశం గర్వించేలా చేసింది. మను వయసు కేవలం 22 ఏళ్లే.. అయినా తన ప్రతిభతో ప్రపంచంలోనే పేరు తెచ్చుకుంది.

22 ఏళ్లకే కోట్లకు చేరిన నెట్ వర్త్..

మను భాకర్ 2018లో అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు పతకం సాధించింది. ఇది మాత్రమే కాదు, మను ISSF ప్రపంచ కప్‌తో పాటు, కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా పతకాలు సాధించింది. మను 22 ఏళ్లకే కోటీశ్వరాలైంది.

మీడియా నివేదికల ప్రకారం, మను భాకర్ నికర విలువ, టోర్నమెంట్ల నుంచి వచ్చిన డబ్బు, ప్రైజ్ మనీ, ఎండార్స్‌మెంట్లు, స్పాన్సర్‌షిప్‌లతో కలిపి మొత్తం రూ.12 కోట్లు అందుకుంది. మను భారతదేశంలో షూటింగ్ పోస్టర్ గర్ల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఆమె పాపులారిటీ గురించి మాట్లాడితే, ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో 2 లక్షల మంది, X లో 1.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

హర్యానా ప్రభుత్వం సత్కారం..

కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించిన మను భాకర్‌ను హర్యానా ప్రభుత్వం సత్కరించి రూ.2 కోట్లు అందజేసింది. టోర్నమెంట్లలో గెలుపొందిన వారికి ప్రభుత్వాలు ప్రైజ్ మనీ అందిస్తున్న సంగతి తెలిసిందే. OG Q మను భాకర్‌ను స్పాన్సర్ చేస్తుంది. ఇది మాత్రమే కాదు, మను శిక్షణ, ఆమె టోర్నమెంట్ శిక్షణ ఖర్చులను కూడా కంపెనీ భరిస్తుంది.

మరిన్న క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం